ఆడపిల్లలు ఇంట్లో నుంచి బయటకు అడుగుపెడితే.. క్షేమంగా వస్తారో లేదో అని చాలా మంది భయపడిపోతున్నారు.  ఎందుకంటే పరిస్థితులు అలా మారిపోతున్నాయి. ప్రతిరోజూ ఏదో ఒక మూల.. ఎవరో ఓ ఆడ పిల్ల కామాంధుల బారిన పడుతున్నారనే వార్తలు వినపడుతూనే ఉన్నాయి.  కాగా.. కేవలం ఆడపిల్లలే కాదు.. జంతువులకు కూడా రక్షణ లేదని తెలుస్తోంది.

 ఓ వ్యక్తి ఏకంగా ఇంట్లో పెంచుకునే కోడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన యూకేలో చోటుచేసుకోగా.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

యూకేకి చెందిన విలే రెహాన్ బైక్ (37) అనే వ్యక్తి కోళ్ల మీద పగపట్టాడు. కోడి కనపడితే పాపం.. దానిపై అత్యాచారానికి పాల్పడేవాడు. కాగా.. భర్త చేస్తున్న పనిని భార్య వీడియో రూపంలొ చిత్రీకరించేది. అనంతరం ఆ  వీడియోలను కంప్యూటర్ లో సేవ్ చేసింది. వాటిని సేవ్ చేసిన ఫోల్డర్ కి ఫ్యామిలీ వీడియోస్ అని పేరు కూడా పెట్టడం గమనార్హం.

కాగా.. ఇటీవల ఆ వీడియోలు లీక్ అవ్వడంతో వైరల్ గా మారాయి. దీంతో.. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను చేసిన నేరం అంగీకరించడంతో అతనికి మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించారు. కాగా.. తన భర్త రేప్ చేయడం వల్ల కోళ్లు చనిపోతే.. వాటిని తర్వాత కూర వండేదానినని అతని భార్య చెప్పడం విశేషం. 

రెహాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ కేసు నుంచి భార్య హలీమా బైగ్ తప్పించుకుంది. రెహాన్ తనను వేధింపులకు గురిచేసేవాడని, తప్పనిసరి పరిస్థితుల్లో అతడికి సహకరించాల్సి వచ్చిందని తెలిపింది. దీంతో కోర్టు ఆమెకు ఎటువంటి శిక్ష విధించలేదు.