Mexico Shootout : మెక్సికోలో మరణహోమం సృష్టించబడింది. ఓ వేడుకలో దుండగులు కాల్పులకు తెగబడి.. 19 మందిని అత్యంత దారుణంగా హతమర్చారు. వీరిలో 13 మంది పురుషులు, మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఆ ఘటనలో గాయపడిన మరికొంత మంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు అక్కడి స్టేట్ అటార్నీ జనరల్ కార్యాలయం (ఎఫ్జీఈ) వెల్లడించింది.