India-Bound Ship Hijack Video : ఇండియాకు వస్తున్న కార్గో షిప్ హైజాక్.. వీడియోను విడుదల చేసిన హౌతీ రెబల్స్...

టర్కీకి చెందిన ఓడ భారత్‌కు వెళుతుండగా నిన్న హైజాక్‌కు గురైంది. దీనికి సంబంధించిన ఓ రెండు నిమిషాల వీడియో క్లిప్ వెలుగు చూసిం

India-Bound Ship Hijack Video : Yemen's Houthi Rebels Share Alleged Video - bsb

హైజాక్ చేయబడిన కార్గో షిప్ "గెలాక్సీ లీడర్" వీడియోను యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు విడుదల చేశారు. హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని చెప్పినతిరుగుబాటుదారులు హైజాక్ చేసిన ఓడ ఇజ్రాయెల్ దే అని నొక్కి చెప్పారు. అయితే, దీనికి ఇజ్రాయెల్ తిరస్కరించింది, ఆ ఓడలో ఇజ్రాయెల్ పౌరులు కూడా లేరని పేర్కొంది. 

టర్కీకి చెందిన ఓడ భారత్‌కు వెళుతుండగా నిన్న హైజాక్‌కు గురైంది. దీనికి సంబంధించిన ఓ రెండు నిమిషాల వీడియో క్లిప్ విడుదల చేసింది. దీంట్లో హైజాక్‌ కు సంబంధించి విజువల్స్ వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. 

తిరుగుబాటుదారులు హెలికాప్టర్‌లో వచ్చారు. ఎవరూ లేని ఓడ డెక్‌పై హెలికాప్టర్‌ ల్యాండ్ అయింది. తర్వాత వారు నినాదాలు చేస్తూ, కాల్పులు జరుపుతూ, డెక్ మీదుగా పరిగెత్తుతూ.. వీల్‌హౌస్, కంట్రోల్ సెంటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీడియోలో కనిపించిన కొద్దిమంది సిబ్బంది వారిని చూసి.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. చేతులు పైకి ఎత్తి సరెండర్ అయ్యారు. ఇతర తిరుగుబాటుదారులు ఓడలో దూసుకుపోతూ, కాల్పులు జరుపుతున్నారు.

నౌకను హొడెయిడా ప్రావిన్స్‌లోని సలీఫ్ పోర్ట్‌లోని యెమెన్ నౌకాశ్రయానికి మళ్లించారని, సముద్ర భద్రతా సంస్థ అంబ్రే, యెమెన్ సముద్ర మూలాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ AFP నివేదించింది. ఇలా హైజాక్ చేయడం "ప్రారంభం మాత్రమే" అని హుతీ ప్రతినిధి మహ్మద్ అబ్దుల్-సలాం ఆదివారం ఎక్స్ లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. గతంలోనే ఇజ్రాయెల్ గాజాలో తన ప్రచారాన్ని నిలిపివేసే వరకు మరింత సముద్ర దాడులను దిగుతామని ట్విట్టర్లో ప్రతిజ్ఞ చేశాడు.

బహామాస్ జెండాతో కూడిన ఓడలో వివిధ దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారు. ఇది ఇజ్రాయెల్ వ్యాపారవేత్త అబ్రహం "రామి" ఉంగార్‌ కు సంబంధించిన బ్రిటిష్ కంపెనీకి చెందినది. హైజాకింగ్ సమయంలో ఓడను జపాన్ కంపెనీకి లీజుకు ఇచ్చారు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న ఓడలను లక్ష్యంగా చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. హైజాక్ తర్వాత, వారు ఇజ్రాయెల్ నౌకలు "చట్టబద్ధమైన లక్ష్యాలు" అని నొక్కి చెప్పారు.

ఇజ్రాయెల్ నౌకలు మాకు ఎక్కడైనా చట్టబద్ధమైన లక్ష్యాలే. ఇవి కనిపిస్తే వాటిపై చర్య తీసుకోవడానికి వెనుకాడం" అని హుతీ సైనిక అధికారి మేజర్ జనరల్ అలీ అల్-మోష్కి వారి అల్-మస్సిరా TV స్టేషన్ లో పేర్కొన్నట్లు ఏఎఫ్ పి తెలిపింది.

అయితే, ఇజ్రాయెల్ హైజాక్‌ను ఖండించింది. ఇరాన్‌ను నిందించింది. "అంతర్జాతీయ నౌకపై ఇరాన్ దాడిని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండిస్తుంది" అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం నుండి ఎక్స్ లో ఒక పోస్ట్ విడుదలయ్యింది. "ఇది ఇరాన్ టెర్రరిజంలో మరొక చర్య,  గ్లోబల్ షిప్పింగ్ లేన్ల భద్రతకు సంబంధించి అంతర్జాతీయ పరిణామాలతో స్వేచ్ఛా ప్రపంచంలోని పౌరులపై ఇరాన్ దురాక్రమణ చేస్తుంది" అని దాని పోస్ట్‌లలో పేర్కొంది. ఈ ఆరోపణలను ఇరాన్ తోసిపుచ్చింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios