ఆగస్టు 29 నే తెలుగు భాషా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు.. కొన్ని ముఖ్యమైన విషయాలు మీకోసం..
Telugu Language Day 2023: తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది గిడుగు వెంకట రామమూర్తి 160వ జయంతి వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. మన దేశంలో గుర్తింపు పొందిన 22 భాషలలో తెలుగు భాష ఒకటి. ఈ భాష ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో వాడుకలో ఉంది.
Telugu Language Day 2023: మన దేశంలో 22 భాషలకు గుర్తింపు లభించింది. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగును మాట్లాడుతారు. ఇది కాకుండా తమిళనాడు, చత్తీస్ గఢ్, కర్ణాటకలలో కూడా తెలుగు0 భాషను మాట్లాడుతారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 8.1 లక్షల మంది మాట్లాడే తెలుగు దేశంలో నాల్గో స్థానంలో ఉంది. ఈ భాషను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం ఆగష్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున ఆయా రాష్ట్రాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు తెలుగు భాష ప్రాముఖ్యతను తెలియజేస్తారు.
తెలుగు భాషా దినోత్సవాన్ని ఆగస్టు 29నే ఎందుకు జరుపుకుంటారు?
ఆగష్టు 29న తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి. తెలుగు భాషలో ఆయన చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపునకు గాను ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కవి గిడుగు వెంకట రామమూర్తి 160వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఎందుకు పిలుస్తారు?
వెనీషియన్ అన్వేషకుడు నికోలో డి కాంటి 16 వ శతాబ్దంలో విజయనగర రాజ్యాన్ని సందర్శించాడు. ఆ సమయంలో భారతదేశంలోని తెలుగు భాష పదాలకు, ఇటాలియన్ భాష పదాలకు మధ్య కొంత సారూప్యతను కనుగొన్నాడు. దీని తర్వాత ఆయన తెలుగు భాషకు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత తెలుగు ఈ పేరుతో కూడా పిలువబడింది.
తెలుగు భాషా దినోత్సవం 2023 చరిత్ర
భారతదేశంలోని ఆరు శాస్త్రీయ భాషల్లో ఒకటి తెలుగు. ఈ భాషను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతమైన యానాం లో కూడా మాట్లాడతారు.
గిడుగు వెంకట రామమూర్తి సామాన్యుడికి సమగ్రమైన భాష వాడకాన్ని సమర్ధించిన వ్యక్తిగా, పండిత భాష వాడకాన్ని వ్యతిరేకించిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు.
తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ భాషకు అంకితమైన ఎగ్జిబిషన్ ను సందర్శించే అవకాశం ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
గిడుగు వెంకట రామమూర్తి జన్మదినాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ భాషను "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని కూడా పిలుస్తారు.