Hair Fall: ప్రోటీన్ ఉన్న ఈ ఐదు ఫుడ్స్ తింటే.. ఒక్క వెంట్రుక కూడా రాలదు..!
Hair fall: జుట్టు విపరీతంగా రాలిపోవడానికి సరైన పోషకాలు అందకపోవడమే కారణం. అది నూనెలు, షాంపూలతో కాదు... మనం తీసుకునే ఆహారం తో మాత్రమే తగ్గుతుంది. అందుకే… ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను డైట్ లో కచ్చితంగా భాగం చేసుకోవాలి.

hair fall
ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. పూర్వం అమ్మమ్మలు, నానమ్మలు ఖరీదైన షాంపూలు, కండిషనర్లు, నూనెలు వాడకపోయినా.. ఒత్తైన, పొడవాటి జుట్లు ఉండేవి. కానీ, ఇప్పుడేమో.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎంత ఖరీదైన నూనెలు, షాంపూలు వాడినా, హెయిర్ ట్రీట్మెంట్లు చేయించుకున్నా కూడా.. జుట్టు రాలిపోతోంది. ఇలా జుట్టు విపరీతంగా రాలిపోవడానికి సరైన పోషకాలు అందకపోవడమే కారణం. అది నూనెలు, షాంపూలతో కాదు... మనం తీసుకునే ఆహారం తో మాత్రమే తగ్గుతుంది. మరీ ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఐదు ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా, అందంగా మారుతుంది.
పన్నీర్...
పన్నీర్ చాలా రుచికరమైన ఆహారం. ఇదే పన్నీర్.. మీ జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? రెగ్యులర్ గా పన్నీర్ తీసుకుంటే... జుట్టు రాలడం పూర్తిగా ఆగుతుంది. 100 గ్రాముల పన్నీర్ లో దాదాపు 18 గ్రాముల ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్ బలహీనమైన జుట్టును రిపేర్ చేస్తుంది. కాల్షియం జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. విటమిన్ డి కూడా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఏదో ఒక రూపంలో పన్నీర్ తీసుకుంటే... మీ జుట్టు రాలడం తగ్గి, అందంగా కనిపిస్తుంది.
బాదం పప్పు...
బాదం పప్పులో ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు మెరిచేలా చేస్తాయి. 28 గ్రాముల బాదంలో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీని కోసం మీరు ప్రతిరోజూ 5 నుంచి 6 బాదం పప్పులను రాత్రంతా నానపెట్టి.. ఉదయాన్నే తీసుకోవాలి.
శనగలు...
శనగల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్ తో పాటు జింక్, విటమిన్ బి6 కూడా ఉంటాయి. ఇవి కెరాటిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కుదుళ్లను బలంగా మారుస్తాయి. 100 గ్రాముల ఉడికించిన చిక్ పీస్ లో దాదాపు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిని సాయంత్రం స్నాక్ రూపంలో కూడా తీసుకోవచ్చు. మెలకెత్తించి తింటే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు.
మునగాకులు...
మునగ ఆకులలో ప్రోటీన్, విటమిన్ A, విటమిన్ C , ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన జుట్టుకు అవసరం. 100 గ్రాముల మునగ ఆకులలో దాదాపు 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. విటమిన్ A సహజ నూనెల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఐరన్ జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
గుమ్మడికాయ గింజలు:
గుమ్మడికాయ గింజలు చిన్నవి అయినప్పటికీ, అవి ప్రోటీన్, జింక్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు , యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఈ పోషకాలు హార్మోన్ల అసమతుల్యత, పొడిబారడం , తలపై చర్మ ఆరోగ్య సమస్యల వల్ల కలిగే జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. 28 గ్రాముల గుమ్మడికాయ గింజలలో 9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుమ్మడికాయ గింజలను వేయించి క్రంచీ స్నాక్‌గా తినవచ్చు. వీటిని ఉప్మా, పెరుగు, సలాడ్‌లతో కలిపి తీసుకోవచ్చు.
ఖరీదైన షాంపూలు, సీరమ్‌లు మొదలైన వాటితో పోలిస్తే ఈ ఆహార పదార్థాలన్నీ తక్కువ ధరకే లభిస్తాయి. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా, మీరు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.