Relationship: పెళ్లి చేసుకోబోతున్నారా.. అయితే ఓసారి ఇది చూడండి?
Relationship: పెళ్లి అనగానే చాలామందికి ఆనందం కన్నా కంగారు ఉంటుంది ఎందుకంటే పెళ్లి తరువాత పరిస్థితులు గురించిన ఆలోచన వారిని కుదురుగా ఉండనివ్వదు. వారిని ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ తీసుకోమంటున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్. అది ఏంటో చూద్దాం.
పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా అది ఒక ముఖ్య ఘట్టం. వివాహానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ ఎందుకంటే ఈ నిర్ణయం మీదే భవిష్యత్తు జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉండబోతుంది అనే ఆలోచన కూడా యువతని కుదురుగా ఉండనివ్వదు.
పూర్వకాలంలో పెళ్లి తర్వాత జీవితం ఇలా ఉంటుంది, ఇలా నడుచుకోవాలి అని చెప్పటానికి ఇంట్లో పెద్దవారు ఉండేవారు. ఇప్పుడు అలాంటి వారు ఎవరూ లేకపోవడం వల్ల పెళ్లంటేనే అయోమయం పడుతున్నారు చాలామంది యువత.
అలాంటి వాళ్లకి ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ సజెస్ట్ చేస్తున్నారు రిలేషన్ ఎక్స్పర్ట్స్. ఈ కౌన్సిలింగ్ లో పెళ్లి చేసుకోబోయే భార్య భర్త ఇద్దరూ పాల్గొంటారు. పెళ్లంటే ఒక రోజుతో అయిపోతుంది కానీ దాని వెనుక జీవితం అంతా కష్టమైనా సుఖమైనా ఆ ఇద్దరే భరించాలి.
కాబట్టి పెళ్లి తరువాత జీవితం మీద ఒక అవగాహన కోసం ఈ కౌన్సిలింగ్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఒక వ్యక్తి ప్రవర్తన పెళ్ళికి ముందు ఒకలాగా పెళ్లి తరువాత ఒకలాగా ఉంటుంది. కాబట్టి మీ కాబోయే భాగస్వామి మీ అంచనాలకి తగినవాడు అవునో కాదో ఈ కౌన్సిలింగ్ ద్వారా మీరు ఒక అవగాహనకి రావచ్చు.
అలాగే చిన్న చిన్న గొడవలకే విడిపోవడం పరిష్కారం కాదు అనే విషయం తెలుసుకుంటారు.పెళ్లి అనేది ఒక విలువైన బంధం. ఆ బంధంలో ఎదురయ్యే ఒడిదుడుకులని ఎలా ఎదుర్కోవాలో ఈ కౌన్సిలింగ్ ద్వారా ఒక అవగాహన కి వస్తారు యువత. వైవాహిక జీవితంలో భాగస్వామి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఒకరు ఒకరు అర్థం చేసుకుంటే జీవితం అందంగా ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ద్వారా మీ భాగస్వామి యొక్క మనస్తత్వాన్ని అంచనా వేయటానికి ఒక అవగాహన ఏర్పడుతుంది కాబట్టి పెళ్ళికి ముందు కచ్చితంగా ఈ కౌన్సిలింగ్ ని తీసుకోవడానికి ప్రయత్నించండి.