MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Blouse Designs: ట్రెడిషనల్ లుక్ తో అదరగొడుతున్న బ్లౌజ్ డిజైన్స్..

Blouse Designs: ట్రెడిషనల్ లుక్ తో అదరగొడుతున్న బ్లౌజ్ డిజైన్స్..

Blouse Designs: ఇంటి ముందు అందంగా కనిపించే మెలికల ముగ్గు...ఇప్పుడు బ్లౌజ్ డిజైన్ గా ట్రెండ్ అవుతోంది. ముగ్గుల అందాన్ని మోడ్రన్ ఎంబ్రాయిడరీతో జోడించడంతో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. శారీ లవర్స్ వీటిని చూసి తెగ మురిసిపోతున్నారు.

2 Min read
Author : Nandini Arava
Published : Oct 04 2026, 08:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
ఇది ముగ్గా.. బ్లౌజ్ డిజైనా?
Image Credit : Pinterest

ఇది ముగ్గా.. బ్లౌజ్ డిజైనా?

నేటి మహిళలు.. చీర కట్టుకునేటప్పుడు చీర రంగుకే కాదు, దానికి తగ్గ బ్లౌజ్ డిజైన్‌కు కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రెగ్యులర్‌గా చూసే ఫ్లోరల్ డిజైన్స్, ఎంబ్రాయిడరీ, స్టోన్ వర్క్, మగ్గం వర్క్ కాకుండా ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ మగువల మనసు దోచుకుంటోంది.

అదే మన ఇంటి ముందు రోజూ వేసుకునే 'సిక్కు కోలం' అంటే (మెలికల ముగ్గు) డిజైన్‌ను బ్లౌజ్‌పై వేసుకోవడం. వాకిట్లో మొదలైన ఈ ముగ్గుల అందం ఇప్పుడు బ్లౌజ్‌పైనా మెరిసిపోతోంది. ఒక గీతతో మరో గీత పెనవేసుకుని ఉండే ఈ ముగ్గుల డిజైన్‌ను బ్లౌజ్‌పై వేసినప్పుడు చాలా అందంగా, వెరైటీగా కనిపిస్తోంది. సంప్రదాయం సైతం ఉట్టిపడుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
మీ దగ్గర సిక్కు కోలం డిజైన్ బ్లౌజ్ ఉందా?
Image Credit : Pinterest

మీ దగ్గర సిక్కు కోలం డిజైన్ బ్లౌజ్ ఉందా?

ఎక్కువ చమ్కీలు, స్టోన్స్, హెవీ ఎంబ్రాయిడరీ లేని చీరల మీద ఈ సిక్కు కోలం బ్లౌజ్ వేసుకుంటే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. చాలా సింపుల్‌గా ఉండే చీరను కూడా ఈ వెరైటీ బ్లౌజ్ డిజైన్‌తో స్టైలిష్‌గా మార్చేయొచ్చు. ఒకవేళ చీరలో అప్పటికే హెవీ బార్డర్ లేదా వర్క్ ఉంటే, బ్లౌజ్‌పై పెద్ద డిజైన్ కాకుండా మెడ, చేతులు లేదా వీపుపై చిన్న ముగ్గు డిజైన్ వేయించుకోవడం బెటర్.

38
శారీ లవర్స్ కోసం లేటెస్ట్ ట్రెండ్
Image Credit : Pinterest

శారీ లవర్స్ కోసం లేటెస్ట్ ట్రెండ్

పట్టు చీరలు, కాంచీపురం చీరలు, సిల్క్ కాటన్ లాంటి ట్రెడిషనల్ చీరల మీదకు ఈ డిజైన్ బ్లౌజ్ వేసుకుంటే.. అటు ట్రెడిషనల్, ఇటు మోడ్రన్ లుక్ అదిరిపోతుంది.

అందరిలా కాకుండా నాకంటూ ఒక స్పెషల్ డిజైన్ ఉండాలి అనుకునే మహిళలకు ఈ సిక్కు కోలం బ్లౌజ్ సూపర్ ఛాయిస్. సింపుల్ లైన్స్ నుంచి హెవీ ముగ్గుల డిజైన్ వరకు మీ చీరను బట్టి దీన్ని డిజైన్ చేసుకోవచ్చు.

ఈ బ్లౌజ్ డిజైన్‌లో మెయిన్ హైలైట్ ఆ మెలికల గీతలే. బ్లౌజ్ వెనుక భాగం, చేతులు, మెడ చుట్టూ ఈ ఎంబ్రాయిడరీ లేదా ప్రింట్ వర్క్ చేయించుకుంటే భలే ఉంటుంది.

