శృంగారం అనేది కేవలం రెండు శరీరాలకు సంబంధించినది కాదు. దాని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా మానిసక ప్రశాంతంతను, ఉల్లాసాన్ని అందిస్తుంది. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే... ఇవి కాకుండా దీని వల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. కొద్ది నిమిషాలపాటు సాగే... ఈ ప్రక్రియ ద్వారా శరీరంలోని కొవ్వు శాతం తగ్గుతుందని నిపుణులు  చెబుతున్నారు. అంతేకాదు. మోదోశక్తి కూడా పెరుగుతుంది.

మలి వయసులో శృంగారాన్ని ఆస్వాదిస్తే... మతిమరుపు మన దరికి చేరదని ఇప్పటికే చాలా పరిశోధనల్లో శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. అంతేకాదు.. సెక్స్ వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరి చేరకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వారానొకసారి శృంగారంలో పాల్గొంటే... వారు ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉందని ఓ పరిశోధనలో తేలింది. వారిలో మరణం సంభవించే రేటు 37శాతం తగ్గినట్లు తేలిందని నిపుణులు చెబుతున్నారు. వారానొకసారైనా శృంగారాన్ని ఆస్వాదించగలిగితే.. వారు ఎక్కువ కాలం జీవించగలరని వారు చెబుతున్నారు.

65ఏళ్ల లోపు ఉన్న 1120 మంది వ్యాధిగ్రస్తులను పరీక్షించగా వారిలో వారానికొకసారి క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొనేవారిలో 37శాతం మరణం సంభవించే రేటు తగ్గందట. అంతేకంటే ఎక్కువ సార్లు పాల్గొనవారిలో 33శాతం, వారానికి ఒకసారి లేదా అంతకంటే తక్కువ సార్లు శృంగారంలో పాల్గొనేవారిలో 28శాతం మరణం సంభవించే అవకాశం తక్కువగా ఉందని తేలింది.