Best Shampoo: హెయిర్ డ్యామేజ్ అవుతోందా? ఈ షాంపూలు వాడితే చాలు
మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా అప్పుడప్పుడు హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ డ్యామేజ్ ని మనం కేవలం కొన్ని రకాల షాంపూలను వాడటం వల్ల కంట్రోల్ చేయవచ్చని మీకు తెలుసా? మరి, ఆ షాంపూలు ఏంటో చూద్దామా...
- FB
- TW
- Linkdin
Follow Us
)
Hair care
జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకోనివారు ఎవరైనా ఉంటారా? జుట్టు పట్టులా మెరిసిపోవాలని, చుండ్రు సమస్య ఉండకూడదని కోరుకుంటారు. కానీ.. మనం సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల హెయిర్ డ్యామేజ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. హెయిర్ డ్యామేజ్ అవ్వడం మొదలైంది అంటే... గ్రోత్ సరిగా ఉండదు. ఊడిపోవడం కూడా మొదలౌతుంది. అలా కాకుండా జుట్టు డ్యామేజ్ లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే, ఏ సమస్యకు ఎలాంటి షాంపూలు వాడాలో తెలుసుకుందాం...
హెడ్ & షోల్డర్స్: చుండ్రుకి చెక్
చుండ్రు ఉన్నవారికి చాలాకాలంగా నమ్మకమైన షాంపూ. ప్రతి వాష్ తర్వాత రిఫ్రెషింగ్ ఫీల్ ఇస్తుంది. త్వరగా ఫలితం చూపిస్తుంది. చుండ్రు మీ జుట్టుని పాడుచేస్తుంటే, హెడ్ & షోల్డర్స్ ట్రై చేయండి. చుండ్రు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ షాంపూ వాడితే కచ్చితంగా మంచి ఫలితం వస్తుంది.
Wow స్కిన్ సైన్స్ షాంపూ: స్కాల్ప్ కి షీల్డ్
స్కాల్ప్ హెల్త్ కి మంచిది. ఆపిల్ సైడర్ వెనిగర్ pH లెవెల్ ని బ్యాలెన్స్ చేస్తుంది, చుండ్రుతో పోరాడుతుంది. సల్ఫేట్ లేని ఈ షాంపూలో ఆర్గాన్ ఆయిల్ వంటి మంచివి ఉన్నాయి. జుట్టు హెల్దీగా కనపడటానికి సహాయం చేస్తుంది.
Mamaearth టీ ట్రీ షాంపూ
Mamaearth టీ ట్రీ ఆయిల్ వంటి సహజ పదార్థాలను ఉపయోగిస్తుంది. ఇవి చుండ్రును నివారిస్తాయి. ఈ షాంపూ స్కాల్ప్ ని తేమగా ఉంచుతుంది.
బయోటీక్ బయో వేప షాంపూ
బయోటీక్ ఆయుర్వేద సూత్రాలను పాటిస్తుంది. వేప చుండ్రుకు మంచిది. ఈ షాంపూ చుండ్రును నివారించడమే కాకుండా, మళ్ళీ రాకుండా కూడా కాపాడుతుంది.
డవ్ షాంపూ: బలం & వాల్యూమ్
డవ్ షాంపూ చాలా మంది వాడతారు. సున్నితమైన స్కాల్ప్ కి మంచిది. హెయిర్ జిడ్డుగా అవ్వకుండా ఉంచుతుంది. ఎప్పుడూ దొరుకుతుంది కాబట్టి రెగ్యులర్ గా వాడొచ్చు.
లోరియల్ పారిస్ షాంపూ
లోరియల్ షాంపూలో కెమికల్స్ ఉన్నాయని చాలామంది అనుకుంటారు. కానీ, కాలుష్యం, ఎండ నుంచి స్కాల్ప్ ని కాపాడటానికి అవసరమైన పోషకాలు ఇందులో ఉంటాయి.
మీరా చిన్న ఉల్లిపాయ షాంపూ
మీరా చిన్న ఉల్లిపాయ షాంపూ చుండ్రును తగ్గించడానికి ప్రత్యేకంగా తయారు చేేశారు. చుండ్రు, సున్నితమైన స్కాల్ప్ ఉన్నవారికి మంచిది. ఈ షాంపూని కూడా రెగ్యులర్ గా వాడొచ్చు. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కూడా సహాయపడుతుంది.