#PuriJagannadh: పూరీ జగన్నాధ్ ప్రస్తుతం ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు.?
#PuriJagannadh: వరస పరాజయాల తర్వాత పూరి జగన్నాథ్ తన తదుపరి ప్రాజెక్టు కోసం తెలుగులో చాలా మంది హీరోలతో చర్చలు జరిపినప్పటికీ, ఇంకా ఎవరూ ఖరారు కాలేదు. బాలకృష్ణతో సినిమా చేయాలనుకున్నప్పటికీ, ఆయన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

#PuriJagannadh
ఒక టైమ్ లో తెలుగులో మాస్ సినిమా చేయాలంటే పూరి జగన్నాథ్ చేయాలి. ఆయనతో చేయాలని ప్రతీ స్టార్ హీరో ఉత్సాహపడేవారు. పోకిరి వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ఆయన. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఇండస్ట్రీ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు..సినిమా సినిమాకి ఎదుగుతూ టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ మాస్ డైరెక్టర్ గా ఒక్క ప్రత్యేకమైన స్థానం ని ఏర్పరచుకున్నాడు పూరి జగన్నాథ్. అయితే నిర్మాతగా మారి వరసగా రెండు డిజాస్టర్స్ ఇచ్చారు.
విజయ్ దేవరకొండ తో చేసిన “లైగర్” చిత్రం ఆయన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టగా, రామ్ తో చేసిన “డబుల్ ఇస్మార్ట్” కెరీర్ ని దెబ్బ తీసి మరింత అప్పుల్లోకి తోసేసింది. ఈ క్రమంలో ఆయన నెక్ట్స్ ఏ హీరోతో చేస్తారు..ఏ హీరో డేట్స్ ఇస్తారు..ప్రస్తుతం ఎక్కడున్నారు. ఏం చేస్తున్నారనే విషయం సగటు సినీ అభిమానికి ప్రశ్నలుగా మిగిలాయి.
#PuriJagannadh
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. మూడు స్క్రిప్టులు రెడీ చేస్తున్నారు. హిందీ ప్రొడ్యూసర్స్ తో టచ్ లో ఉంటూ అక్కడ ప్రాజెక్టు పిచ్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మినిమం హీరో తన సినిమాలో చేయాలనే ఆయన కోరుకుంటున్నారు.
నార్త్ లో ఇప్పుడు మన తెలుగు,తమిళ దర్శకులకు డిమాండ్ ఉండటంతో ఖచ్చితంగా అక్కడ ప్రాజెక్టు ఓకే అవుతుందని భావిస్తున్నారు. తన గురువు రామ్ గోపాల్ వర్మ ద్వారా కూడా కొందరని కలుస్తున్నట్లు వినికిడి. గతంలో పూరి అక్కడ హిందీలో అమితాబ్ తో ఓ సినిమా చేసి హిట్ కొట్టారు. ఈసారి బలమైన కథతో పాటు ఇండస్ట్రీలో హిట్ కొట్టాలని ఆయన పక్కా ప్లాన్‌తో రానున్నారని టాక్.
#PuriJagannadh
తెలుగులో యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, తేజ సజ్జ, అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వంటి హీరోలతో చేద్దామని ప్లాన్ చేసారు కానీ అందరూ పూర్తి బిజిగా ఉన్నారు. మరో ప్రక్క
నందమూరి బాలకృష్ణ తోనూ ప్రాజెక్టు అనుకున్నారు.
వారి కలయికలో వచ్చిన “పైసా వసూల్” పరాజయం పాలైనప్పటికీ, బాలయ్య..పూరి తో మళ్లీ పనిచేయడానికి అంగీకరించారు. అయితే బోయపాటి శ్రీను నెక్ట్స్ చిత్రం బిజిలో బాలయ్య ఉన్నారు. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కానున్న తన కొడుకు మోక్షజ్ఞ మొదటి సినిమా నిర్మాణాన్ని కూడా ఆయన పర్యవేక్షించనున్నారు. దీంతో బాలకృష్ణ ఈసారి పూరీ జగన్నాధ్‌తో ముందుకు వెళ్లలేకపోతున్నారు.
రవితేజ, అల్లు అర్జున్, ప్రభాస్, మహేష్ బాబు ఇలా చాలా మంది హీరోలకి సూపర్ హిట్స్ ని ఇస్తూ... వచ్చారు పూరీ. ఈ దర్శకుడు డైరెక్షన్ లో ఏ హీరోకైనా స్పెషల్ ఇమేజ్ వస్తుంది. తర్వాత నిజంగా పెద్ద స్టార్లు కూడా అయిపోతుంటారు. చాలా మంది స్టార్ హీరోలకి అద్భుతమైన హిట్స్ ని ఇచ్చి వాళ్ళ ఇమేజ్ ని పూరి జగన్నాధ్ రెట్టింపు చేసారు.