ఫోర్న్ స్టార్ మియా ఖలీఫా పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఓ భర్త భార్యకు ఖరీధైన బిర్కిన్ బ్యాగ్ కొనిచ్చాడు. అదీ మియా ఖలీఫా సమక్షంలో ఇంతకీ ఏం జరిగిందంటే...
పారీస్ : కొత్తగా పెళ్లైన ఓ వ్యక్తి భార్యతో కలిసి హనీమూన్ కు పారీస్ వెళ్లాడు. ఓ మాంచి హోటల్ లో బస. ఇంకేముందు ఫుల్ ఎంజాయ్ అనుకుంటున్నారా? అక్కడ అతనికి హోటల్ లాబీలో తన అభిమాన తార మియా ఖలీఫా కనిపించింది. ఇంకేముంది ఆమెను అలా చూస్తూ రూంకు వెళ్లడం లేటయ్యింది.
అసలే కొత్తగా పెళ్లయ్యింది. భార్య ఊరుకుంటుందా? ఎక్కడికి వెళ్లావ్..ఎంటీ సంగతి? అంటూ కేకలేసింది.. ఆ సమయంలో మియా ఖలీఫా అక్కడే ఉంది.. ఇంకేముంది.. భార్యను ఐస్ చేయడానికి ఓ సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. అదీ మామూలు గిఫ్ట్ కాదండోయ్.. బిర్కిన్ బ్యాగ్.
ఈ బిర్కిన్ బ్యాగ్ ప్రీమియం బ్రాండ్ హ్యాండ్‌బ్యాగ్‌ల ధర రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. ఆ బ్యాగ్ చూసి ఆ భార్య మొదట షాక్ అయ్యింది. ఆ తరువాత సంతోషంలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన పోస్టును స్వయంగా మాజీ పోర్న్ స్టార్ మియా ఖలీఫా తన ట్విటర్ అకౌంట్ లో షేర్ చేసింది. ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో ట్రాక్షన్ పొందుతోంది. మియా ఖలీఫా సమక్షంలో ఓ భార్యకు బిర్కిన్ హ్యాండ్‌బ్యాగ్ ఎలా గిఫ్ట్ గా వచ్చిందో కనిపిస్తుంది.
ఈ పోస్ట్ ను మియా జూన్ 13న తన ట్విట్టర్‌లో ఓ వీడియోలోని స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది, ఇది అంతకుముందు టిక్‌టాక్‌లో మియా ఇన్‌ఫ్లుయెన్సర్ పోస్ట్ చేసిన వీడియోలోని స్క్రీన్ షాట్. ఫొటోలో బిర్కిన్ బ్యాగ్ కూడా ఉంది. దీన్ని మియా పోస్ట్ చేస్తూ...
"పారిస్‌లోని ఆ హోటల్‌లో వీరు నాతోపాటే బస చేశారు. గత రాత్రి డిన్నర్‌లో వీరు నన్ను చూశారట. ఉదయం నన్ను చూసిన ఆనందంలో భర్త ఆమెకు బిర్కిన్ బ్యాగ్ కొనిచ్చాడు. సంతోషం పట్టలేక దాన్ని టిక్ టాక్ వీడియో చేసి.. టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది’’ అని చెప్పుకొచ్చింది.
మియా షేర్ చేసిన వీడియోలో ముగ్గురు వ్యక్తులున్నారు. ఇందులో మహిళ తన భర్తపై అరుస్తుంటే.. అతను బిర్కిన్ బ్యాగ్ ను ఆమె ముందు పెట్టడం కనిపిస్తుంది. ఆ మహిళ పక్కనే మియా ఖలీఫా ఆశ్చర్యంగా చూస్తూ కనిపిస్తుంది. దీనికి "అవును, మేము కలుసుకున్నాం" అని క్యాప్షన్ ఉంది.
ఈ వీడియోకి ఇప్పటి వరకు ట్విటర్‌లో 5.9 లక్షల వ్యూస్ వచ్చాయి. దీనిమీద నెటిజన్లు విచిత్రంగా స్పందించారు. ఫన్నీ కామెంట్స్ చేశారు. "వాట్ ఎ టర్న్ ఆఫ్ ఈవెంట్స్" అని ఒకరు అనగా, మరొకరు బాబోయ్.. నువ్వు చాలా లక్కీ.. ఒక్క బ్యాగ్ తో బయటపడ్డావ్.. నేనైతే దుకాణం మొత్తం కొనివ్వాల్సి వచ్చేది..అంటూ కామెంటాడు.
