#War2: వీరేంద్ర రఘునాథ్ గా ఎన్టీఆర్, స్టోరీ లైన్ ఇదే?
#War2: వార్ 2 చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ను దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎలా చూపించబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ భారీ మల్టీస్టారర్ యాక్షన్ ఫిల్మ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన గత ఏడాదిగా హైదరాబాద్ టూ ముంబై కంటిన్యూగా వెళ్లి వస్తూనే ఉన్నారు. అంతే కాదు ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ కూడా పూర్తి కానుందని తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో తారక్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది..? ఎన్టీఆర్‌ను వార్ 2లో అయన్ ముఖర్జీ ఎలా చూపించబోతున్నారు..? అనే విషయాలు మీడియాలోనూ , ఎన్టీఆర్ అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి.
ఈ భారీ మల్టీస్టారర్ యాక్షన్ ఫిల్మ్ War2 లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ (Hrithik Roshan) తలపడబోతున్నారు. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపుదిద్దుకోనుంది. ఆయాన్ ముఖర్జి (Ayan Mukerji) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ntr, war2
ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan ) కలిసి తొలిసారిగా నటిస్తున్న చిత్రం వార్-2 (War2). దేశ వ్యాప్తంగా సిని అభిమానుల అందరి దృష్టి ఈ సినిమా పైనే ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా నటించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్‌లు ఏజెంట్ పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. వీటన్నింటికంటే భిన్నంగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందనే వార్త వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలోనే వీరేంద్ర రఘునాథ్ గా ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
war2
బాలీవుడ్ మీడియాలో ప్రచారం అవుతున్న War2 కథ ఏమిటంటే...
కబీర్ సింగ్ (హృతిక్ రోషన్) కోవర్ట్ ఇంటర్నేషనల్ టాస్క్ ఫోర్స్ లీడర్. ఇండియాకి వీరేంద్ర రఘునాథ్ (ఎన్టీఆర్) నుంచి భారీ ముప్పు ఏర్పడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో వీరేంద్ర టెర్రరిస్ట్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తాడు. మొదట్లో భారతదేశం కోసం ప్రాణాలు సైతం ఇచ్చే స్థాయిలో ఏజెంట్ గా వీరేంద్ర నిలుస్తాడు. కానీ కబీర్ సింగ్ లీడ్ చేస్తున్న టీమ్ లో భాగంగా శత్రు దేశ టెర్రరిస్టులను అంతం చేసేందుకు వీరేంద్ర వెళ్ళినప్పుడు.. వీరేంద్రకు వెన్నుపోటు పొడిచి శత్రువులకు వదిలేసి కబీర్ వెళ్ళిపోతాడు.
వాళ్ళ నుంచి తప్పించుకున్న వీరేంద్ర దేశం కోసం ప్రాణాలు సైతం ఇవ్వాలనుకున్న తనని.. అంతలా దొంగ దెబ్బ తీసారన్న కసితో టెర్రరిస్ట్‌గా మరి ముఖ్యంగా తనని వెన్నుపోటు పొడిచిన కబీర్ పై పగ పెంచేసుకుంటాడు. అలా వీరిద్దరి మధ్యా వార్ మొదలవుతుందని చెప్తున్నారు. అయితే చివరకు కబీర్ గురించి వీరేంద్రకు నిజం తెలుస్తుందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ కథలో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేతిలో మూడు పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సక్సెఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘దేవర’ (Devara) 2 చెయ్యాల్సి ఉంది. అలాగే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ War2లోనూ నటిస్తున్నారు. మరోవైపు సెన్సేషన్ డైరెక్టర్ తో ప్రశాంత్ నీల్ తో NTR31 ఉన్న విషయం తెలిసిందే.
‘‘ఒక మంచి కథతో హిందీ చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్‌ను పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వార్-2తో బాలీవుడ్‌లో ఆయన ప్రయాణం ఆగిపోదు. మరెన్నో చిత్రల్లో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇది దీర్ఘకాలిక ఎగ్రిమెంట్. పరిశ్రమలో ఉన్న ప్రతిభావంతులైన నటీనటులు ఈ సీరిస్ సినిమాలలో భాగం అవుతున్నారు ’’ అని చిత్ర టీమ్ చెప్తోంది. ఎన్టీఆర్‌ని ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో చూపిస్తే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారా.. లేదా ఆయన నటనను ఎంజాయ్ చేస్తారా.. చూడాలి.