కల్వకుంట్ల కవిత ఓటమితో స్వంత పార్టీ నేతల విందు: కారణమిదే

First Published Jun 3, 2019, 1:22 PM IST

నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత ఓటమి పాలు కావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.నిజామాబాద్ ఎంపీ స్థానంలో ఒక్క స్థానంలో కూడ బీజేపీ ఎమ్మెల్యేలు లేరు. కానీ, ఆ పార్టీ మాత్రం ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకొంది. కవిత ఓడిపోయిందని ఆ పార్టీకి చెందిన నేతలు కొందరు విందులు కూడ చేసుకొన్నారని ప్రచారం సాగుతోంది. ఈ విషయమై పార్టీనాయకత్వం ఆరా తీస్తోంది.

2014 ఎన్నికల్లో కవిత ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించారు. నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి కవిత పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కవిత తన సమీప ప్రత్యర్ధిపై 1.67 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్‌ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులే గెలుపొందారు.

ఈ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డిని ఓడించడంలో ఆ సమయంలో కవిత కీలక పాత్ర పోషించారు. కవిత ఈ ఎన్నికల్లో జగిత్యాలలో కేంద్రీకరించి పనిచేశారు. జగిత్యాల నుండి టీఆర్ఎస్ అభ్యర్ధి డాక్టర్ సంజయ్‌ను గెలిపించారు.

తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్‌కు 4,80, 584 ఓట్లు వచ్చాయి. కవితకు కేవలం 4,.09,709 ఓట్లు వచ్చాయి. కవితపై 70,875 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్ధి అరవింద్ నెగ్గారు.

2004, 2009 ఎన్నికల్లో ఈ స్థానం నుండి విజయం సాధించిన కాంగ్రెస్ నేత మధు యాష్కీ ఈ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారు. ఈ ఎన్నికల్లో మధు యాష్కీ అయిష్టంగానే పోటీ చేశారు. మధు యాష్కీకి కేవలం 69,240 ఓట్లు మాత్రమే వచ్చాయి.

2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన జరిగిన పార్లమెంట్ ఎన్నికల నాటికి ప్రజల తీరులో మార్పు వచ్చింది.ఈ మార్పుకు కారణం ఏమిటని టీఆర్ఎస్ నేతలు ఆరా తీస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక్కో ఎమ్మెల్యే 10 నుండి 40 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కానీ, పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితిలో మార్పు వచ్చింది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కవిత కంటే వేలాది ఓట్ల మెజారిటీ బీజేపీకి దక్కింది

అయితే టీఆర్ఎస్ కంటే బీజేపీకి ఎందుకు ఎక్కువ ఓట్లు వచ్చాయనే విషయమై గులాబీ బాస్ అంతర్గతంగా నివేదికలను కోరినట్టుగా సమాచారం. ఏ కారణాల చేత ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, టీఆర్ఎస్‌కు ఓట్లు తగ్గడంపై గల కారణాలను ఆయన అన్వేషిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు కుమ్మక్కు కావడం వల్లే కవిత ఓటమి పాలైందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదే విషయాన్ని ప్రకటించారు.

టీఆర్ఎస్‌ నేతలే కవిత ఓటమికి కారణమని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలను కూడ టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఆలోచనల్లో పడేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల గెలుపు కోసం కవిత కష్టపడింది. కానీ, ఆమె విజయం కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ మేరకు కష్టపడలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

2018 డిసెంబర్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు భారీ మెజారిటీలతో విజయం సాధించారు.

ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5లక్షల62వేల538 ఓట్లు వచ్చాయి. ఎంపీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు 4,09,709 ఓట్లు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 1.52 లక్షల ఓట్లు తక్కువగా వచ్చాయి.

జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో కవితకు 45వేల ఓట్లు తక్కువగా వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి డాక్టర్ సంజయ్‌కు 1,03,213 ఓట్లు వస్తే, ఈ ఎన్నికల్లో కవితకు 58,413 ఓట్లు మాత్రమే వచ్చాయి. కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధి విద్యాసాగర్ రావుకు 84,702 ఓట్లు వచ్చాయి, ఈ దఫా కవితకు 57,604 ఓట్లు మాత్రమే వచ్చాయి. 27 వేలకు పైగా ఓట్ల తేడా ఉంది.

ఆర్మూర్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డికి 72,125 ఓట్లు వస్తే, కవితకు 40,884 ఓట్లు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో కవితకు 32 వేలు ఓట్లు తగ్గిపోయాయి.కాంగ్రెస్ పార్టీ నుండి ఆకుల లలిత, మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డిలు టీఆర్ఎస్‌లో చేరినా కూడ భారీగా ఓట్లు తక్కువగా వచ్చాయి.

నిజామాబాద్ రూరల్‌లో కూడ ఇదే పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్‌కు 23 వేల ఓట్లు తక్కువగా ఈ నియోజకవర్గంలో వచ్చాయి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధి బాజిరెడ్డి గోవర్ధన్‌కు 87,766 ఓట్లు వస్తే, కవితకు 64,258 ఓట్లు మాత్రమే వచ్చాయి. బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ రెడ్డికి 73,538 ఓట్లు వస్తే కవితకు56,502 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ నియోజకవర్గంలో 17 వేల ఓట్లు తక్కువగా వచ్చాయి. బోధన్‌లో 13,177 ఓట్లు, నిజామాబాద్‌ అర్భన్‌లో 3,538 ఓట్లు తక్కువగా కవితకు వచ్చాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని మధు యాష్కీ భావించారు. కానీ, అయిష్టంగానే నిజామాబాద్ నుండి పోటీ చేశారు.ఈ కారణంగానే మధు యాష్కీ నామ మాత్రంగానే ప్రచారం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పట్టించుకోలేదు. దీంతో క్షేత్రస్థాయలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీకి ఓటు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరో వైపు ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన 176 రైతు అభ్యర్ధులకు 92,432 ఓట్లు వచ్చాయి. రైతు అభ్యర్ధులు కూడ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బీజేపీ అభ్యర్ధికి సహకరించారనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

ఇదిలా ఉంటే కవిత ఓటమి పాలైందని తెలిసిన వెంటనే కొందరు టీఆర్ఎస్ నేతలు విందులు చేసుకొన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ విషయం అధిష్టానం వద్దకు చేరింది. ఈ విషయమై టీఆర్ఎస్ నాయకత్వం ఆరా తీస్తోంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?