పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ కూడ వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికలపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి.
పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ఓ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దాదాపు పదేళ్లకు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది.
also read:ఆ ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపే టార్గెట్: తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహం
పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
2024 ఏప్రిల్ మాసంలో నిర్ణీత షెడ్యూల్ ప్రకారంగా పార్లమెంట్ కు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.ఈ తరుణంలో ఎన్నికల షెడ్యూల్ 15 నుండి 20 రోజుల ముందే విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది.
also read:తెలంగాణ నుండి పోటీ: సోనియా కోసం ఆ మూడు స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్
పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
తెలంగాణలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను దక్కించుకొనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఈ మేరకు రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఇంచార్జీలను కూడ నియమించింది కాంగ్రెస్ నాయకత్వం.
also read:పదేళ్లకు ఒకే వేదికపై బాబు, పవన్:ఆంధ్రప్రదేశ్‌లో 2014 రిజల్ట్స్ వస్తాయా?
పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ సభ్యులు గెలుపొందారు.
also read:తెలంగాణపై బీజేపీ ఫోకస్: ఎంపీ టిక్కెట్ల కోసం బీజేపీ నేతల మధ్య పోటా పోటీ
పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
తెలంగాణలో 2014,2018 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారాన్ని సాధించింది. 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి 11 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి 9 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. ఈ దఫా గతంలో సాధించిన ఎంపీ స్థానాల్లో కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందాలని ఆ పార్టీ వ్యూహంతో ముందుకు వెళ్తుంది. తెలంగాణలో అధికారాన్ని కోల్పోవడంతో పార్లమెంట్ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫోకస్ పెట్టారు.
also read:వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్: 10 సర్వేలతోనే ఇంచార్జీల మార్పులు
పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అసెంబ్లీ ఫలితాలతో పార్లమెంట్ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెంచింది. ఈ విషయమై తెలంగాణ నేతలకు జాతీయ నాయకత్వం దిశా నిర్దేశం చేసింది. దీంతో రాష్ట్రంలో మెజారిటీ పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు వ్యూహరచన ప్రారంభించారు.
also read:పోగోట్టుకొన్నచోటే:పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, ఎంపీలతో ముఖాముఖి
పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
తెలంగాణ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు కోరినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. ఒకవేళ నరేంద్ర మోడీ తెలంగాణ నుండి పోటీ చేస్తే ఆ ప్రభావం దక్షిణాదిపై చూపుతుందని కూడ పార్టీ నేతలు అభిప్రాయంతో ఉన్నారని ప్రచారం సాగుతుంది.
also read:తెలంగాణలో 12 ఎంపీ స్థానాలపై బీజేపీ ఫోకస్:కాంగ్రెస్‌కు చెక్ పెట్టేనా?
పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడం పెద్ద టాస్క్. తెలంగాణ ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు.తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకొనేందుకు గాను కాంగ్రెస్ నాయకత్వం వ్యూహ రచన చేస్తుంది.
also read:మేడిగడ్డ బ్యారేజీ: బీఆర్ఎస్‌ను చక్రబంధంలోకి నెడుతున్న కాంగ్రెస్
పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
ఈ నెల 18వ తేదీన కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించారు. తెలంగాణ నుండి సోనియా గాంధీని పోటీ చేయాలని కూడ తీర్మానం చేశారు.ఈ తీర్మానం కాపీని సోనియా గాంధీకి అందించారు.
also read:దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: తెలంగాణలో నరేంద్ర మోడీ పోటీ, ఆ స్థానం ఏదంటే?
పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ రావడానికి ప్రధానంగా ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కీలక పాత్ర పోషించాయి. ఈ ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలను కూడ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.ఆరు గ్యారంటీల్లో రెండు హామీలను అమలు చేసింది. మిగిలిన హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
also read:1980 లో మెదక్‌లో ఇందిరా విజయం: తెలంగాణ నుండి సోనియా పోటీ చేస్తుందా?
పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఏడాదికి కనీసం రూ. 60 వేల కోట్లు ఖర్చు అవుతుంది. తెలంగాణ ఖజానా నిండుకుంది. దీంతో ఈ హామీలు అమలు చేయడం రేవంత్ రెడ్డి సర్కార్ కు చాలెంజ్ గా మారింది. దీంతో గత ప్రభుత్వం సుమారు ఆరున్నర లక్షల కోట్ల మేరకు అప్పులు చేసింది.ఈ అప్పులకు వడ్డీలు కట్టడంతో పాటు సంక్షేమ పథకాలు, రాష్ట్ర రోజువారీ అవసరాలు తీర్చేందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవాలి.
also read:నాడు రేవంత్‌కు లీగల్ నోటీసు:ఐఏఎస్ అరవింద్‌పై వేటు, మిగిలిన వారికి దెబ్బేనా?
పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
మరో వైపు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల కోసం వనరులను తెచ్చుకోవాలి. దరిమిలా గత ప్రభుత్వం ఏం చేసిందనే విషయమై ప్రజలకు వివరించేందుకు ఆర్ధిక పరిస్థితి, విద్యుత్ పై కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేసింది. శ్వేత పత్రాల ద్వారా భారత రాష్ట్ర సమితి సర్కార్ ఏం చేసిందనే విషయాలను ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది.గత సర్కార్ విధానాలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టే ప్రయత్నం చేసింది.
also read:ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఔట్: రోహిత్ శర్మ టాప్ ప్రియారిటీ ఇదే..
పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల సమయం నాటికి అమలు చేయాలి. వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ ఆరు గ్యారంటీలు టేకాఫ్ అయితే ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చేందుకు దోహదపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
also read:రెండేళ్ల క్రితం భర్త మృతి: అతడి వీర్యంతో పండంటి బిడ్డకు జన్మ, ఎలాగంటే?
పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
పార్లమెంట్ ఎన్నికల సమయం నాటికి ఆరు గ్యారంటీలు అమలు చేయలేకపోతే దాని ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై చూపే అవకాశం లేకపోలేదు. మరో వైపు జీహెచ్ఎంసీ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడ విజయం సాధించలేదు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడానికి వ్యూహన్ని మొదలు పెట్టింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైద్రాబాద్ అభివృద్దిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని సీఎం సూచించారు.
పార్లమెంట్ ఎన్నికలు 2024:రేవంత్ ముందున్న సవాళ్లు ఇవీ..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కుదురుకోక ముందే పార్లమెంట్ ఎన్నికలు రేవంత్ రెడ్డికి సవాల్ ను విసరనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన సీట్లు దక్కకపోతే ముఖ్యమంత్రికి రాజకీయంగా ఇబ్బందులు వచ్చే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
also read:వైఎస్ఆర్‌సీపీ అసెంబ్లీ ఇంచార్జీల మార్పు: జగన్ స్కెచ్ ఇదీ..