టోక్యో ఒలింపిక్స్: మీరాభాయ్ ఛాను... వండర్ వుమెన్ ఆఫ్ ఇండియా...
టోక్యో ఒలింపిక్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ ఛాను అద్భుతం చేసింది. 48 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించి, సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. భారీ అంచనాలతో టోక్యోకి వెళ్లిన ఆర్చరీ, షూటింగ్ టీమ్స్ ఫెయిల్ అయిన చోట, మీరాభాయ్ తొలి పతకాన్ని అందించింది.
మీరాభాయ్ ఛాను పూర్తిపేరు సాయికోమ్ మీరాభాయ్ ఛాను. 2014లో స్కాట్లాండ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 48 కేజీల విభాగంలో రజతం సాధించి, అందరి దృష్టిని ఆకర్షించింది మీరాభాయ్ ఛాను...
అయితే 2014లోనే జరిగిన ఆసియా క్రీడల్లో మీరాభాయ్ ఛాను ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. 9వ స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది...
2015లో జరిగిన వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో కూడా 9వ స్థానంలో నిలిచిన మీరాభాయ్ ఛాను, రియో ఒలింపిక్స్‌లో తీవ్రంగా నిరుత్సాహపరిచింది...
క్లీన్ అండ్ జెర్క్ సెక్షన్లో వెయిట్ లిఫ్ట్ చేయబోయి గాయపడిన మీరాభాయ్ ఛాను, పోటీలను పూర్తిచేయలేకపోయింది. అయితే ఒలింపిక్ పతకం సాధించాలనే కలను నెరవేర్చుకునేందుకు ఐదేళ్లుగా తీవ్రంగా శ్రమించింది మీరాభాయ్ ఛాను...
2107లో వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మీరాభాయ్ ఛాను, కరణం మల్లీశ్వరి తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత వెయిట్‌లిఫ్టర్‌గా రికార్డు క్రియేట్ చేసింది...
2018 కామన్వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మీరాభాయ్ ఛాను, 2019లో జరిగిన ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో తృటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది...
ఏషియాన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్ సాధించి, టోక్యో ఒలింపిక్స్‌కి అర్హత సాధించిన మీరాభాయ్ ఛాను... ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన మొట్టమొదటి భారత వుమెన్ వెయిట్ లిఫ్టర్‌గా చరిత్ర సృష్టించింది.
2012లో బాక్సింగ్‌లో కాంస్య సాధించిన భారత బాక్సర్ మేరీకోమ్ తర్వాత ఒలింపిక్ మెడల్ సాధించిన అతిపెద్ద వయస్కురాలిగా నిలిచింది మీరాభాయ్ ఛాను. మేరీ కోమ్ తన 29వ ఏట ఒలింపిక్ మెడల్ సాధించగా, మీరాభాయ్ ఛాను వయసు 26 ఏళ్లు...