MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • Hair Growth: ఇలా నూనె రాస్తే.. జుట్టు రాలడం కాదు, ఒత్తుగా పెరుగుతుంది..!

Hair Growth: ఇలా నూనె రాస్తే.. జుట్టు రాలడం కాదు, ఒత్తుగా పెరుగుతుంది..!

జుట్టు విపరీతంగా రాలిపోతుందని బాధపడుతున్నారా? ఎంత ఖరీదైన షాంపూలు వాడినా జుట్టు రాలడం ఆగడం లేదా? అయితే.. నూనె సరిగ్గా రాసే విధానంలో రాస్తే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 04 2025, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హెయిర్ ఆయిల్ తో జుట్టు రాలడానికి చెక్
Image Credit : Getty

హెయిర్ ఆయిల్ తో జుట్టు రాలడానికి చెక్

జుట్టు రాలడం అనేది చాలా మంది ఎదుర్కొంటున్న కామన్ సమస్య. వయసుతో సంబంధం లేకుండా పురుషులు, మహిళలు అందరూ ఈ సమస్యను ఫేస్ చేస్తున్నవారే. జుట్టు రాలే సమస్యకు చాలా కారణాలు ఉంటాయి.జన్యుపరమైన అంశాలు, పోషకార లోపం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, కాలుష్యం కూడా కారణం కావచ్చు. అయితే, ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎవరైనా సరే మార్కెట్లో దొరికే నూనెలు, షాంపూలు వాడుతూ ఉంటారు. కానీ వాటిని వాడినా ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ, కేవలం మనం చిన్నతనం నుంచి వాడే కొబ్బరి నూనెతో ఈ జుట్టురాలే సమస్యను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నూనె రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు
Image Credit : Getty

నూనె రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు

తలపై నూనె రాయడం వల్ల జుట్టు కుదుళ్లకు పోషణ లభిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జుట్టు పెరుగుదల్ని ప్రోత్సహిస్తుంది. అంతేగాక, నూనె జుట్టుకు తేమను ఇస్తుంది. జుట్టు చివర్ల చిట్లడాన్ని నివారిస్తుంది. ఇది కేవలం జుట్టు ఆరోగ్యానికే కాదు, మెదడు విశ్రాంతికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుంది.

35
మీ జుట్టుకు సరిపడే నూనె ఎంపిక చేసుకోవడం ముఖ్యం..
Image Credit : Pinterest

మీ జుట్టుకు సరిపడే నూనె ఎంపిక చేసుకోవడం ముఖ్యం..

ప్రతి వ్యక్తికి జుట్టు స్వభావం వేరు. అందువల్ల అందరికీ ఒకే నూనె ఉపయోగపడదు. కొబ్బరి నూనె జుట్టు దృఢంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఆముదం నూనె (కాస్టర్ ఆయిల్) జుట్టు పెరుగుదల కోసం మంచి ఎంపిక. ఆర్గాన్ నూనె జుట్టు మెరిసేలా చేయడమే కాకుండా మృదువుగా మారుస్తుంది. బాదం నూనె పోషణ కోసం, ఆమ్లా నూనె జుట్టు నెరసిపోకుండా కాపాడుతుంది.

నూనె వేడి చేసి రాయడం ఎందుకు అవసరం?

నూనెను వేడి చేయడం ద్వారా అది తలచర్మంలో లోతుగా చొచ్చుకుపోయి మంచి ఫలితాలు ఇస్తుంది. వేడి చేసిన నూనెను వేళ్లతో తలపై మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది కేవలం జుట్టుకు కాదు, మానసికంగా కూడా ఓ రకమైన రిలీఫ్‌ను ఇస్తుంది. నూనె గోరువెచ్చగా మాత్రమే ఉండాలి.

45
నూనె ఎలా రాయాలి?
Image Credit : Getty

నూనె ఎలా రాయాలి?

మీ జుట్టును విభజించి, మెల్లగా తలపై, జుట్టు పొడవునా నూనె రాయాలి. ముఖ్యంగా జుట్టు ఎక్కువగా రాలే ప్రాంతాలకు ఎక్కువగా మసాజ్ చేయాలి. రాత్రంతా నూనె ఉంచటం వల్ల ఇంకా మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. అయితే తల చర్మం జిడ్డు అయితే 1–2 గంటల వరకు ఉంచడమే సరిపోతుంది.

తలస్నానం చేయడం కూడా ముఖ్యమే..

నూనె రాసిన తర్వాత దాన్ని పూర్తిగా తొలగించకపోతే తలపై మలినాలు పేరుకోవచ్చు. కాబట్టి గోరువెచ్చని నీటితో జుట్టును తడిపి, సల్ఫేట్ లేని మైల్డ్ షాంపూను వాడాలి. అవసరమైతే రెండు సార్లు షాంపూ చేసి, కండిషనర్ ఉపయోగించాలి. ఇది జుట్టు తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది.

55
లైఫ్ స్టైల్ మార్చుకోవడం..
Image Credit : Google

లైఫ్ స్టైల్ మార్చుకోవడం..

క్రమం తప్పకుండా ఈ ప్రక్రియను కొనసాగించండి

వారానికి ఒకసారి లేదా రెండు సార్లు నూనె రాయడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడటంతోపాటు, దెబ్బతిన్న జుట్టు నెమ్మదిగా తిరిగి ఆరోగ్యంగా మారుతుంది. ముఖ్యంగా ఈ దినచర్యను నిరంతరం కొనసాగిస్తే, దీర్ఘకాలంలో మంచి ఫలితాలు కనబడతాయి.

ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా అవసరం

నూనె రాయడమే కాదు, పోషకాహారంతో కూడిన ఆహారం, తగినంత నీరు, సరైన నిద్ర, రోజువారీ వ్యాయామం, ఒత్తిడి నివారణ వంటి లైఫ్ స్టైల్ మార్పులు కూడా జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. విటమిన్ A, C, D, E, B-కాంప్లెక్స్, ప్రోటీన్, జింక్, ఐరన్ వంటి పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవడం అవసరం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: ఈ మిశ్రమాన్ని రాస్తే చాలు..జుట్టు చాలా వేగంగా పెరుగుతుంది
Recommended image2
Blouse Designs: ట్రెడిషనల్ లుక్ తో అదరగొడుతున్న బ్లౌజ్ డిజైన్స్..
Recommended image3
Bangles: చేతుల అందాన్ని పెంచే స్టోన్ బ్యాంగిల్స్.. ఎంత బాగున్నాయో
Related Stories
Recommended image1
Hair Care: ఇవి రాస్తే, 15రోజుల్లో ఊడిన జుట్టు మళ్లీ పెరుగుతుంది..!
Recommended image2
Hair Care: వర్షాకాలంలో జుట్టు డ్యామేజ్ అవ్వకూడదంటే ఏం చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved