- Home
- Entertainment
- Gossips
- #RC16 : ‘ఉప్పెన’ లాగే రామ్ చరణ్ కొత్త చిత్రం క్లైమాక్స్ , పాతకాలం కెమెరాలతో
#RC16 : ‘ఉప్పెన’ లాగే రామ్ చరణ్ కొత్త చిత్రం క్లైమాక్స్ , పాతకాలం కెమెరాలతో
#RC16 : రంగస్థలం, ఉప్పెన సినిమాల క్లైమాక్స్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమా క్లైమాక్స్ కూడా చాలా కాలం గుర్తుండిపోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ramcharan
సినిమాకు క్లైమాక్స్ ప్రాణం అనే సంగతి సూపర్ హిట్స్ ఇచ్చే డైరక్టర్స్ అందరికీ తెలుసు. సినిమా అంతా ఒకెత్తు, క్లైమాక్స్ ఒకెత్తు అన్నట్లు డిజైన్ చేసుకుంటూంటారు. అలా క్లైమాక్స్ డిఫరెంట్ గా ఉన్న సినిమాలు చాలా కాలం గుర్తిండిపోతాయి.
ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమా, క్లైమాక్స్ ,బుచ్చిబాబు ‘ఉప్పెన’ క్లైమాక్స్ ని కూడా గుర్తుండిపోయాయి. ఇప్పుడు రామ్ చరణ్ కొత్త సినిమా కి కూడా అలాంటి ఓ డిఫరెంట్ క్లైమాక్స్ చాలా కాలం గుర్తిండిపోయేది డిజైన్ చేసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
#RamCharan
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్న ఈ చిత్రంకి క్లైమాక్స్ చాలా కాలం గుర్తిండిపోతుందని చెప్పుకుంటున్నారు. ఇప్పటిదాకా ఎవరూ ఊహించని, కొత్త తరహా క్లైమాక్స్ అని, అదే సినిమాకి రిపీట్ ఆడియన్స్ ని తెచ్చిపెడుతుందని, చాలా కాలం ఈ క్లైమాక్స్ ని మాట్లాడుకుంటారని చెప్తున్నారు. ఈ క్లైమాక్స్ విని ప్లాట్ అయ్యే రామ్ చరణ్ డేట్స్ ఇచ్చాడంటున్నారు.
Ramcharan, #BuchiBabu, uppena,Shiva Rajkumar
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే చిత్రానికి వింటేజ్ లుక్ కూడా తీసుకొచ్చే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలా పాత తరం కెమెరాతో సినిమాను షూట్ చేయబోతున్నారట.
పాత రోజుల్లో సినిమా చిత్రీకరణ కోసం ఫిల్మ్ రీల్‌ని వాడేవారనే విషయం తెలిసిందే. పాత తరం కెమెరాతో చిత్రీకరిస్తే కొన్ని షాట్స్ బాగా వస్తాయని అంటుంటారు. ఇప్పుడు అదే కారణంతో బుచ్చిబాబు కొన్ని సీన్స్ పాత రీల్ కెమెరాతో చిత్రీకరించనున్నారట. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ రత్నవేలు (R. Rathnavelu) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.