Global Warming : మూడు డిగ్రీలకు చేరువలో భూగోళపు వేడి.. డేంజర్ లో మానవాళి..

గ్లోబల్ వార్మింగ్‌ను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలంటే అన్ని దేశాలు ఉద్గారాలను 28 శాతం తగ్గించాలి. 1.5 డిగ్రీల సెల్సియస్ లక్ష్యాన్ని చేరుకోవడానికి 42 శాతానికి తగ్గించాలి.

Global Warming : Global heat approaching three degrees, Humanity in danger,  UN Report - bsb

న్యూఢిల్లీ : గత కొంతకాలంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి.  కాలంతో సంబంధం లేకుండా వర్షాలు, చలి, ఎండ కాస్తున్నాయి. ఒకటే రోజులో  ఈ మూడు కాలాలు కనిపిస్తున్న రోజులు కూడా ఇటీవల కాలంలో అందరికీ అనుభవన్లోకి వచ్చిందే. మరోవైపు కాలుష్యం, సహజ వనరుల ఉపయోగం మితిమీరిపోవడం, ఇష్టానుసారంగా అడవులను, పచ్చని చెట్లను నరికేయడం.. పారిశ్రామికీకరణ.. వెరసి భూగోళం వేడెక్కుతోంది. భూతాపం పెరుగుతూ పోయి.. కొద్ది రోజుల్లో దాని అంతిమ హద్దు అయిన ‘2 డిగ్రీలు’ దాటనుంది.

ఈ మేరకు ఇలాంటి పరిస్థితి ప్రపంచ దేశాలకు ఎదురుకాకుండా ఉండాలని, భూగోళం ప్రమాదంలో పడకుండా ఉండాలని పర్యావరణ ప్రియులు శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ప్రపంచంలోనే అన్ని దేశాలు ఎన్నో దశాబ్దాలుగా ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం కోసం అనేక రకాల ప్రయత్నాలను, మేధో మథనాలను జరుపుతున్నారు. ఎన్ని భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని.. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవన్నీ కాగితాలకే పరిమితం అవుతున్నాయని తేలిపోయింది.

India-Bound Ship Hijack Video : ఇండియాకు వస్తున్న కార్గో షిప్ హైజాక్.. వీడియోను విడుదల చేసిన హౌతీ రెబల్స్...

దీంతోనే నవంబర్ 17న తొలిసారిగా భూమి రెండు డిగ్రీల మార్కును దాటి పరిస్థితి ఎలా ఉంటుందో రుచి చూపించింది.  గత శుక్రవారం తొలిసారిగా భూతాపంలో రెండు డిగ్రీల పెరుగుదల నమోదయింది. ఇది ఈ శతాబ్దం చివరి నాటికి ప్రపంచం పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే దాదాపు 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదలకు దారి తీస్తుందని. సోమవారం ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన కొత్త నివేదిక తెలుపుతోంది.

గ్లోబల్ వార్మింగ్‌ను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడానికి దేశాలు ఉద్గారాలను 28 శాతం తగ్గించాలని, 1.5 డిగ్రీల సెల్సియస్ లక్ష్యాన్ని చేరుకోవడానికి 42 శాతానికి తగ్గించాలని ఐక్యరాజ్యసమితి ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ ఉద్గారాల గ్యాప్ నివేదిక 2023 "బ్రోకెన్ రికార్డ్" పేరుతో విడుదల చేసింది.

దుబాయ్‌లో జరిగే వార్షిక ఐక్యరాజ్యసమితి వాతావరణ చర్చలు లేదా COP28 28వ సెషన్‌కు ముందు విడుదల చేసిన నివేదిక 2021-2022లో ప్రపంచ ఉద్గారాలు 1.2 శాతం పెరిగాయని పేర్కొంది. ఇందులో.. పారిస్ ఒప్పందం ప్రకారం, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతను 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంచేలా చూడాలని, ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసే ప్రయత్నాలను కొనసాగించాలని దేశాలు అంగీకరించాయి.

నివేదిక 2016 ఎడిషన్‌లో సాధారణ దృష్టాంతంలో 3.4 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసినందున పారిస్ ఒప్పందంపై సంతకం చేసినప్పటి నుండి అన్ని దేశాలు గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో పురోగతి సాధించాయని నివేదిక పేర్కొంది. కానీ, పురోగతి ఉన్నప్పటికీ, వాతావరణ మార్పులు తీవ్రమైన, విధ్వంసకరమైన, కోలుకోలేని విధంగా ప్రభావం చూపించకుండా ఉండాలంటే.. గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలని.. దీనికి ప్రపంచదేశాలు చాలా దూరంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. 

ప్రపంచం ఇప్పటికే 1.1 డిగ్రీల గ్లోబల్ వార్మింగ్ సమయంలో విపరీతమైన వేడి, వరదలు, కార్చిచ్చు, తుఫాను, కరువులను అనుభవిస్తోంది. అక్టోబర్ ప్రారంభం వరకు, ఈ సంవత్సరంలో 86 రోజులు 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక పూర్వ స్థాయి కంటే 1.8 డిగ్రీల సెల్సియస్‌తో అత్యధికంగా నమోదైన నెల సెప్టెంబర్.

"1.5 డిగ్రీలకే గ్లోబల్ వార్మింగ్ ను పరిమితం చేయడం ఇప్పటికీ సాధ్యమేనని మాకు తెలుసు. దీనికి వాతావరణంలో ఉన్న విషపూరిత మూలకాలను తొలగించడం అవసరం." అని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. శక్తి పరివర్తనపై దృష్టి సారించాలని, తక్కువ-కార్బన్ వెలువడేలా అభివృద్ధి పరివర్తనలను తీసుకురావాలని నివేదిక అన్ని దేశాలకు పిలుపునిచ్చింది.

నవంబర్ 17న భూతాపం పెరుగుదల రెండు డిగ్నీల సెంటీగ్రేడ్ల సరిహద్దును దాటింది కాసేపు మాత్రమే. అయితే, భూమి నానాటికీ విపరీతంగా వేడెక్కిపోతోందనడానికి ఇదే నిదర్శం అని.. ఒక వేళ అదే జరిగితే విపరీతపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. మానవాళి చేతులారా వినాశనాన్ని కొని తెచ్చుకున్నట్లేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios