సెక్స్ కల్ట్ నడుపుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికాకు చెందిన సెల్ఫ్ స్టైల్డ్ గురు కీత్ రానీరేకు 120యేళ్ల జైలు శిక్ష వేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 60 యేళ్ల కీత్ రానీరే తన దగ్గరికి వచ్చే ధనవంతులైన భక్తులను తనతో లైంగిక సంబంధం పెట్టుకోమని బలవంతపెట్టేవాడని తేలడంతో కోర్టు దోషిగా తేల్చింది.

nxivm అనే లైఫ్-కోచింగ్ గ్రూప్ ముసుగులో సెక్స్ బానిసలను తయారు చేస్తున్నాడని అతనిమీద ఆరోపణలున్నాయి. ఈ గ్రూప్ లో చేరడానికి పాలోవర్స్ ఐదువేల డాలర్లు కట్టాల్సి ఉంటుంది. అయితే వీరిలో కొంతమందిని ఆర్థికంగా, లైంగికంగా వాడుకోవడమే కాకుండా వారిని నిర్భందంగా డైట్ చేసేలా బలవంతపెట్టేవాడు. 

గ్రూప్ లో DOS అనే ఓ ఫ్యాక్షన్ ను కూడా ఏర్పాటు చేశాడు. ఇది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఇందులో బానిసలుగా స్త్రీలు ఉంటే పై స్థానంలో గ్రాండ్ మాస్టర్ గా రానిరే కూర్చుని ఉంటాడు. ఈ బానిసలు రానిరేతో సెక్స్ చేయడానికి మాత్రమే  తయారుచేయబడ్డారు. వారి వ్యక్తిగత వివరాలు, సన్నిహిత ఫొటోలు అన్నీ రానిరే ఆధీనంలో ఉంటాయి. కొంతమంది వీటిని పట్టుకోవడంతో వారిని పశువులుగా ముద్రవేశాడు. 

2019 జూన్ లో రానిరే అక్రమాలు బైటికి వచ్చాయి. అతని మీద సెక్స్ ట్రాఫికింగ్, దోపిడీ, నేరపూరిత కుట్రలాంటి ఏడు కేసులు నమోదయ్యాయి. పర్సనల్ డెవలప్ మెంట్ కోర్సులో ఓ సబ్ గ్రూప్ గా సెక్స్ సెషన్స్ నిర్వహించేవాడు. ఈ గ్రూపు ద్వారా 20 మంది మహిళలను ఇలా బానిసలుగా మార్చాడు. వీరిలో 15 యేళ్ల బాలిక కూడా ఉండడం దారుణం.