Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో 12 ఎంపీ స్థానాలపై బీజేపీ ఫోకస్:కాంగ్రెస్‌కు చెక్ పెట్టేనా?


తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ పార్లమెంట్ స్థానాలపై  భారతీయ జనతా పార్టీ  ఫోకస్ పెట్టింది.  వచ్చే ఎన్నికల్లో  కనీసం  పదికిపైగా స్థానాలను దక్కించుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తుంది. 

BJP Focuses 12 Parliament Segments from Telangana state lns
Author
First Published Dec 19, 2023, 1:58 PM IST


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో  12 స్థానాలపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది. మిగిలిన స్థానాల్లో  భవిష్యత్తులో కేంద్రీకరించనుంది.  2024 పార్లమెంట్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ముఖ్యమైనవిగా తీసుకుంది.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుండి నాలుగు ఎంపీ స్థానాల్లో  భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.  అయితే 2024 ఏప్రిల్ మాసంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో  తెలంగాణలోని  12 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.  ఈ స్థానాల్లో విజయం కోసం ఆ పార్టీ  ఫోకస్ పెట్టింది. ఇటీవలనే  బీజేపీ ముఖ్యనేతలు సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  చర్చించారు. 

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.  ఈ ఏడాది నవంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి.  బీజేపీ  111 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఎనిమిది స్థానాల్లో గెలుపొందింది.  జనసేన ఎనిమిది స్థానాల్లో పోటీ చేసినా ఎక్కడా ఆశించిన ఓట్లను కూడ సాధించలేకపోయింది.

ఖమ్మం,నల్గొండ, వరంగల్, హైద్రాబాద్, మహబూబాబాద్  స్థానాలపై బీజేపీ అంతగా ఫోకస్ పెట్టడం లేదు.  మిగిలిన 12 పార్లమెంట్ స్థానాలపై  ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. అయితే  ఐదు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. అయితే ఈ ఐదు స్థానాల్లో కంటే  మిగిలిన  12 స్థానాల్లో ఫోకస్ మరింతగా పెంచితే  పార్టీకి రాజకీయంగా ప్రయోజనమనే అభిప్రాయంతో  ఆ పార్టీ నాయకత్వం ఉంది.  

సికింద్రాబాద్,  ఆదిలాబాద్, నిజామాబాద్,  కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో  2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు.  సికింద్రాబాద్ నుండి జి.కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ నుండి సోయం బాపూరావు, నిజామాబాద్ నుండి  ధర్మపురి అరవింద్,  కరీంనగర్ నుండి బండి సంజయ్  విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఈ స్థానాల్లో ఈ అభ్యర్థులే బరిలోకి దిగే అవకాశం ఉంది.


గత ఎన్నికల్లో విజయం సాధించిన నాలుగు పార్లమెంట్ స్థానాలతో పాటు  పెద్దపల్లి,జహీరాబాద్, మెదక్,మల్కాజిగిరి,చేవేళ్ల,మహబూబ్ నగర్,నల్గొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలపై భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుండి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కూడ పోటీ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కూడ కోరినట్టుగా ప్రచారం సాగుతుంది.  ఈ విషయమై బీజేపీ పార్లమెంటరీ పార్టీ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణ నుండి నరేంద్ర మోడీ పోటీ చేస్తే రాజకీయంగా తమకు ప్రయోజనం కలుగుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. 

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలి  తెలంగాణ నుండి మోడీ పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణ నుండి సోనియా గాంధీని పోటీ చేయాలని కాంగ్రెస్ కోరింది.  ఈ మేరకు కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం తీర్మానం చేసింది.  ఒకవేళ సోనియా గాంధీ పోటీ చేయడానికి ముందుకు వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇదే సమయంలో మోడీ కూడ  తెలంగాణలో పోటీ విషయమై  ప్రచారం ప్రారంభమైంది.

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకుంది.  2019 పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది.  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో  కనీసం  12 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. 

also read:దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: తెలంగాణలో నరేంద్ర మోడీ పోటీ, ఆ స్థానం ఏదంటే?

ఇదిలా ఉంటే  ప్రస్తుతం తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది.  పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకొని కాంగ్రెస్ కు  బీజేపీ చెక్ పెడుతుందా లేదా అనేది  ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios