Isha Ambani: గాలా ఈవెంట్ లో అంబానీ కూతురేంటి ఇంత చీప్ నెయిల్ పాలిష్ వేసుకుంది?
రీసెంట్ గా ఇషా మెట్ గాలాలో మెరిచింది. చాలా మంది స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. ఇషా కూడా తన ఫ్యాషన్ సెన్స్ తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

Isha Ambani
మన దేశ కుబేరుడు ముకేష్ అంబానీ ముద్దుల కుమార్తె ఇషా అంబానీకి పరిచయం అవసరం లేదు. ఇషా అంబానీ అంబానీ కూతురుగా మాత్రమే కాదు.. సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా అందరికీ పరిచయమే. అంతేకాదు.. తన ఫ్యాషన్, లగ్జరీ ఛాయిలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
isha ambani
రీసెంట్ గా ఇషా మెట్ గాలాలో మెరిచింది. చాలా మంది స్టార్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనగా.. ఇషా కూడా తన ఫ్యాషన్ సెన్స్ తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఖరీదైన డ్రెస్, కోట్ల విలువ చేసే నగలు ధరించిన ఆమె, చాలా తక్కువ ధర నెయిల్ పాలిష్ ని వేసుకోవడం హాట్ టాపిక్ గా మారడం గమనార్హం.
isha ambani
ఇండియన్ డిజైనర్ అనామిక ఖన్నా డిజైన్ చేసిన ఇండియన్-వెస్ట్రన్ మిక్స్ స్టైల్ లో ఇషా మెరిచింది. ఇషా తన డ్రెస్ ని సూపర్ ఫైన్ టైలరింగ్ బ్లాక్ స్టైల్ థీమ్ తో డిజైన్ చేయించుకుంది. డ్రెస్ పైన వైట్ ఓవర్ కోట్ వేసుకుంది. అనామిక ఖన్నా డిజైన్ చేసిన కార్సెట్ బస్టీయర్, మ్యాచింగ్ ప్యాంట్ వేసుకుంది. ఇషా అంబానీ లుక్ షార్ప్ గా ఉంటూనే గాలాకి మెరుపునిచ్చింది. ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె బ్లాక్ ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్.
isha ambani
తక్కువ ధర నెయిల్ ఆర్ట్: ఇషా తన డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్ ఎంచుకుంది. వైట్ కి బదులు బ్లాక్ ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్, పాయింట్ నెయిల్స్ ఎంచుకుంది. సెలబ్రిటీ మానిక్యూరిస్ట్ జూలియా నెయిల్ ఆర్ట్ చేసింది. జూలియా ఇషా అంబానీ నెయిల్ ఆర్ట్ గురించి చెప్పింది.
జూలియా, ఇషా నెయిల్ ఆర్ట్ కోసం అప్రెస్ నెయిల్ బ్రాండ్ లో రెండు కలర్స్ ఎంచుకుంది. ఒకటి ఫర్గాటన్ ఫిల్మ్. ఇది లైట్ న్యూడ్ కలర్. ఇంకొకటి ఫ్రెంచ్ బ్లాక్. వెబ్సైట్ లో ఈ రెండు నెయిల్ కలర్స్ దొరుకుతాయి. అక్కడి సమాచారం ప్రకారం ఒక్కో నెయిల్ పాలిష్ బాటిల్ ధర 14.99 యుఎస్ డాలర్లు. అంటే దాదాపు 1,252 రూపాయలు. రెండూ కలిపి 2,504 రూపాయలు. ఇషా అంబానీ నెయిల్స్ పైన పెద్ద డిజైన్స్ ఏమీ కనిపించవు. చాలా సింపుల్ గా ఉన్న ఈ నెయిల్ ఆర్ట్ కి ఆమె 2,504 రూపాయలు ఖర్చు పెట్టింది. ఖరీదైన నగలు వేసుకున్న ఇషా అంబానీ నెయిల్ ఆర్ట్ కి మాత్రం చాలా తక్కువ ఖర్చు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Isha Ambani
నీతా అంబానీ వజ్రాల నగలు: మెట్ గాలా లో ఇషా అంబానీ తన తల్లి నీతా అంబానీ వజ్రాల నగలు వేసుకుంది. తాను వేసుకున్న హారం తన తల్లిదని ఇషా చెప్పింది. దాని బరువు దాదాపు 136.25 క్యారెట్లు. దీని ధర కోట్లలో ఉంటుంది. నీతా అంబానీ ఈ నగలను చాలా సార్లు ధరించారు.

