MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ

Cold Wave Alert: ఏపీతో పాటు తెలంగాణ‌లో చ‌లి పంజా విసురుతోంది. మ‌ధ్యాహ్నం ఎండ తీవ్ర‌త ఉన్నా ఉద‌యం రాత్రుళ్లు మాత్రం చ‌లి చంపేస్తోంది. కొన్ని చోట్ల ఉష్ణోగ్ర‌త‌లు సింగిల్ డిజిట్‌కు ప‌డిపోయాయి. రానున్న 3 రోజుల్లో చ‌లి తీవ్ర‌త మ‌రింత పెరిగే అకాశం ఉంది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Dec 13 2025, 06:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వాతావరణ శాఖ అలర్ట్
Image Credit : Gemini AI

వాతావరణ శాఖ అలర్ట్

తెలుగు రాష్ట్రాలపై చలి ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో సాధారణ జీవనం ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతాలు, ఏపీ మన్యం జిల్లాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
తెలంగాణలో చలి పంజా
Image Credit : X@IndianTechGuide

తెలంగాణలో చలి పంజా

తెలంగాణలో చలి గాలులు బలంగా వీస్తున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీలు నమోదు కాగా, మెదక్‌లో 7.2 డిగ్రీలు, హనుమకొండలో 8.6 డిగ్రీలు నమోదయ్యాయి. నిజామాబాద్‌లో 11.4 డిగ్రీలు, హైదరాబాద్‌లో 12.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. హైద‌రాబాద్‌లో కొన్ని చోట్ల శుక్ర‌వారం సింగిల్ డిజిట్ టెంప‌రేచ‌ర్ న‌మోదైంది.

36
మూడు రోజులు ఇదే పరిస్థితి
Image Credit : Gemini AI

మూడు రోజులు ఇదే పరిస్థితి

రానున్న రెండు మూడు రోజులు చలి తీవ్రత తగ్గే సూచనలు లేవని అధికారులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చలి గాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కారణంగా ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు.

46
ఆరెంజ్ అలర్ట్ జారీ
Image Credit : Gemini AI

ఆరెంజ్ అలర్ట్ జారీ

తెలంగాణ‌లో దాదాపు అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో రికార్డు స్థాయిలో చలి నమోదవుతోంది. హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి.

56
వృద్ధులు, చిన్నారులకు ప్రమాదం
Image Credit : Asianet News

వృద్ధులు, చిన్నారులకు ప్రమాదం

చలి తీవ్రత వల్ల వృద్ధులు, చిన్నారులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఉదయం తొందరగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయాణాలు తగ్గించుకోవడం, ఉన్ని దుస్తులు ధరించడం అవసరం అని తెలిపారు.

66
మన్యం జిల్లాల్లో మరీ దారుణం
Image Credit : unsplush

మన్యం జిల్లాల్లో మరీ దారుణం

ఇక ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం జిల్లాల్లో చలి మరింత తీవ్రంగా ఉంది. పాడేరు, అరకులో 4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మినుములూరులో 4 డిగ్రీలు, చింతపల్లిలో 5.5 డిగ్రీల వరకు చలి పడిపోయింది. పొలాల్లో నీరు గడ్డకట్టడంతో రైతులు ఉదయం వేళల్లో బయటకు రావడానికి భయపడుతున్నారు. ఉదయం 9 గంటలు దాటినా మంచు తెరలు తొలగడం లేదు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
వాతావరణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Related Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Recommended image2
న్యూమ‌రాల‌జీ ప్ర‌కారం ఈ తేదీల్లో పుట్టిన వారు.. గొప్ప బిజినెస్ మ్యాన్‌లు అవ్వ‌డం ప‌క్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved