#RC16 : రంగస్థలం, ఉప్పెన సినిమాల క్లైమాక్స్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా క్లైమాక్స్ కూడా చాలా కాలం గుర్తుండిపోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
#War2: వార్ 2 చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ను దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎలా చూపించబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ భారీ మల్టీస్టారర్ యాక్షన్ ఫిల్మ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#PuriJagannadh: వరస పరాజయాల తర్వాత పూరి జగన్నాథ్ తన తదుపరి ప్రాజెక్టు కోసం తెలుగులో చాలా మంది హీరోలతో చర్చలు జరిపినప్పటికీ, ఇంకా ఎవరూ ఖరారు కాలేదు. బాలకృష్ణతో సినిమా చేయాలనుకున్నప్పటికీ, ఆయన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
సాయి పల్లవి ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమాలో నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రెండో హీరోయిన్ పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్ లో కనిపిస్తే ఆ కిక్కే వేరు అంటారు అభిమానులు. దాన్ని నిజం చేస్తూ బాలయ్య ఇప్పుడు నాని హీరోగా చేస్తున్న సినిమా క్లైమాక్స్‌లో బాలకృష్ణ అతిధి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా మినహా ఇందులో నటించే వాళ్ల గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకే ఎగ్రిమెంట్స్ అందరితో చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
షారుఖ్ ఖాన్ పెద్ద కొడుకు ఆర్యన్ ఖాన్, ముంబైలో తన రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ లారిస్సా బోనెసితో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. పార్టీలో వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకూ మహారాజ్' చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయకపోయినా, రెండు షేడ్స్ లో కనిపించనున్నారు. 'అఖండ' లోని చైల్డ్ సెంటిమెంట్, కలెక్టర్ పాత్ర వంటి అంశాలు ఈ చిత్రంలోనూ ఉండనున్నాయి.
నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ తేదీని చిత్ర బృందం ప్రకటించింది. జనవరి 8న ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈవెంట్‌కు హాజరవుతారని ప్రచారం జరుగుతోంది.
‘హను-మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ త్వరలో ప్రభాస్‌ని డైరెక్ట్ చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి మరియు జనవరి 2025లో ప్రకటన వెలువడుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది.