పోగోట్టుకొన్నచోటే:పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, ఎంపీలతో ముఖాముఖి
పార్లమెంట్ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి ఫోకస్ పెట్టనుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ ఎంపీలతో సమావేశం కానున్నారు.
పోగోట్టుకొన్నచోటే:పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, ఎంపీలతో ముఖాముఖి
తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ ను పెట్టనుంది. హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్ లోని నందినగర్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
పోగోట్టుకొన్నచోటే:పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, ఎంపీలతో ముఖాముఖి
పార్లమెంట్ లో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో విపక్ష పార్టీల సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. దీంతో భారత రాష్ట్ర సమితికి చెందిన ఎంపీలను హైద్రాబాద్ కు తిరిగి రావాలని కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆదేశించారు.
పోగోట్టుకొన్నచోటే:పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, ఎంపీలతో ముఖాముఖి
నిర్ణీత షెడ్యూల్ మేరకు 2024 ఏప్రిల్ మాసంలో పార్లమెంట్ ఎన్నికలు జరగాలి. అయితే నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్ చేయనున్నారు.
పోగోట్టుకొన్నచోటే:పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, ఎంపీలతో ముఖాముఖి
ఈ నెల 18వ తేదీరాత్రి, ఈ నెల 19వ తేదీన భారత రాష్ట్ర సమితికి చెందిన ఎంపీలకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫోన్ చేశారు. న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ కు రావాలని ఆదేశించారు. హైద్రాబాద్ లో ఎంపీలతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విడి విడిగా సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో పరిస్థితిపై చర్చించనున్నారు.
పోగోట్టుకొన్నచోటే:పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, ఎంపీలతో ముఖాముఖి
2023 ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నుండి 10 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉంది. బీజేపీ మూడు నుండి ఐదు ఎంపీ స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి 9 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ మూడు, బీజేపీ నాలుగు స్థానాల్లో గెలిచింది. ఎంఐఎం ఒక్క స్థానంలో గెలుపొందింది.
పోగోట్టుకొన్నచోటే:పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, ఎంపీలతో ముఖాముఖి
గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ 9 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఈ దఫా ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశం లేదని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందనే భారత రాష్ట్ర సమితి నేతలు అభిప్రాయంతో ఉన్నారు.
పోగోట్టుకొన్నచోటే:పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, ఎంపీలతో ముఖాముఖి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు , పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓటరు నాడి వేర్వేరుగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలని భావిస్తే ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు చేసే అవకాశం ఉంటుందంటున్నారు.
పోగోట్టుకొన్నచోటే:పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, ఎంపీలతో ముఖాముఖి
ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో అధిక ఎంపీలను కైవసం చేసుకోవాలని కూడ ఆ పార్టీ భావిస్తుంది. ఈ మేరకు కేసీఆర్ వ్యూహరచన చేయనున్నారు.ఈ క్రమంలోనే ఎంపీలను కేసీఆర్ ఢిల్లీ నుండి హైద్రాబాద్ కు రావాలని ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాలను దక్కించుకొని పట్టును నిలుపుకోవాలని భారత రాష్ట్ర సమితి భావిస్తుంది.
పోగోట్టుకొన్నచోటే:పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ ఫోకస్, ఎంపీలతో ముఖాముఖి
ఇదిలా ఉంటే దక్షిణాదిలోని తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీలు కూడ ఆశలు పెట్టుకున్నాయి. తెలంగాణలోని 12 పార్లమెంట్ స్థానాలపై బీజేపీ కేంద్రీకరించింది. మరోవైపు కాంగ్రెస్ కూడ తెలంగాణలో ఎక్కువ ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని ఇప్పటి నుండి పావులు కదుపుతుంది. సోనియా గాంధీని తెలంగాణ నుండి పోటీ చేయాలని పీఏసీ తీర్మానం చేసింది. మరోవైపు బీజేపీ నేతలు కూడ తెలంగాణ నుండి నరేంద్ర మోడీని పోటీ చేయాలని కోరారు.