MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • White Hair: ఇవి మానేస్తే, తెల్ల జుట్టు సమస్యే ఉండదు..!

White Hair: ఇవి మానేస్తే, తెల్ల జుట్టు సమస్యే ఉండదు..!

పొగతాగడం వల్ల చాలా తొందరగా తెల్ల జుట్టు ఎక్కువగా వస్తుంది. స్మోకింగ్ మానేయడం ద్వారా జుట్టు సహజ రంగును ఎక్కువకాలం నిలుపుకోవచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : May 22 2025, 01:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెల్ల జుట్టుకు చెక్ పెట్టండి..
Image Credit : Getty

తెల్ల జుట్టుకు చెక్ పెట్టండి..

అందంగా కనిపించాలనే కోరిక లేనివాళ్లు ఎవరైనా ఉంటారా? వయసు పెరుగుతున్నా కూడా అందంగా కనిపించాలనే తాపత్రయం ఉంటుంది. కానీ, ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు మనకు ఒక అందమైన కిరీటం లాంటిది.ఆ జుట్టు తెల్లగా మారిపోతే ముఖంలో అందం తగ్గిపోతుంది. అసమతుల్య ఆహారం, ఒత్తిడి, వాతావరణంలో మార్పులు, హార్మోన్ల అసమతుల్యత ఇవన్నీ కూడా జుట్టు డ్యామేజ్ కి కారణం అవుతాయి. దీనిని నివారించేందుకు మనం ఇంట్లోనే కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. ముఖ్యంగా కొన్నింటిని మానేస్తే మీ హెయిర్ తెల్లగా మారే అవకాశాలు తక్కువగా ఉంటాయి. మరి, అవేంటో చూద్దామా.

26
1.జుట్టుకు పోషణ ఇచ్చే సహజనూనెలు వాడండి...
Image Credit : Google

1.జుట్టుకు పోషణ ఇచ్చే సహజనూనెలు వాడండి...

ఆమ్లా, కొబ్బరి, కరివేపాకు నూనె లాంటి ఆయుర్వేద నూనెలు జుట్టు సహజ వర్ణాన్ని కాపాడటంలో సహాయపడతాయి.ఈ నూనెలతో రెగ్యులర్ గా తలకు మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది, మూలాలను బలపరుస్తుంది. వీటితో పాటు ఉల్లిరసం కూడా వాడాలి. ఉల్లిపాయ రసం కాటలేస్ అనే ఎన్జైమ్‌ను అందించి మెలనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. వారానికి రెండు సార్లు ఈ నూనెలను, ఉల్లి రసం ఉపయోగించడం వల్ల జుట్టు బలపడుతుంది, తెల్ల వెంట్రుకలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

Related Articles

Related image1
Pregnant Women: గర్భిణులు చికెన్‌ తినవచ్చా ? వైద్యులు ఏమంటున్నారు?
Related image2
Grey Hair: తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారాలా? ఆవనూనెలో ఇవి కలిపి రాస్తే చాలు
36
2. ధూమపానం మానేయండి
Image Credit : Social Media

2. ధూమపానం మానేయండి

ధూమపానం వల్ల శరీరానికి మాత్రమే కాదు, జుట్టుకీ ప్రమాదమే. ఇది జుట్టు మూలాల్లో రక్తప్రసరణను తగ్గించి, మెలనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. పొగతాగడం వల్ల చాలా తొందరగా తెల్ల జుట్టు ఎక్కువగా వస్తుంది. స్మోకింగ్ మానేయడం ద్వారా జుట్టు సహజ రంగును ఎక్కువకాలం నిలుపుకోవచ్చు.

46
3. హీట్ స్టైలింగ్ తగ్గించండి
Image Credit : Getty

3. హీట్ స్టైలింగ్ తగ్గించండి

హెయిర్ డ్రెయ్యర్, స్ట్రెయిటెనర్ లాంటి వేడి ఉత్పత్తుల వల్ల జుట్టు డ్యామేజ్ అయిపోతుంది. తెల్ల జుట్టు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటి వాడకాన్ని తగ్గించండి. స్టైలింగ్ చేయాల్సిన అవసరం ఉంటే, హీట్ ప్రొటెక్షన్ స్ప్రేలు ఉపయోగించండి. రసాయన ఉత్పత్తులకు బదులు, సహజ ఉత్పత్తులు వాడాలి.

56
4. ఒత్తిడిని తగ్గించుకోండి..
Image Credit : unsplash

4. ఒత్తిడిని తగ్గించుకోండి..

దీర్ఘకాలిక ఒత్తిడి మెలనోసైట్స్‌ను దెబ్బతీసి జుట్టు వర్ణాన్ని తగ్గిస్తుంది. ధ్యానం, యోగా, లోతైన శ్వాస వ్యాయామాలు మీ మానసిక ఒత్తిడిని తగ్గించి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజుకు కనీసం 7–8 గంటలు నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ఎంతో మేలుగా పనిచేస్తాయి.

66
5. పోషకాహారం తీసుకోండి
Image Credit : Google

5. పోషకాహారం తీసుకోండి

విటమిన్ B12, డి, రాగి, జింక్, ఐరన్ లాంటి పోషకాల లోపం వల్ల జుట్టు బూడిదగా మారుతుంది. ఆకుకూరలు, గింజలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, పండ్లు లాంటి ఆహారాలను ఆహారంలో చేర్చండి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం మెలనిన్ కోల్పోవడాన్ని తగ్గిస్తుంది.

ఫైనల్ గా చెప్పాలంటే.. సహజ పద్ధతులు, శ్రద్ధగా తీసుకునే జీవనశైలి మార్పులు , సరైన ఆహారం తెల్ల జుట్టును తగ్గించడంలో కీలకంగా ఉంటాయి. కెమికల్ రంగులకు బదులుగా ప్రకృతి పరిష్కారాల వైపు అడుగు వేయండి. మీ జుట్టు మళ్లీ ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
మహిళలు
ఏషియానెట్ న్యూస్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Beauty Tips: పగిలిన మడమలు మీ బ్యూటీని డామినేట్ చేస్తున్నాయా? ఇంట్లోనే సీక్రెట్ ఇంగ్రీడియంట్
Recommended image2
Silver Anklets: వర్కింగ్ ఉమెన్స్ కోసం సింపుల్ డిజైన్ లో వెండి పట్టీలు
Recommended image3
Pearl Earrings: ముత్యాల ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్
Related Stories
Recommended image1
Pregnant Women: గర్భిణులు చికెన్‌ తినవచ్చా ? వైద్యులు ఏమంటున్నారు?
Recommended image2
Grey Hair: తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారాలా? ఆవనూనెలో ఇవి కలిపి రాస్తే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved