Year Ender 2023:టాప్ 10 బ్యాట్స్ మెన్స్ వీరే

2023 సంవత్సరంలో  దక్షిణాఫ్రికాకు చెందిన బ్యాట్స్ మెన్ బవువా మూడు సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచారు. 

Year Ender 2023:List of Top 10 Batsmen with Most ODI Hundreds 2023 lns

న్యూఢిల్లీ: 2023 సంవత్సరంలో  మూడు సెంచరీలు చేసి దక్షిణాఫ్రికాకు చెందిన బ్యాట్స్ మెన్  బవువా  అగ్రస్థానంలో నిలిచారు.  భారత జట్టు క్రికెటర్  విరాట్ కోహ్లి  11 ఇన్నింగ్స్ ల్లో  మూడు సెంచరీలు చేశారు.

దక్షిణాఫ్రికాకు చెందిన భవువా  ఎనిమిది మ్యాచుల్లో  మూడు సెంచరీలు సాధించాడు. మొత్తం  ఎనిమిది ఇన్నింగ్స్ ల్లో  580  పరుగులు సాధించాడు.  144 అత్యధిక స్కోర్.
న్యూజిలాండ్ కు చెందిన  డేవన్ కాన్ వే  ఎనిమిది మ్యాచ్ ల్లో  మూడు సెంచరీలు చేశాడు. ఎనిమిది మ్యాచుల్లో  433 పరుగులు చేశారు. 138 అత్యధిక పరుగులు.జింబాబ్వేకు చెందిన  సీయన్ విలియమ్స్  9 మ్యాచుల్లో  మూడు సెంచరీలు చేశాడు.  మొత్తం  720 పరుగులు సాధించాడు. హైయ్యెస్ట్ స్కోర్ 174 పరుగులు.విరాట్ కోహ్లి  13 మ్యాచులు, 11 ఇన్నింగ్స్ ల్లో  మూడు సెంచరీలు సాధించాడు.  మొత్తం  553 పరుగులు కోహ్లి సాధించాడు. ఇందులో  166 అత్యధిక స్కోరు.పాకిస్తాన్ కు చెందిన  ఫకార్ జమాన్  15 మ్యాచులు ఆడాడు. మూడు సెంచరీలు సాధించాడు.  మొత్తం  640 పరుగులు రాబట్టాడు. జమాన్ అత్యధిక స్కోరు 180.

న్యూజిలాండ్ కు చెందిన  డారీ మిచెల్  14 మ్యాచుల్లో మూడు సెంచరీలు సాధించాడు.  మొత్తం  631 పరుగులు సాధించాడు.అత్యధిక స్కోరు 129.భారత్ జట్టుకు చెందిన  శుభ్ మన్ గిల్  మూడు సెంచరీలు సాధించాడు.15 మ్యాచుల్లో 885 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 208.

 

1.బవువా(దక్షిణాఫ్రికా) 3 సెంచరీలు 8 మ్యాచులు 580 పరుగులు 144 అత్యధిక స్కోరు
2.దేవన్ కోనవ్( న్యూజిలాండ్) 3 సెంచరీలు 8 మ్యాచులు 433 పరుగులు 138 అత్యధిక స్కోరు
3.విలియమ్స్(జింబాబ్వే) 3 సెంచరీలు

9మ్యాచులు

720 పరుగులు 174 అత్యధిక స్కోరు
4.విరాట్ కోహ్లి(ఇండియా) 3 సెంచరీలు 13మ్యాచులు 553 పరుగులు 166 అత్యధిక స్కోరు
5.ఫహర్ జమాన్(పాకిస్తాన్) 3 సెంచరీలు 15మ్యాచులు 640 పరుగులు 180 అత్యధిక స్కోరు
6. మిచెల్ (న్యూజిలాండ్) 3 సెంచరీలు 14మ్యాచులు 631 పరుగులు 129 అత్యధిక స్కోరు
7.శుభ్ మన్ గిల్ (ఇండియా) 3 సెంచరీలు 15మ్యాచులు 885 పరుగులు 208 అత్యధిక స్కోరు
8.ఆసిఫ్ ఖాన్(యూఏఈ) 3 సెంచరీలు 24 మ్యాచులు 934 పరుగులు 151 అత్యధిక స్కోరు
9.రాయ్(ఇంగ్లాండ్) 2 సెంచరీలు 6 మ్యాచులు 278 పరుగులు 132 అత్యధిక స్కోరు
10.డేవిడ్ మలన్ 2 సెంచరీలు 7 మ్యాచులు 368 పరుగులు 118 అత్యధిక స్కోరు

యూఏఈకి చెందిన ఆసిఫ్ ఖాన్  24 మ్యాచుల్లో మూడు సెంచరీలు సాధించాడు. 24 మ్యాచుల్లో  934 పరుగులు సాధించాడు.  అత్యధిక స్కోరు 151.
ఇంగ్లాండ్ కు చెందిన  జాన్సన్ రోయ్  రెండు సెంచరీలు సాధించాడు. మొత్తం  278 పరుగులు రాబట్టాడు. అత్యధిక స్కోరు 132. ఇంగ్లాండ్ కు చెందిన  డేవిడ్ మలన్ రెండు సెంచరీలు చేశాడు. మొత్తం  ఏడు మ్యాచుల్లో  రెండు సెంచరీలు చేశాడు.  ఏడు మ్యాచుల్లో  368 పరుగులు చేశారు. అత్యధిక స్కోరు 118.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios