Asianet News TeluguAsianet News Telugu

మేడిగడ్డ బ్యారేజీ: బీఆర్ఎస్‌ను చక్రబంధంలోకి నెడుతున్న కాంగ్రెస్

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు అంశంపై  రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది. అదే సమయంలో  మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై సీబీఐ విచారణకు కోరుతుంది కాంగ్రెస్.

Congress leader niranjan files petition for CBI Probe in Telangana high court on sinking of medigadda barrage lns
Author
First Published Dec 19, 2023, 12:21 PM IST

హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో అప్పటి భారత రాష్ట్ర సమితిని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.   మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో  సీబీఐ విచారణ కోరుతూ  తెలంగాణ హైకోర్టులో  కాంగ్రెస్ పార్టీ నేత నిరంజన్  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా  మేడిగడ్డ బ్యారేజీ (లక్ష్మీ బ్యారేజీ) ని నిర్మించారు.  ఈ ఏడాది అక్టోబర్  21వ తేదీన  మూడు పిల్లర్లు కుంగిపోయాయి.  మేడిగడ్డ బ్యారేజీకి చెందిన బీ బ్లాక్ లోని  19, 20, 21 పిల్లర్లు కుంగిపోయాయి.  ఈ పిల్లర్ల కుంగుబాటు వెనుక విద్రోహ శక్తుల ప్రమేయం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు అధికారులు.ఈ మేరకు  ఇరిగేషన్ శాఖకు చెందిన  ఏఈఈ రవికాంత్  ఈ ఏడాది అక్టోబర్ 24న  మహాదేవ్‌పూర్ పోలీసులకు పిర్యాదు చేశారు. పీడీపీపీ సెక్షన్ కు చెందిన మూడు సెక్షన్లతో పాటు  ఐపీసీ 427 సెక్షన్ల కింద కూడ  కేసులు నమోదు చేశారు పోలీసులు.

మేడిగడ్డ బ్యారేజీ మూడు పిల్లర్ల కుంగుబాటుపై  విద్రోహశక్తుల ప్రమేయం లేదని  అప్పట్లోనే  జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఈ ఫిర్యాదుపై విచారణను  సీబీఐకి బదిలీ చేయాలని  కాంగ్రెస్ పార్టీ నిరంజన్  తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ  పిల్లర్ల కుంగుబాటుపై  కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 

ఈ నెల  17న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  నీటిపారుదల శాఖ అధికారులతో  సమీక్ష నిర్వహించారు.అదే రోజు రాత్రి సీఎం అనుముల రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. ఈ నెల  18న నీటిపారుదల శాఖాధికారులతో పాటు ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్టర్  ఎస్ వీ దేశాయ్ తో  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజీ డిజైన్ గురించి  నీటిపారుదల అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. అయితే  ఈ డిజైన్ గురించిన సంస్థ గురించి  నీటిపారుదల శాఖాధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సమాచారం.  ఈ విషయమై  మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.  డిజైన్ లేకుండా  అప్పట్లో ప్రభుత్వ పెద్దల సహకారంతో  ఈ బ్యారేజీ నిర్మాణం జరిగిందని  అధికారులు చెప్పారనే ప్రచారం కూడ సాగుతుంది. 

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తమ గొప్పగా  ప్రచారం చేసుకుంది.  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో డొల్లతనం, అవకతవకలు, అవినీతిని బయట పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది.  

కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా  కాలువల నిర్మాణం చేయకుండానే  ఎలాంటి ఉపయోగమని  విపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ నేతలు  ప్రశ్నిస్తున్నారు.  కామారెడ్డి జిల్లాలో  కాలువలు పూర్తి చేయని విషయాన్ని  రేవంత్ రెడ్డి  ఎన్నికల ప్రచారంలో కూడ ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకున్నారు. 

also read:ఎవరిని వదలం:మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఉత్తమ్ ఆగ్రహం, బీఆర్ఎస్‌కు చుక్కలేనా?

తెలంగాణ శాసనమండలిలో  మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై  సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయిస్తామని  తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి  ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన రెండు రోజులకే  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   అధికారులతో సమీక్ష నిర్వహించి సీరియస్ వ్యాఖ్యలు చేశారు.  ఈ బ్యారేజీ కుంగుబాటుకు బాధ్యులైన వారిని ఎవరిని  వదలబోమని వార్నింగ్ ఇచ్చారు. మరో వైపు ఈ విషయమై  సీబీఐ విచారణ కోరుతూ  కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించడం చర్చకు దారి తీసింది.  

 

Follow Us:
Download App:
  • android
  • ios