వర్షాకాలం వచ్చిందంటే చాలు.. పిలవకుండానే జలుబు, దగ్గులాంటివి వచ్చి కూర్చుంటాయి. ఒక్క జలుబు చేస్తే చాలు ప్రపంచంలోని సర్వరోగాలు మనోతోనే ఉన్న భావన కులుగుతుంది. ఈ జలుబుకి మందులు వేసుకున్నా... వేసుకోకున్నా పెద్దగా తేడా ఏమీ ఉండదు. అయితే ఈ సీజనల్ జబ్బులకు శృంగారంతో చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. మీరు చదివింది నిజమే.. ఓ సంస్థ జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది.

ఇప్పటి వరకు శృంగారం వల్ల సంతోషం, ఆనందం, ఉత్సాహం కలుగుతాయని మనకు తెలుసు. అయితే దీని వల్ల మరిన్ని లాభాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. శరీరంలో ఒత్తిడిని తొలగించడంలో శృంగారం ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

 అంతేకాదు.. జలుబు రాకుండానూ శృంగారం కాపాడుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనే యువతీ యువకుల లాలాజలంలో జలుబుతో పోరాడే యాంటీబాడీలో పెద్దమొత్తంలో ఉంటుండటం విశేషం.