SSMB29: రాజమౌళి - మహేశ్ చిత్రంలో ఆయన కూడానా? ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ
SSMB29: ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రియాంక చోప్రా వంటి ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ లను తీసుకొచ్చారు. ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ యాక్టర్ ని ఈ సినిమా కోసం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరా నటుడు.

NanaPatekar to play a key role in Mahesh Babu-Rajamouli film in telugu
రాజమౌళి సినిమా అంటేనే ఎక్కడెక్కడి సీనియర్ ఆర్టిస్ట్ లు సినిమాలో కీలకమైన పాత్రల్లో కనపడుతూంటారు. తాజాగా ఆయన మహేష్ బాబు తో చేస్తున్న సినిమా చాలా ప్రతిష్టాత్మకమైంది. ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రియాంక చోప్రా వంటి ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ లను తీసుకొచ్చారు. ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ యాక్టర్ ని ఈ సినిమా కోసం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరా నటుడు.
Exciting Possibilities for Mahesh-Rajamouli Film
మహేశ్‌బాబు నటిస్తున్న SSMB29వ సినిమా ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి హై సక్సెస్ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న బహుభాషా చిత్రమిది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా ఓ ప్రధాన పాత్ర పోషిస్తోంది. షూటింగ్ మొదలైన దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటకొచ్చింది.
ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ను రంగంలోకి దింపబోతున్నారని తెలుస్తోంది. సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై చిత్ర టీమ్ ఆయనతో సంప్రదింపులు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వార్త రాగానే ఫ్యాన్స్ పండగ చేస్తున్నారు. నానాపటేకర్ నటించటం నిజమైతే సినిమాకు ఓ రేంజిలో ప్లస్ అవుతుందని అంటున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమాలోని ఓ కీలకమైన పాత్ర కోసం చిత్ర వర్గాలు పృథ్వీరాజ్ సుకుమార్ ని తీసుకోబోతున్నారు. దీనిపై పృథ్వీరాజ్ కూడా ఇటీవలే క్లూ ఇచ్చారు. అలాగే బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం పేరు ఇప్పుడు వినిపిస్తోంది.
ప్రియాంక చోప్రాతో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపైనా SSMB29 చిత్ర టీమ్ నుంచి ఎలాంటి సమాచారం లేదు.ఇది పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగే సినిమా. కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు.