MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Telangana
  • BRS MLAs: కేటీఆర్, హరీశ్‌ సహా 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు.. దోషులుగా తేలితే ఎలాంటి శిక్షలు పడతాయి?

BRS MLAs: కేటీఆర్, హరీశ్‌ సహా 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు.. దోషులుగా తేలితే ఎలాంటి శిక్షలు పడతాయి?

BRS MLAs: తెలంగాణ అసెంబ్లీ ముట్టడి యత్నం ఘటనలో కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసుల నమోదయ్యాయి. దోషులుగా తేలితే పడే శిక్షలు ఏంటో తెలుసా?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 08 2026, 10:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు.. అసెంబ్లీ ప్రాంగణంలో అసలేం జరిగింది?
Image Credit : X/BRSparty

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు.. అసెంబ్లీ ప్రాంగణంలో అసలేం జరిగింది?

తెలంగాణ శాసనసభ సాక్షిగా సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. నల్ల టీషర్టులు ధరించి, ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో భద్రతా వలయాన్ని దాటుకుని లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారని, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని తోసేసి, కాలర్లు పట్టుకుని, తీవ్ర పదజాలంతో దూషించారని ఖైరతాబాద్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. బాలస్వామి ఫిర్యాదు చేశారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సహా 14 మంది ఎమ్మెల్యేలు, కీలక నేతలపై పంజాగుట్ట, ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బీఎన్ఎస్ కింద నమోదైన సెక్షన్లు: లీగల్ కోణంలో ఏ సెక్షన్ దేనికి సంకేతం?
Image Credit : stockPhoto

బీఎన్ఎస్ కింద నమోదైన సెక్షన్లు: లీగల్ కోణంలో ఏ సెక్షన్ దేనికి సంకేతం?

కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాల ప్రకారం ఈ కేసులను బుక్ చేశారు. పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజ్, వీడియో ఆధారాలు, మీడియా విజువల్స్ ఆధారంగా కేసు నమోదైంది. ఈ కేసుల్లో పేర్కొన్న ప్రధాన సెక్షన్లు ఇవే..

• BNS సెక్షన్ 121(1): ప్రభుత్వ ఉద్యోగి తన విధులు నిర్వహించకుండా అడ్డుకోవడానికి, తీవ్రమైన గాయం చేయడానికి లేదా బెదిరించడానికి ప్రయత్నించడం.

• BNS సెక్షన్ 132: విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేయడం లేదా నేరపూరిత బలాన్ని ఉపయోగించడం.

• BNS సెక్షన్ 74 & 79: మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వారి గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం (మహిళా పోలీసుల పట్ల ప్రవర్తనపై).

• BNS సెక్షన్ 351 & 352: నేరపూరిత బెదిరింపులు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీయడం.

• BNS సెక్షన్ 353: సభలు, సమావేశాలు లేదా బహిరంగ ప్రాంతాల్లో గందరగోళం సృష్టించడం.

• BNS సెక్షన్ 3(5): పలువురు వ్యక్తులు కలిసి ఒకే ఉద్దేశంతో నేరానికి పాల్పడడం.

Related Articles

Related image1
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే?
Related image2
Water In Dreams: కలలో నీళ్లు లేదా సముద్రం కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
35
ఒకవేళ కోర్టులో దోషులుగా తేలితే ఎలాంటి శిక్షలు పడతాయి?
Image Credit : X/BRSparty

ఒకవేళ కోర్టులో దోషులుగా తేలితే ఎలాంటి శిక్షలు పడతాయి?

ఒకవేళ న్యాయస్థానంలో విచారణ జరిగి, ఈ విజువల్స్ ఆధారంగా ఆరోపణలు రుజువైతే, సదరు నాయకులకు చట్టపరంగా కఠినమైన పరిణామాలు ఎదురవుతాయి. ఆ వివరాలు గమనిస్తే..

1. జైలు శిక్షలు, జరిమానాలు

BNS 132, 121(1): విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేసి, విధులను అడ్డుకున్నట్లు తేలితే 2 నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడే అవకాశం ఉంది.

BNS 74 (మహిళా సిబ్బంది అవమానం): మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని తేలితే 1 నుంచి 3 ఏళ్ల జైలు శిక్ష విధించవచ్చు.

BNS 351 (బెదిరింపులు): తీవ్రమైన బెదిరింపులకు పాల్పడినట్లు నిరూపితమైతే మరో 2 ఏళ్ల వరకు శిక్ష పడే ఛాన్స్ ఉంటుంది.

2. ఎమ్మెల్యే పదవులకు అనర్హత ముప్పు

o ప్రజా ప్రాతినిధ్య చట్టం (Representation of the People Act, 1951) ప్రకారం, ఏదైనా క్రిమినల్ కేసులో ప్రజాప్రతినిధికి 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే, వారు వెంటనే తమ సభ్యత్వాన్ని (MLA/MLC పదవిని) కోల్పోతారు. అంతేకాకుండా శిక్ష కాలం పూర్తయిన తర్వాత మరో 6 ఏళ్ల పాటు పోటీ చేయడానికి కూడా అనర్హులవుతారు.

45
స్పీకర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు: MLCల అరెస్ట్ వెనుక ఉన్న లీగల్ అస్త్రాలు
Image Credit : X/BRSparty

స్పీకర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు: MLCల అరెస్ట్ వెనుక ఉన్న లీగల్ అస్త్రాలు

మరోవైపు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, కులపూరిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, బి. నవీన్ కుమార్ రెడ్డిలను సైఫాబాద్ పోలీసులు మంగళవారం ఉదయం ముందస్తు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేశారు. స్పీకర్ OSD పొల్లెపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో SC/ST (అట్రాసిటీ నిరోధక) చట్టం పరిధిలోని కీలక సెక్షన్లను చేర్చారు.

సభాధిపతిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. అంతేకాకుండా ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినవారు కావడం, బహిరంగ ప్రదేశంలో కులాన్ని ఉద్దేశించి మాట్లాడారనే ఆరోపణలు ఉండటంతో SC/ST అట్రాసిటీ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం కింద నమోదు అయ్యే నేరాలు నాన్-బెయిలబుల్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ కేసు విచారణలో భాగంగా ఎమ్మెల్సీలను నాంపల్లి ఫస్ట్ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

55
రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్: తదుపరి పరిణామాలు ఏంటి?
Image Credit : Asianet News

రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్: తదుపరి పరిణామాలు ఏంటి?

బీఆర్ఎస్ నాయకులపై కేసుల నమోదుతో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రభుత్వం తమ నాయకులపై కక్షపూరితంగా పోలీసులు, అట్రాసిటీ కేసులను ఉపయోగిస్తోందని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తుండగా, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని, పోలీసులను అవమానిస్తే సహించేది లేదని కాంగ్రెస్, ఇతర అధికార పక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు. పోలీసుల వద్ద ఉన్న సీసీటీవీ డిజిటల్ సాక్ష్యాలు కోర్టులో ఎంతవరకు నిలుస్తాయి, ఈ లీగల్ వార్ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
రాజకీయాలు
భారత రాష్ట్ర సమితి
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Revanth Reddy Speech |అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Revanth Reddy vs KCR
Recommended image2
Now Playing
Teenamar Mallanna VS ponguleti Srinivas Reddy | Asianet News Telugu
Recommended image3
Now Playing
THROWBACK : అసెంబ్లీలో కేసీఆర్ Vs రేవంత్ రెడ్డి | KCR VS Revanth Reddy In Telangana Assembly
Related Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే?
Recommended image2
Water In Dreams: కలలో నీళ్లు లేదా సముద్రం కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved