ఈ నెలలో అద్భుతమైన ముహుర్తాలు... పెళ్లిళ్లే పెళ్లిళ్లు..!
ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి.. మరోవైపు పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఈనెల 4వ తేదీనాటికి అమావాస్యతో చైత్రమాసం ముగిసి.. 5వ తేదీ నుంచి వైశాఖమాసం ప్రారంభమయింది. దీంతో బుధవారం నుంచి వివాహ ముహూర్తాలు ఆరంభమయ్యాయి.

ఈనెల 15, 16, 22, 23, 25, 29, 30, 31 తేదీలు, అలాగే జ్యేష్ఠమాసం (జూన్)లో 5, 6, 9, 12, 13, 14, 19, 20, 22, 27, 28, 29, 30 తేదీల్లో వివాహ ముహూర్తాలున్నాయి. అయితే ఈనెలలో 15, 16, 22, 23, 29 తేదీలకు మాత్రం విపరీతమైన డిమాండు ఉుంది. ఈ తేదీల్లో ఒక్కోరోజు జిల్లావ్యాప్తంగా సుమారు 6 వేలకు పైగా వివాహాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ కారణంగా కల్యాణమండపాలకు భారీ డిమాండు ఏర్పడింది. అలాగే పురోహితులు కూడా దొరకని పరిస్థితి కూడా ఉంది.
ఈ ముహుర్తాలు చాలా బాగున్నాయని... అందరూ... ఈ రోజుల్లోనే పెళ్లిళ్లు పెట్టుకుంటున్నారు. అందులోనూ అందరికీ వేసవి సెలవలు కావడంతో.. కలసి వస్తుందని భావిస్తున్నారు.సాధారణ ముహూర్తాల రోజుల్లో ఎలా ఉన్నా కీలకమైన ముహూర్తాలున్న 15, 16, 22, 23, 29 తేదీల్లో పురోహితులకు విపరీతమైన డిమాండు ఉంది. ముహూర్తాలు బాగున్న కారణంగా వివాహాలతోపాటు ఆ రోజుల్లో గృహప్రవేశాలు అదేస్థాయిలో ఉన్నట్లు పురోహితవర్గాలు పేర్కొంటున్నాయి.