48
సిక్కు కోలం డిజైన్ ఎక్కడ వేయిస్తే బాగుంటుంది?
Image Credit : Pinterest

సిక్కు కోలం డిజైన్ ఎక్కడ వేయిస్తే బాగుంటుంది?

ముగ్గు అందం ఏమాత్రం తగ్గకుండా, బ్లౌజ్‌పై సరైన ప్లేస్‌లో డిజైన్ చేయిస్తే చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. బ్లౌజ్ వెనుక భాగం మొత్తం కవర్ చేయకుండా, మధ్యలో ఒక పెద్ద సిక్కు కోలం ఎంబ్రాయిడరీ చేయిస్తే ట్రెడిషనల్‌గా ఉంటూనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

58
చేతుల అంచున చిన్న ముగ్గు డిజైన్
Image Credit : Pinterest

చేతుల అంచున చిన్న ముగ్గు డిజైన్

చేతుల అంచున చిన్న చిన్న సిక్కు కోలం డిజైన్లను వరుసగా వేయిస్తే, ఎక్కువ వర్క్ లేకుండానే బ్లౌజ్‌కు మంచి ట్రెడిషనల్ టచ్ వస్తుంది. కొంచెం వెరైటీగా ట్రై చేయాలి అనుకునేవాళ్లు స్లీవ్స్ మొత్తం కంటిన్యూ అయ్యేలా ఈ డిజైన్ వేయించుకోవచ్చు. ముఖ్యంగా సింగిల్ కలర్ బ్లౌజ్‌పై ఇది చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది.

68
ముందు భాగంలో సన్నని లైన్ వర్క్
Image Credit : Pinterest

ముందు భాగంలో సన్నని లైన్ వర్క్

బ్లౌజ్ ముందు భాగంలో పెద్ద డిజైన్ కాకుండా, సన్నని సిక్కు కోలం లాంటి కంటిన్యూస్ లైన్ వర్క్ చేయిస్తే సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది. మెడ చుట్టూ ఈ ముగ్గుల డిజైన్ వేయిస్తే నెక్ లైన్ హైలైట్ అవుతుంది. సింపుల్ బ్లౌజ్‌లకు ఇది బెస్ట్ ఆప్షన్.

78
వీపుపై చిన్న రౌండ్ ముగ్గు
Image Credit : Pinterest

వీపుపై చిన్న రౌండ్ ముగ్గు

పెద్ద డిజైన్ వద్దు అనుకునేవాళ్లు వీపు మధ్యలో చిన్న రౌండ్ షేప్ సిక్కు కోలం వేయించుకుంటే చాలు. తక్కువ వర్క్‌తోనే బ్లౌజ్‌కు అదిరిపోయే లుక్ తీసుకురావచ్చు.

88
ఏ చీరకు సెట్ అవుతుంది?
Image Credit : Pinterest

ఏ చీరకు సెట్ అవుతుంది?

ముగ్గు అనగానే మనకు ట్రెడిషనల్ లుక్ గుర్తొస్తుంది. అందుకే ఈ సిక్కు కోలం డిజైన్ బ్లౌజులు ట్రెడిషనల్ చీరలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి. ముఖ్యంగా కాంచీపురం పట్టు చీర కట్టుకున్నప్పుడు, దానికి మ్యాచింగ్ కలర్‌లో ఈ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ వేసుకుంటే ట్రెడిషనల్ ప్లస్ ఫ్యాషన్ లుక్ మీ సొంతం అవుతుంది. అలాగే చెట్టినాడ్ కాటన్, చేనేత చీరలు, కాటన్ సిల్క్, సుంగుడి, ఆర్గానిక్ కాటన్ లాంటి సింపుల్ చీరల మీదకు కూడా ఈ డిజైన్ చాలా బాగుంటుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
మహిళలు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ముఖంపై మొటిమలు రాకుండా అడ్డుకునే బెస్ట్ ఫుడ్స్ ఇవే
Recommended image2
Hair Growth: మందార పూల నూనె ఇలా రాస్తే.. జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా
Recommended image3
Idli Podi: స్పెషల్ ఇడ్లీ కారం పొడి.. దీంతో ఎన్ని ఇడ్లీలైనా తినేయాలనిపిస్తుంది
Related Stories
Recommended image1
Relationship: చిన్న విషయమే కదా అని వదిలేస్తున్నారా? 5 అలవాట్లు మార్చుకుంటే లైఫ్ అంతా హ్యాపీ
Recommended image2
Hair Growth : జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలంటే తరచూ కట్ చేయాల్సిందేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved