Asianet News TeluguAsianet News Telugu

అంకుర స్థంసలకు కేంద్రం చేయూత.. 98,119 సంస్థలను స్టార్టప్‌లుగా గుర్తింపు..

అంకుర స్థంసలకు కేంద్రం చేయూత నిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వం 98,119 సంస్థలను స్టార్టప్‌లుగా గుర్తించింది. 

Govt recognises 98,119 entities as startups as on Apr 30 KRJ
Author
First Published Aug 4, 2023, 12:59 PM IST

దేశ యువత భవిష్యత్తుకు బంగారు బాట పరిచేందుకు.. వారి ఆలోచనలను సాకారం చేసేందుకు..నూతన ఆవిష్కరణలతో ముందుకు వస్తున్న అంకుర స్థంసలకు కేంద్రం చేయూతనిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది (ఏప్రిల్ 30 వరకు) ప్రభుత్వం 98,119 సంస్థలను స్టార్టప్‌లుగా గుర్తించింది. 

స్టార్టప్ ఇండియా పథకం కింద పన్ను ప్రయోజనాలతో సహా ప్రోత్సాహకాలను పొందడానికి ఇవి అర్హులు. స్టార్టప్‌ల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ , క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ వంటి పథకాలు తమ వ్యాపారంలో వివిధ దశలలో ఈ సంస్థలకు మద్దతు ఉంటుందని వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ తెలిపారు. పార్లమెంట్ సమావేశంలో వివిధ మంత్రులు అడిగిన సమాధానంగా ఆయన ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 

2016లో స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ ప్రారంభించినప్పటి నుండి.. DPIIT (పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రమోషన్ విభాగం) 2023 ఏప్రిల్ 30 నాటికి 98,119 సంస్థలను స్టార్టప్‌లుగా గుర్తించడాడని మంత్రి సోమ్ ప్రకాష్  చెప్పారు. అలాగే.. ఇ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ కింద నిపుణుల సలహా కమిటీ (ఈఏసీ) ఏప్రిల్ 30 నాటికి 160 ఇంక్యుబేటర్లకు రూ.611.36 కోట్లు ఆమోదించినట్లు తెలిపారు. రూ. 176.63 కోట్ల ఆర్థిక సహాయం కోసం 1,039 స్టార్టప్‌లను ఎంపిక చేసినట్టు తెలిపారు.  
 
ఇదే సమయంలో ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC)పై వాణిజ్యం , పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ONDC నెట్‌వర్.. ఆహారం  పానీయాలు, గ్రోసరీ అనే రెండు విభాగాలతో ప్రారంభమైందని, ఇప్పుడు మొబిలిటీ, ఫ్యాషన్, వ్యక్తిగత సంరక్షణ, గృహ-వంటగది, ఎలక్ట్రానిక్స్ మరియు ఉపకరణాలు, ఆరోగ్యం -సంరక్షణ విభాగాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios