Hair Care: 40 ఏళ్లు దాటిన వారు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన హెయిర్ కేర్ టిప్స్ ఇవి
40 దాటిన తర్వాత కూడా జుట్టు అందంగా కనిపించాలి అంటే కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..

Hair care
మన వయసు పెరుకే కొద్దీ శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా 40 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన తర్వాత మరింత వేగంగా శరీరంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. దాని ప్రభావం మన ముఖం పై క్లియర్ గా కనపడుతుంది. అంటే.. నెమ్మదిగా ముఖంపై ముడతలు రావడం, కళ తగ్గడం లాంటివి జరుగుతాయి. అయితే.. కేవలం చర్మం మీద మాత్రమే కాదు.. జుట్టుపై కూడా ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. విపరీతంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. మరి.. 40 దాటిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. జుట్టు అందంగా కనపడుతుందో తెలుసుకుందాం....
హెయిర్ వాష్...
వయసుతో సంబంధం లేకుండా జుట్టు అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.అలా ఉండాలి అంటే.. మనం రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేసుకోవాలి. అయితే.. చాలా మంది ప్రతి రోజూ తలస్నానం చేయాలి అని అనుకుంటారు. అలా చేస్తే.. జుట్టు ఎక్కువగా డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి.. మీ జుట్టు రకాన్ని బట్టి.. హెయిర్ వాష్ చేసుకోవాలి. అంటే.. మీరు వారానికి రెండు సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. ఆయిల్ హెయిర్ ఉన్నవారు.. వారానికి మూడుసార్లు చేయవచ్చు.
జుట్టును హైడ్రేట్ గా ఉంచండి.
40 ఏళ్ల వయసులో మీ జుట్టును హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. దాని కోసం మీరు సరైన మొత్తంలో నీటిని తీసుకోవాలి. మంచి నీళ్లతో పాటు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు కూడా తీసుకోవచ్చు. జుట్టు అందంగా కనిపించడం కోసం మీరు కొబ్బరి నీటితో మీ జుట్టును శుభ్రం చేసుకోవచ్చు. దీనితో పాటు, మీరు మీ జుట్టుకు కండిషనర్‌ను కూడా ఉపయోగించవచ్చు.
హీట్ ప్రొడక్ట్స్...
చాలా మంది తమ జుట్టు అందంగా కనిపించాలని.. హీట్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. వీటిని వాడటం వల్ల జుట్టు మరింత ఎక్కువగా దెబ్బ తింటుంది. జుట్టు సహజ తేమ ను తొలగిస్తుంది. కాబట్టి... ఇలాంటి వాటిని వాడకపోవడమే మంచిది.
రసాయనాలను ఉపయోగించ వద్దు..
జుట్టుకు ఇన్ స్టాంట్ గా అందం రావాలని చాలా మంది రసాయనాలతో కూడిన ఉత్పత్తులు వాడుతూ ఉంటారు. కానీ, అవి కూడా మీ జుట్టును విపరీతంగా డ్యామేజ్ చేస్తాయి. కాబట్టి... అలాంటి వాటిని కూడా వాడకుండా ఉండాలి. జుట్టుపై స్ట్రెయిటెనింగ్, పెర్మింగ్, కర్లింగ్ మొదలైనవి కూడా ఎలా పడితే అలా వాడకూడదు.
జుట్టు సంరక్షణ కోసం నూనె...
చాలా మంది మహిళలు తమ జుట్టుకు నూనె రాయడాన్ని పెద్దగా ఇష్టపడరు. కానీ.. మన జుట్టుకు నూనె కంటే మెరుగైన సహజ జుట్టు టానిక్ లేదు. ముఖ్యంగా కొబ్బరి, బాదం , గూస్బెర్రీ నూనె జుట్టును కుదుళ్ల నుంచి బలంగా చేస్తాయి. కాబట్టి మీరు వారానికి ఒకసారి మీ జుట్టుకు నూనె రాయాలి.