Grey Hair: తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారాలా? ఆవనూనెలో ఇవి కలిపి రాస్తే చాలు
చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? అయితే, దాని కోసం జుట్టు కు కెమికల్స్ ఉన్న రంగులు పూయాల్సిన అవసరం లేకుండా, సహజంగా నల్లగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోవాలని ఉందా? అయితే , చదివేయండి..
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. చిన్న పిల్లలకు కూడా తెల్ల జుట్టు వచ్చేస్తుంది.ఒక్కసారి ఇవి రావడం మొదలయ్యాయి అంటే.. వాటిని కవర్ చేయడానికి ఇక తిప్పలు మొదలుపెట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా హెన్నా రాయడం, కలర్స్ వేయడం లాంటివి మొదలుపెడతారు. కానీ, వాటి వల్ల జుట్టు మరింత డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ అవ్వగుండా మీ తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మార్చుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
ఉసిరి, పసుపుతో నల్ల జుట్టు...
మీకు ఇప్పుడిప్పుడు తెల్ల వెంట్రుకలు రావడం మొదలుపెడుతున్నాయి అంటే, కేవలం ఉసిరి, పసుపు వాడి తెల్ల జుట్టును నల్లగా సహజంగా మార్చుకోవచ్చు. దీనిని ఎలా వాడాలో తెలిస్తే చాలు. దీని కోసం మీరు కెమికల్స్ లేని ఉసిరి పొడి, పసుపు తీసుకోవాలి. వీటితో పాటు మీకు ఆవ నూనె కూడా కావాలి. ఈ మూడింటితో హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవాలి.
దీని కోసం మీరు ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్ వేడి అయిన తర్వాత 3 టీ స్పూన్ పసుపు వేయాలి. దానిని నల్లగా అయ్యేంత వరకు వేడి చేయాలి
ఇప్పుడు అందులో 3 చెంచాల ఆమ్లా పౌడర్ కలపండి.అందులో కొద్దిగా ఆవ నూనె కలపండి. వీటన్నింటినీ కలిపి మంచి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. అంతే.. దీనిని మీ తల, జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి.
హెయిర్ ప్యాక్ ని జుట్టు ఎలా అప్లై చేయాలి అంటే...
దీని కోసం మీరు మీ జుట్టును దువ్వాలి. ఈ పేస్ట్‌ను బ్రష్ సహాయంతో మీ జుట్టుకు అప్లై చేయండి. తర్వాత దానిని ఆరనివ్వండి. దీని తర్వాత, షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోండి. ఇలా అప్లై చేయడం ద్వారా మీ జుట్టు నల్లగా మారుతుంది.
మీరు ఈ పద్ధతిని రెగ్యులర్ గా ప్రయత్నిస్తూ ఉండాలి. ఇది మీ జుట్టుకు రంగు వేయవలసిన అవసరాన్ని తొలగిస్తుంది. అలాగే, మీ జుట్టుకు ఎలాంటి రసాయన ఉత్పత్తిని అప్లై చేయవలసిన అవసరం ఉండదు. అలాగే, మీ జుట్టుకు రంగు వేయడానికి పార్లర్‌కు వెళ్లడం ద్వారా మీరు డబ్బు ఆదా చేస్తారు. మీరు దీన్ని ఎప్పుడైనా మీ జుట్టుకు అప్లై చేయవచ్చు. రెగ్యులర్ గా చేస్తూ ఉండటం వల్ల.. మీ జుట్టు సహజంగా నల్లగా మారుతుంది.