- Home
- Telangana
- మీరు ఈ వీకెండ్ వెజిటెబుల్ మార్కెట్ కు వెళుతున్నారా..? అయితే ఇక్కడ కూరగాయల ధరలు తెలుసుకొండి
మీరు ఈ వీకెండ్ వెజిటెబుల్ మార్కెట్ కు వెళుతున్నారా..? అయితే ఇక్కడ కూరగాయల ధరలు తెలుసుకొండి
Today Vegetable Prices : మీరు ఈ వారాంతం సంతలో కూరగాయలు కొనేందుకు వెళ్లేముందు వాటి ధరలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఏ కూరగాయ ఎంతకు కొనుగోలు చేయాలో తెలుస్తుంది… డబ్బులు ఆదా అవుతాయి.

నేటి కూరగాయల ధరలు
Vegetable Price : వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో కాలనీలన్నీ కూరగాయల సంతలతో నిండిపోతాయి. ఇతర పట్టణాలు, పల్లెల్లో కూడా ఇదే సీన్ కనిపిస్తుంది. వీకెండ్ సెలవులతో ఉద్యోగులకు, విద్యార్థులకు కూడా స్కూళ్లు ఉండవుకాబట్టి గృహిణులకు సమయం దొరుకుతుంది. దీంతో వారాంతంలో మార్కెట్ కు వెళ్ళేందుకు సిద్దమవుతారు... వారానికి సరిపడా కూరగాయలు ఒకేసారి కొంటుంటారు. అందుకే వేతనజీవులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పక్కాగా వారాంతం కూరగాయల సంతలు ఉంటాయి.
అయితే వారమంతా వివిధ పనుల్లో బిజీబిజీగా ఉండటంతో కూరగాయల ధరల గురించి తెలిసే ఆస్కారం ఉండదు. దీనివల్ల దేన్ని ఎంతకు కొనాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒక్కోసారి ఎక్కువ ధరకు కొని నష్టపోయే అవకాశాలుంటాయి. కాబట్టి మీరు కూరగాయలు కొనేందుకు మార్కెట్ కు వెళుతుంటే ఒక్కసారి ధరల గురించి తెలుసుకోండి. హైదరాబాద్ లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ అందిస్తున్నాం.
కిలో టమాటా ధర ఎంత?
వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతింది... దీంతో దిగుబడి తగ్గడంతో మార్కెట్ లోకి తక్కువగా వస్తోంది. సరఫరా తగ్గి డిమాండ్ పెరగడంతో టమాటా ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో టామాటా రూ.30 నుండి రూ.40 వరకు ఉంది. రాబోయే రోజుల్లో ఈ ధర మరింత పెరిగే అవకాశాలున్నాయని కూరగాయాల వ్యాపారులు చెబుతున్నారు.
కిలో ఉల్లిపాయల ధర ఎంత?
ప్రతి వంటింట్లో ఉల్లిపాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది... వీటిన ప్రతి వంటకంలో ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి... కిలో రూ.20-25 లభిస్తున్నాయి. రూ.100 కి ఐదారు కిలోలు కూడా అమ్ముతున్నారు. ఉల్లిపాయలు ఎక్కువరోజులు పాడవకుండా నిల్వ ఉంటాయి కాబట్టి ధర తక్కువ ఉన్నపుడే ఎక్కువగా కొనిపెట్టుకోవడం మంచిది.
ఇతర కూరగాయల ధరలు...
హైదరాబాద్ లో పచ్చిమిర్చీ కిలో రూ.20-30 వరకు ఉంది. అలాగే కిలొ బెండకాయ రూ.45, కాకరకాయ కిలో రూ.38, బీరకాయ కిలో రూ.40, క్యాబేజీ కిలో రూ.20-25, బీన్స్ కిలో రూ.55, క్యారెట్ కిలో రూ.60 గా ఉంది.
ఇక ఆలుగడ్డలు కిలో రూ.25-30, క్యాప్సికం కిలో రూ.50, సొరకాయ కిలో రూ.25, క్యాలిఫ్లవర్ కిలో రూ.31-34, దోసకాయ కిలో రూ.20, వంకాయలు కిలొ రూ.40, సొరకాయ కిలొ రూ.25, బెండకాయ కిలో రూ.45, చిక్కుడు కాయ కిలో రూ.55 అమ్ముతున్నారు.
ఆకుకూరల ధరలు
పాలకూర కిలో రూ.13-15, పూదీనా రూ.3-5 కట్ట, కరివేపాకు రూ.5-10 కట్ట, కొత్తిమీర రూ.10-20 కట్ట, మెంతి కూర కిలో రూ.20, చామకూర కిలో రూ.16-18 లభిస్తున్నాయి.
గమనిక : ఈ కూరగాయాలు, ఆకుకూరల ధరలు సూపర్ మార్కెట్లు, షాపులు, రైతుబజార్లు, వారాంతం సంతలు జరిగే ఏరియాను బట్టి మారుతుంటాయి... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.