అమరావతి: నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకు అమ్ముతామంటూ ఎవరైనా ముందుకు వస్తే వారితో వెంటనే ఒప్పందాలు కుదుర్చుకోవాలని సీఎం విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. దీనివల్ల డిస్కంలపై భారం తగ్గుతుందన్నారు. గత ప్రభుత్వంలో కుదుర్చుకున్న అధిక ధరల మాదిరిగా కాకుండా రీజనబుల్‌ ఖరీదుకు ఎవరు అమ్మినా విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ఆదేశించారు. తక్కువ ధరలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ముందకొచ్చే సంస్థలను ప్రోత్సహించాలని సూచించారు. 

రాష్ట్రంలో విద్యుత్‌ రంగంపై సీఎం వైఎస్ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో ఆర్థిక పరిస్థితులపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు. వీటిని పరిశీలించిన జగన్ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తీవ్ర రుణభారం, బకాయిలతో నిండిన డిస్కంలను గట్టెక్కించే మార్గాలపై ముఖ్యమంత్రి అధికారులతో ప్రధానంగా చర్చించారు. 

ప్రభుత్వం ఏర్పాటు చేయదలచుకున్న 10వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌ ప్లాంట్‌పై దృష్టిపెట్టాలని ఆదేశించారు. కాలక్రమంలో ఈ ప్లాంట్‌ను విస్తరించడానికి ప్రణాళిక  రూపొందించాలని సూచించారు. ఈ ప్లాంట్‌ను విజయవంతం చేయడానికి అధికారులు జాగ్రత్తగా, కొంచెం కష్టపడి పనిచేయాలని అన్నారు.

read more ఆ మంత్రులను వెంటనే భర్తరఫ్ చేయాలి...: కొల్లు రవీంద్ర డిమాండ్

రాష్ట్రంలో తక్కువ ధరకు అమ్ముతామంటూ ముందుకు వచ్చే సోలార్, విండ్‌ కంపెనీలను కూడా ప్రోత్సహించాలని సూచించారు. దీనివల్ల డిస్కంలకు తక్కువ ధరకే  విద్యుత్‌ దొరుకుతుందని... తద్వారా భారం తగ్గుతుందన్నారు. 

జెన్‌కో థర్మల్‌ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు వచ్చేలా చర్యలు తీసుకోవాలని... దీనివల్ల ప్లాంట్ల సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. థర్డ్‌పార్టీతో ఈ బొగ్గు నాణ్యతపై ఎప్పటికప్పుడు సర్టిఫై చేయించాలని సీఎం ఆదేశించారు. నాణ్యమైన బొగ్గు రాకపోతే ప్లాంట్ల సామర్థ్యం తగ్గి తద్వారా ఆర్థికంగా నష్టం ఏర్పడుతుందని అన్నారు. 

ఈ ఐదేళ్ల తిరక్కుండానే రాష్ట్రంలో విద్యుత్‌ రంగాన్ని నష్టాలనుంచి గట్టెక్కించాలన్న సీఎం సూచించారు. జెన్‌కోను తప్పకుండా లాభాల బాట పట్టించాలన్నారు.   హైడ్రో రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టులపైనా దృష్టిపెట్టాలని తెలిపారు. రాష్ట్రం వెలుపల విద్యుత్‌ అమ్మకాలు, ఇన్వెస్టర్లకోసం ఎక్స్‌పోర్ట్‌ పాలసీని రూపొందించాలని ఆదేశించారు. 

read more  ఆ మూడు జిల్లాల్లో అలసత్వం... వారిదే బాధ్యత...: మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరిక

విద్యుత్‌రంగంలో అవినీతికి చోటు లేకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు. కృష్ణపట్నం, వీటీపీఎస్‌ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.  పవర్‌ సెక్టార్‌ ఉద్యోగులకు క్రమం తప్పకుండా అత్యుత్తమ సంస్థల్లో శిక్షణ ఇంప్పించాలన్న సీఎం ఉన్నతాధికారులకు సూచించారు.