Asianet News TeluguAsianet News Telugu

నేడు ఎవరూ గుర్తించని మహిళా స్వాంతంత్య్ర సమరయోధులు వీళ్లు.. బ్రిటీష్ వారికే దడ పుట్టించారు

వలసపాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేడానికి ఎందరో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. కానీ వీరిలో కొందరి పేర్లు మరుగున పడ్డాయి. ముఖ్యంగా మహిళా స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు. అవును వీళ్లు పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కాదు. చిత్రహింసలు, దోపీడీలను ఎదుర్కొని మరీ స్వాతంత్య్రోద్యమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. ఇలాంటి వారిలో కొందరు మహిళా స్వాతంత్య్ర  సమరయోధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Independence Day 2023: Forgotten Women Freedom Fighters of India rsl
Author
First Published Aug 7, 2023, 1:58 PM IST

మాతంగిని హజ్రా

మాతంగినీ హజ్రాను గాంధీ బురి అని కూడా పిలిచేవారు. ఈమె క్విట్ ఇండియా ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఒక ఊరేగింపులో ఈమెను మూడు సార్లు కాల్చారు. అయినా కూడా భారత జెండాతో ముందుకు సాగింది. 'వందేమాతరం' వందేమాతరం అంటూ నినదిస్తూనే ముందుకు సాగింది. స్వతంత్ర భారతదేశంలోని 1977 లో కోల్ కతాలో మొదటి ఒక మహిళా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అది ఎవరిదో కాదు హజ్రాదే.  తమ్లుక్ లో ఈ విగ్రహం ఉంది. ఇక్కడే ఆమె హత్యకు గురైంది. అంతేకాదు కోల్ కతాలోని హజ్రా రోడ్డుకు కూడా ఆమె పేరు పెట్టారు.

కనకలత బారువా

కనకలత బారువాను బీర్బాల అని కూడా పిలుస్తారు. ఆమె అస్సాంకు చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధురాలు. 1942లో బరంగబరిలో క్విట్ ఇండియా ఉద్యమం పాల్గొన్నారు. అంతేకాదు చేతిలో జాతీయ పతాకాన్ని పట్టుకొని మహిళా వాలంటీర్ల వరుసలో నిలబడ్డారు. బ్రిటీష్ ప్రాబల్యం ఉన్న గోహ్ పూర్ పోలీస్ స్టేషన్ లో 'బ్రిటిష్ సామ్రాజ్యవాదులు వెనక్కి వెళ్లిపోవాలి' అనే నినాదాలతో జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఆమె పెట్టుకున్నారు. కానీ బ్రిటీషర్లు దీనిని నిషేధించారు. ఆమె ఉద్దేశాలు ఉదాత్తమైనవని ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ బ్రిటిష్ పోలీసులు ఆమెను కాల్చి చంపా. ఈమె 18 సంవత్సరాల వయస్సులోనే  దేశం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహానీయురాలిగా పేరు పొందింది.

అరుణా అసఫ్ అలీ

స్వాతంత్య్రోద్యమంలో 'ది గ్రాండ్ ఓల్డ్ లేడీ'గా ప్రసిద్ధి చెందారు అరుణా ఆసల్ ఆలి. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బొంబాయిలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో భారత జాతీయ కాంగ్రెస్ జెండాను ఎగురవేసారు. దీంతో ఈమె భారత స్వాతంత్ర్య ఉద్యమకారిణిగా, స్వాతంత్ర్య సమరయోధురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంతో పాటుగా ఇతర నిరసన ర్యాలీల్లోనూ ఈమె పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. రాజకీయ ఖైదీలను సంఘటితం చేసి జైళ్లలో జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ నిరాహార దీక్ష చేపట్టారు.

భికైజీ కామా

భారత జాతీయోద్యమంలో ప్రముఖ వ్యక్తి అయిన భిజైజీ కామా 24 సెప్టెంబరు 1861 న బొంబాయి లోని పార్శీ కుటుంబంలో భికైజీ రుస్తుం కామాగా జన్మించింది. వివరంగా చెప్పాలంటే ఈమె ఎవరో కాదు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మేడమ్ కామానే. ఆమె తండ్రి సొరాబ్జీ ఫ్రాంజీ పటేల్ పార్సీ కమ్యూనిటీలో శక్తివంతమైన సభ్యుడు. స్త్రీ, పురుషుల మధ్య సమానత్వాన్ని ఆమె నొక్కి చెప్పారు. తన ఆస్తినంతా యువతుల అనాథాశ్రమానికి విరాళంగా ఇచ్చేసింది. భారత రాయబారిగా 1907లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు జర్మనీ వెళ్లారు.

తారా రాణి శ్రీవాస్తవ

తారా రాణి బీహార్ లోని సరన్ లో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది. ఇమే ఫూలేందు బాబును వివాహం చేసుకుంది. వీరు 1942 లో గాంధీజీ  చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. నిరసనలను నియంత్రించారు. అలాగే సివాన్ పోలీస్ స్టేషన్ పైకప్పుపై భారత జెండాను ఎగురవేయాలనుకున్నారు.  'ఇంక్విలాబ్' అంటూ నినాదాలు చేస్తూ సివాన్ పోలీస్ స్టేషన్ వైపు ర్యాలీగా బయలుదేరారు. కానీ ఈ సమయంలోనే  పోలీసులు కాల్పులు జరిపారు. ఫులేందుకు తూటా తగలడంతో కిందపడిపోయాడు. అధైర్యపడని తారా తన చీర సహాయంతో అతనికి కట్టు కట్టి, భారత పతాకాన్ని చేత పట్టి 'ఇంక్విలాబ్' అని అరుస్తూ జనాన్ని స్టేషన్ వైపు నడిపించింది. ఈ కాల్పుల్లో ఆమె భర్త చనిపోయాడు. కానీ తారా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొంటూనే వచ్చింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios