- Home
- Entertainment
- Gossips
- pawan Kalyan: పవన్ కల్యాణ్ టైటిల్ తో వస్తున్న శర్వానంద్, మావాడికి ఏమీ ఉంచరా?
pawan Kalyan: పవన్ కల్యాణ్ టైటిల్ తో వస్తున్న శర్వానంద్, మావాడికి ఏమీ ఉంచరా?
pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్‌ను ఇతర నటులు తిరిగి ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి శర్వానంద్ చేరారు.

Sharwanand is reportedly coming up with the pawan Klayan movie title in telugu
టైటిల్ ఎట్రాక్ట్ చేస్తేనే సినిమా జనాల దృష్టిలో పడుతుంది. ఓపినింగ్స్ నుంచి భాక్సాఫీస్ కలెక్షన్స్ దాకా అన్నీ టైటిల్ పైనే డిపెండ్ అవుతాయి. అయితే తాము అనుకున్న కథకు సరైన టైటిల్ దొరకటం అనేదే పెద్ద సమస్య.
అందుకే రీసెంట్ గా దర్శక,నిర్మాతలు గతంలో వచ్చి జనాల్లోకి వెళ్లి పాపులరైన టైటిల్స్ ని మరోసారి పెట్టి ఎట్రాక్ట్ చేసే పనిలో ఉంటున్నారు. ఆ క్రమంలో రీసెంట్ గా 'నారి నారి నడుమ మురారి' అనే ఐకానిక్ టైటిల్‌ను తీసుకున్నారు శర్వానంద్. ఇప్పుడు మరో టైటిల్‌తో వస్తున్నాడు.
టైటిల్స్ పవన్ కళ్యాణ్ సినిమాలకు చెందినవి అన్ని జనాల్లోకి బాగా వెళ్లినవే. అందుకే వాటిని సినిమావాళ్లు వాడటానికి ఆసక్తి చూపుతారు. ఆ క్రమంలో శర్వానంద్ పవన్ కళ్యాణ్ గతంలో చేసిన 'జానీ' అనే టైటిల్ ని తన సినిమాకు పెట్టుకోబోతున్నట్లు సమాచారం.
అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించి, యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. పవన్ అభిమానులు ఈ ట్రెండ్‌ను పెద్ద గా ఇష్టపడటం లేదు. పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ అరంగేట్రం చేసేసరికి మొత్తం పవన్ చేసిన ఐకానిక్ టైటిల్స్ అయ్యిపోయేలా ఉన్నాయని , వాటిని మిగిలిన హీరోలే తీసుకుంటున్నారని పీకే ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
శర్వానంద్ హీరోగా యువి క్రియేషన్స్ బ్యానర్ లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అభిలాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్, శర్వానంద్ కు తండ్రి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు జానీ అనే టైటిల్ ను పెట్టాలని మేకర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన 'జానీ' ఒక ఐకానిక్ సినిమాగా ప్యాన్స్ భావిస్తూంటారు. అయితే పవన్ జానీ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. కానీ జానీ సినిమా మాత్రం జనాల్లోకి బాగా వెళ్లింది. అందుకు కారణం ఇది పవన్ కళ్యాణ్ డైరక్ట్ చేసిన సినిమా కావటం.
ఇక శర్వానంద్ జానీ సినిమా టైటిల్‌ను ఎంచుకోవటానికి కారణమేమిటనేది తెలియరాలేదు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్‌ను ఇతర నటులు తిరిగి ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. విజయ్ దేవరకొండ గతంలో 'ఖుషి'ని ఉపయోగించగా, వరుణ్ తేజ్ 'తొలి ప్రేమ'ను ఉపయోగించారు. నితిన్ 'తమ్ముడు'ను ఎంచుకున్నారు. యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'ని ఎంచుకున్నారు.