- Home
- Telangana
- Hyderabad: రాత్రి మిగిలిన మటన్ ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? చనిపోతారు జాగ్రత్త. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
Hyderabad: రాత్రి మిగిలిన మటన్ ఫ్రిజ్‌లో పెడుతున్నారా.? చనిపోతారు జాగ్రత్త. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన
ఒకప్పుడు ఎప్పటికప్పుడు వంట చేసుకొని తినే వారు. కానీ ప్రస్తుతం ఫ్రిజ్‌లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వంటకాలను స్టోర్ చేసుకొని రెండు, మూడు రోజులు తింటున్నాం. అయితే హైదరాబాద్‌లో జరిగిన ఓ సంఘటన గురించి తెలిస్తే ఇకపై మీరు ఆ పని చేయరు.

ఫ్రిజ్‌లో స్టోర్ చేసిన మటన్ తిని వ్యక్తి మృతి
బోనాల పండగ సందర్భంగా ఉత్సాహంగా జరుపుకున్న ఒక కుటుంబానికి రెండో రోజే విషాదం ఎదురైంది. ఫ్రిజ్‌లో నిల్వ చేసిన మటన్‌ను తిన్న 13 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో ఒకరు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై వైద్యులు, ఆరోగ్య నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
బోనాల వేళ వండిన మటన్.. మరుసటి రోజు విషంగా మారింది
జూలై 21, ఆదివారం బోనాల సందర్భంగా హైదరాబాద్‌లోని వనస్థలిపురం RTC కాలనీలో ఓ కుటుంబం మటన్ వండుకున్నారు. కుటుంబ సభ్యులంతా ఎంచక్కా భోజనం చేశారు. మిగిలిన మటన్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసి, సోమవారం తిరిగి తిన్నారు. అయితే ఆ మాంసం తినగానే ఇంట్లోని సభ్యులు వాంతులు, డయ్యేరియా, తలనొప్పి వంటి లక్షణాలతో ఒక్కసారిగా బలహీనపడ్డారు.
వెంటనే ఆసుపత్రికి అంతలోనే..
అస్వస్థతకు గురైన కుటుంబ సభ్యులను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఆర్టీసీ ఉద్యోగిగా పని చేస్తున్న వ్యక్తి పరిస్థితి తీవ్రమవడంతో మృతి చెందాడు. మిగిలిన 12 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. అందులో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఫ్రిజ్‌లో మాంసం నిల్వ చేస్తే ఏమవుతుంది.?
ఫ్రిజ్‌లో ఉంచిన మాంసం సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే బాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా సాల్మొనెల్లా, ఈ కోలిన్, లిస్టేరియా వంటి హానికరమైన సూక్ష్మక్రిములు అభివృద్ధి చెంది ఆహారాన్ని విషపూరితంగా మారుస్తాయి. రెండు రోజులు పైగా నిల్వ చేసిన మాంసం తినడం ప్రమాదకరం.
అలాగే ఫ్రిజ్‌లో నిల్వ చేసే ముందు మాంసాన్ని గాలికి తగలకుండా హర్మెటిక్ కంటైనర్‌లో పెట్టకపోతే వాసన మారిపోవడం, రంగు మారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవన్నీ మాంసం వాడిపోయిందని సూచిస్తాయి. ఆహారాన్ని ఫ్రిజ్‌లో తప్పుగా స్టోర్ చేయడం వల్ల కలిగే నష్టాలకు సంబంధించిన వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కరెంట్ మైక్రోబయోలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్ అనే జర్నల్‌లో స్పష్టంగా వివరించారు.
ఫ్రిజ్‌లో నిల్వచేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?
* వండిన మాంసం – 24 గంటల్లోనే వినియోగించాలి.
* ఉడికిన బ్రెడ్ – తేమ ద్వారా ఫంగస్ వేగంగా ఏర్పడుతుంది.
* ఉడికిన బిర్యానీ/కూరలు – రెండు రోజులకు మించకూడదు.
* ఆకుకూరలు – ఎక్కువ రోజులు నిల్వ చేస్తే పోషకాలు నాశనం అవుతాయి.
* పండిన అరటి పండ్లు – ఫ్రిజ్ ఉష్ణోగ్రతలో బ్లాక్‌గా మారిపోతాయి.
* బట్టర్ మిల్క్, పెరుగు – ఆమ్లత్వం పెరిగి ఆమ్ల దాహం, పేగు సమస్యలకు దారితీస్తుంది.
ఫుడ్ పాయిజన్ లక్షణాలు, ముందస్తు జాగ్రత్తలు
ఫుడ్ పాయిజన్ అయిన ఆహారాన్ని తీసుకున్న వెంటనే వాంతులు, విరేచనాలతోపాటు అధిక జ్వరం, కడుపు నొప్పి, నీరసం, మూర్ఛ, తలనొప్పి, ఊబకాయం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఒకవేళ ఫ్రిజ్‌లో ఉంచిన మాంసాన్ని మళ్లీ తినాలంటే మాంసాన్ని మళ్లీ వాడేముందు పూర్తిగా వేడి చేయాలి. ఫ్రిజ్ ఉష్ణోగ్రత 4°C (40°F) కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాంసం రంగు, వాసనను పరీక్షించాలి.