నాకు మగతనమే లేదు: హజీపూర్ సీరియల్ రేపిస్ట్ ట్విస్ట్

First Published 4, Jan 2020, 1:02 PM

మృతుల దుస్తులపై ఉన్న వీర్యకణాలకు తనకూ సంబంధం లేదని, పోలీసులు సిరంజి ద్వారా తన నుంచి వీర్యం తీసుకుని వెళ్లారని ఆయన చెప్పాడు. తనకు ఆండ్రాయిడ్ ఫోన్ లేదని, బూతు బొమ్మలు చాశానని అనడం కూడా నిజం కాదని అన్నాడు. 

హజీపూర్ సీరియల్ రేప్స్, అత్యాచారాల కేసులో నిందితుడైన శ్రీనివాస్ రెడ్డి కోర్టు ముందు ట్విస్ట్ ఇచ్చాడు. తనకు అసలు మగతనమే లేదని అతను చెప్పాడు. హజీపూర్ లో జరిగిన హత్యలతో తనకు ఏ విధమైన సంబంధం లేదని అతను చెప్పాడు. పోలీసులే తనను ఇరికించారని, హత్యలకు సంబంధించిన సాక్ష్యాలన్నీ అవాస్తవమేనని అతను అన్నాడు.

మృతుల దుస్తులపై ఉన్న వీర్యకణాలకు తనకూ సంబంధం లేదని, పోలీసులు సిరంజి ద్వారా తన నుంచి వీర్యం తీసుకుని వెళ్లారని ఆయన చెప్పాడు. తనకు ఆండ్రాయిడ్ ఫోన్ లేదని, బూతు బొమ్మలు చాశానని అనడం కూడా నిజం కాదని అన్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్ లో జరిగిన శ్రావణి, కల్పన, మనిషాలపై అత్యాచారం, వారి హత్యలపై శుక్రవారం నల్లగొండ జిల్లా ఫస్ట్ అడిషినల్ సెషన్ కోర్టులో న్యాయమూర్తి వి. విశ్వనాథ రెడ్డి విచారణ నిర్వహించారు, ఆగురు గంటల పాటు విచారణ సాగింది.

ఇది వరకు మనీషా హత్య కేసుకు సంబంధఇంచిన సాక్ష్యాలపై విచారణ జరిగింది. శుక్రవారంనాడు శ్రావణి, కల్పన కేసులకు సంబంధించి 72 మంది సాక్షులు చెప్ిపన వాంగ్మూలాలను న్యాయమూర్తి చదివి నిందితుడికి వినిపించారు. అతని నుంచి ఒక్కోదానికి సమాధానం తీసుకుని రికార్డు చేశారు.

సాక్షులందరూ శ్రీనివాస్ రెడ్డే నిందితుడని సాక్షం చెప్పారని, దానిపై ఏమి చెబుతావని న్యాయమూర్తి అడిగారు. తనకు ఆ హత్యలతో సంబంధం లేదని, కావాలనే తనను ఇరికించారని శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు. నీ తరఫున సాక్ష్యాలు ఉన్నాయా అని అడిగితే తమ అమ్మానాన్నలను పిలిపించాలని కోరారు. వారు ఎక్కుడున్నారని అడిగితే వారి చిరునామా తనకు తెలియదని చెప్పాడు.

నువ్వు ఇంతకు ముందు పనిచేసినవారి అడ్రస్ ఇవ్వు. పిలిపిస్తామని న్యాయమూర్తి చెప్పారు. వారి అడ్రస్ కూడా లేదని శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు. నువ్వు పనిచేశానని చెప్పావు, పనిచేసే చోట అడ్రస్ తెలియకుండా పనిచేశావా అని న్యాయమూర్తి అడిగితే తెలియదని, తన తల్లిదండ్రులనే పిలిపించాలని శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు.

నాలుగేళ్ల క్రితం కల్పన అనే అమ్మాయిపై కూడా అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసి బస్తాలో మూటకట్టి అదే మర్రిబావిలో పాతిపెట్టావు. దాన్ని అందరి ముందు నువ్వు అంగీకరించావు అని చెప్పగా... అంతా అబద్ధమని, తనను పోలీసు స్టేషన్ లో ఉంచారని, బావి వద్దకు తీసుకుని వెళ్లలేదని శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు.

మృతుల దుస్తులపై ఉన్న వీర్యం నీదేనని పరీక్షల్లో తేలిందని, నువ్వు అత్యాచారం చేశావని న్యాయమూర్తి అనగా తనకు మగతనమే లేదని శ్రీనివాస్ రెడ్డి చెప్ాపడు. వైద్యులు నువ్వు ఫిట్ గా ఉన్నావని, నువ్వు పనిచేసే చోట ఓ వేశ్యను తీసుకుని వచ్ిచ చంపి వాటర్ ట్యాంక్ లో పడేశావని, అప్పట్లో కర్నూలు పోలీసులు నిన్ను అరెస్టు చేసి రిమాండ్ కూడా చేశారు కదా అని అన్నప్పుడు అది కూడా అబద్ధమేనని శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు.

మర్రిబావి వద్ద ఓ చెట్టు దగ్గర ఉన్న బీరు సీసాలను ఫింగర్ ప్రింట్స్ నిపుణులు పరీక్షిస్తే ల్యాబ్ లో నీ వేలిముద్రలేనని తేలిందని, దానికి నీ సమాధానం ఏమిటని న్యాయమూర్తి అనగా పోలీసులు బలవంతంగా బీరు సీసాను పట్టించారని చెప్పాడు. నీకు నాలుగైదు ఫోన్ నెంబర్లున్నాయని, నీ ఫోన్ లో చనిపోయిన శ్రావణి, కల్పన, మనీషాల ఫోటోలు ఉన్నాయని, నీ ఫోన్ ను సీజ్ చేసి డేటాను పరిశీలించగా నువ్వు బూతు బొమ్మలు చూసేవాడివని తేలిందని, దానిపై ఏమంటావని న్యాయమూర్తి అడగ్గా, తనకు చిన్న ఫోన్ మాత్రమే ఉందని, ఆండ్రాయిడ్ లేదని చెప్పాడు.

పోలీసులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన 101 మంది సాక్ష్యాల విషయంలో కూడా అంతా అబద్ధమేనని, పోలీసులు కావాలని చేశారని శ్రీనివాస్ రెడ్డి చెప్పాడు. నీ మీద కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే తమ భూమి అమ్మలేదని కొందరు చేశారని, కావాలనే ఇరికించారని శ్రీనివాస రెడ్డి సమాధానమిచ్చాడు. కేసు విచారణను న్యాయమూర్తి ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు.