పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో  ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆటో ఎక్కారు.  

కాకినాడ:పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారంనాడు ఆటోలో ప్రయాణించారు. గత నాలుగు రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారంనాడు కొత్తపల్లి మండలం కొండెవరం వద్ద ఆటోలో ప్రయాణించారు. తనను గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ ప్రాంతంలో రోడ్డు ఎలా ఉందో పరిశీలించారు. రోడ్లు సరిగా లేకపోవడంతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని డ్రైవర్లను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ దఫా మాత్రం పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇంకా రెండు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను జనసేన ప్రకటించాల్సి ఉంది. 

Scroll to load tweet…

2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం,బీజేపీ కూటమికి జనసేన మద్దతు ప్రకటించింది. ఈ కూటమి అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.