గ్యానాజువాటో: మెక్సికోలో ఓ ఉన్మాది మారణహోమం సృష్టించాడు. జరల్ డెల్ ప్రాగ్రెసో అనే నగరంలోని ఓ బార్ లోకి మారణాయుదంతో ప్రవేశించిన ఓ వ్యక్తి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో 11మంది మృతిచెందగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ కాల్పుల్లో నలుగురు మహిళలు(బార్ డ్యాన్సర్లు) కూడా మృతిచెందారు. మాదవద్రవ్యాల ముఠాకు చెందిన వ్యక్తే ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ వారు ఎందుకు ఈ మారణహోమాన్ని సృష్టించారో మాత్రం తెలియడంలేదని మెక్సికో పోలీసులు పేర్కొన్నారు. 

మెక్సికోలో హింసాత్మక ఘటనకు కేరాఫ్ అడ్రస్ గ్యానాజువాటో. ఇటీవలే కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ ఆంటోనియా ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇక హింసాత్మక ఘటనలు తగ్గుతాయని అందరూ భావించారు. అయితే నేరాల్లో మాత్రం మార్పేమీ లేదు. తాజా కాల్పులతో మరోసారి మెక్సికో ఉలిక్కిపడ్డారు.