Asianet News TeluguAsianet News Telugu

ఆ మూడు జిల్లాల్లో అలసత్వం... వారిదే బాధ్యత...: మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరిక

ఉపాధీ హామీ పనులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలవారిగా పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి మూడు జిల్లాల్లో జరుగుతున్న పనులపై అసంతృప్తి వ్యక్తం  చేశారు.   

peddireddy ramachandra reddy review meeting on NREGA
Author
Guntur, First Published Feb 19, 2020, 3:05 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని... జిల్లాల వారీగా కేటాయించిన లక్ష్యాలను అధిగమించాలని అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్థిశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. మూడు జిల్లాల్లో పనుల పురోగతిలో అలసత్వం కనిపిస్తోందని...దీనికి ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత వహించాల్సి వుంటుందని మంత్రి హెచ్చరించారు. 

ఉపాధి హామీ పనులపై సచివాలయంలో  మంత్రి  సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...  ఉపాధి హామీ పనులను జిల్లాల్లోని సిఇలు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. ఆర్థికశాఖ నుంచి కూడా బిల్లులు కూడా వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని... గత రెండు నెలల్లో ఉపాధి హామీ పనులకు రూ.1400 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. 

ఇంత పెద్ద మొత్తంలో చెల్లింపులు జరుపుతున్నా కొత్తగా ప్రారంభించిన పనులు ఎందుకు  వేగవంతం అవ్వడం లేదు?అని ప్రశ్నించారు. డిపార్ట్ మెంట్ స్థాయిలో పనులు... చెల్లింపులపై అప్రమత్తంగా వుండాలన్నారు. స్టీల్, సిమెంట్ కోసం డీలర్లతో జిల్లా కలెక్టర్ లు మాట్లాడి అవసరమైతే క్రెడిట్ పై ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

read more ఇక జగన్ ను దేవుడే ఆశీర్వదించాలి: ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ ఏడాదిలో నరేగా కింద కేటాయించిన మొత్తాన్ని వినియోగించాలని సూచించారు. స్థానికంగా వున్న ప్రజాప్రతినిధులకు కూడా అవగాహన కల్పించాలన్నారు.  మెటీరియల్ కేటాయింపులు ఎక్కువగా వుంటే సిసి రోడ్లను చేపట్టాలని అన్నారు. గ్రామ సచివాలయాలు, సిసి డ్రైన్స్, ప్రహరీ గోడలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. 

సిమెంట్ కు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులను సూచించారు. ఇసుక లభ్యతపై ఉపాధి పనులకు మినహాయింపులు ఇచ్చామన్నారు. జిల్లా కలెక్టర్ లతో సమన్వయం చేసుకుని ఇసుకను తీసుకోవచ్చని అన్నారు. 

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 18 వరకు జరిగిన మెటీరియల్ వ్యయం రూ.138.68 కోట్లుగా వుందన్నారు. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి నేటి వరకు (ఫిబ్రవరి 18) వరకు మొత్తం మెటీరియల్ వ్యయం రూ. 871.18 కోట్లుగా వుందని వెల్లడించారు. 

జిల్లా స్థాయిలో ఇంజనీరింగ్ అధికారులు ప్రతివారం నరేగా పనులపై సమీక్షించాలని ఆధేశించారు. గత వారం జరిపిన నరేగా కింద చేసిన చెల్లింపులు రూ.51.73 కోట్లుగా వున్నాయన్నారు. ఉపాధి పనులకు ప్రతివారం ఎఫ్‌టిఓ లు జారీచేయాలన్నారు. 

గత ఏడాది జరిగిన ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగాయని...వాటిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిందని అన్నారు. విజిలెన్స్ విచారణలో నిరూపణ జరిగిన పనులకు కూడా బిల్లుల చెల్లింపులు జరుగుతున్నామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత మంజూరు చేసిన పనులకు ఎక్కడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగదని స్ఫష్టం  చేశారు.

read more జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి, ఐటీ మంత్రే ప్రకటించారు: నారా లోకేష్

వచ్చే అయిదు వారాలు ఇంజనీరింగ్ అధికారులు మరింత కష్టపడాల్సి వుంటుందన్నారు. ఈ ఏడాది చేసే వ్యయంను బట్టే వచ్చే ఆర్థిక సంవత్సరానికి నరేగా కేటాయింపులు జరుగుతాయని... సుమారు వెయ్యి కోట్లు వరకు నిర్ణీత గడువు లోపు ఖర్చు చేయాలన్నారు. ఎఫ్‌టిఓ లను జనరేట్ చేయడం వల్ల బిల్లులు వెంటనే చెల్లించేందుకు అవకాశం వుంటుందన్నారు. 

మనబడి, నాడు-నేడు కింద ఈ ఏడాది మొత్తం 284 మండలాలను ఎంపిక చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది మొత్తం 5853 స్కూల్ బిల్డింగ్ లకు నరేగా కింద పనులు నిర్వహిస్తామన్నారు. పాఠశాలల టాయిలెట్లు, కాంపౌండ్ వాల్స్ లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పంచాయతీ రాజ్ కింద నాడు-నేడులో 50 శాతం పనులు ఇచ్చారని తెలిపారు.  పాఠశాలల ప్రహరీ గోడల వరకు ఉపాధి హామీ నిధులు ఇస్తున్నామని... ఈ మార్చి 31 నాటికి ప్రతిపాదించిన ప్రహరీ నిర్మాణాలను నూరుశాతం పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios