ఆ మంత్రులను వెంటనే భర్తరఫ్ చేయాలి...: కొల్లు రవీంద్ర డిమాండ్
కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదు ఆయన మంత్రివర్గంలోని మంత్రులందరు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని టిడిపి నాయకులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు.
విజయవాడ: నవమోసాల వైసిపి పాలనపై తెలుగుదేశం శంఖారావమే ప్రజా చైతన్య యాత్ర అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రద్దుల ప్రభుత్వం అన్నిటిని రద్దు చేస్తూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కు గురిచేస్తుందని... నవరత్నాలు అంటూ ప్రజలకు మోసంచేసి నవమోసాలు చేస్తుందని మండిపడ్డారు.
మచిలీపట్నంలోని ఫరిద్ బాబా దర్గా నుండి ప్రజా చైతన్య యాత్రను టిడిపి నాయకులు కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ రావు, బచ్చుల అర్జునుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... అధికారంలోకి వస్తే ఒక్క చార్జీలను కూడా పెంచమని చెప్పిన వైసిపి ఇప్పుడు ఆర్టీసీ, కరెంటు, ఇసుక ఇలా ప్రజా పంపిణీ, ప్రజా రవాణా అన్నింటినీ పెంచి ప్రజలపై మోయలేని భారం మోపుతుందని అన్నారు.
తుగ్లక్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఈ చేతకాని మంత్రులు ప్రజలపైనే ఎదురుదాడి చేస్తున్నారని... పోలీసులను అడ్డుపెట్టుకుని పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.
read more ఆ మూడు జిల్లాల్లో అలసత్వం... వారిదే బాధ్యత...: మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరిక
అమరావతి రైతులు దాదాపు 70 రోజులనుండి దీక్షలు చేస్తుంటే రైతు ప్రభుత్వం అని చెప్పుకునే పాలకులు కనీసం వారితో మాట్లాడకపోవడం దారుణమన్నారు.మాట్లాడటం అటుంచితే వారిమీదకి పోలీసులను ఉసిగొల్పి దాడి చేయించడం అమానుషమన్నారు. వైసిపి ప్రభుత్వానికి, పాలకులకు వ్యతిరేకంగా ఎవరు గొంతువిప్పితే వారిపై పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు.
ఈ పాలనకు చమరగీతం పాడేందుకు తెలుగుదేశం పార్టీ నడుం బిగించిందని... ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలకు అవగాహన కల్పించడానికే ఈ యాత్ర చేస్తున్నట్లు మాజీ మంత్రి వెల్లడించారు.
మంత్రులే స్వయంగా అధికారులతో లంచాలు వద్దు కానీ గిఫ్ట్ లు తీసుకొండని చెప్పడం దారుణమన్నారు. మచిలీపట్నం మునిసిపాలిటీ లో దాదాపు 13 కోట్ల పనులు టెండర్లు లేకుండానే గిఫ్ట్ రూపంలో కాంట్రాక్టర్లు ఇచ్చారన్నారు. ఇలాంటి మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు.
read more విశాఖలో దారుణం... తుపాకీతో కాల్చుకుని పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య
వైసిపి నాయకుల అవినీతిపై దర్యాప్తు సంస్థలకు పిర్యాదు చేస్తామరని హెచ్చరించారు. ప్రజా కోర్టులో కూడా వీరి అవినీతి, అక్రమాలను నిలదీస్తామన్నారు. మంత్రులు ఇసుక దందాలు, గిఫ్టుల పేరుతో... ముఖ్యమంత్రి జె టాక్స్ అంటూ రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు.
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓటుతో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం వుందన్నారు కొల్లు రవీంద్ర.