ఆడవారు వయాగ్రా తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
ప్రస్తుత కాలంలో తక్కువ సెక్స్ డ్రైవ్ సమస్యను మగవారితో పాటుగా ఆడవాళ్లు కూడా ఫేస్ చేస్తున్నారు. అయితే పురుషులు ఈ సమస్యను అధిగమించడానికి వయాగ్రా తీసుకుంటారు. ఇది వారికి సహాయపడుతుందని పరిశోధనల్లో రుజువు అయ్యింది. అయితే ఫ్లిబన్సెరిన్ లేదా 'ఫిమేల్ వయాగ్రా' ఆడవారికి సహాయపడుతుందా? లేదా అంటే?
చాలా మంది ఆడవారు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో తక్కువ సెక్స్ డ్రైవ్ ను ఫేస్ చేస్తుంటారు. ప్రెగ్నెన్సీ, స్ట్రెస్, మారుతున్న జీవనశైలి, పిల్లలు పుట్టడం వంటి ఎన్నో కారణాల వల్ల సెక్స్ డ్రైవ్ తగ్గుతుంది. లైంగిక వాంఛ వయసుతో పాటు తగ్గుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. నిజానికి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, వయస్సు-సంబంధిత లేదా ఇతరత్రా కారణాల వల్ల కూడా చిన్న వయసులోనే లైంగిక కోరికలు తగ్గుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే పురుషులు వారి సెక్స్ డ్రైవ్ ను పెంచుకోవడానికి, అంగస్తంభన లోపాన్ని పోగొట్టడానికి నోటి మందు వయాగ్రాను తీసుకుంటుంటారు. ఇలాగే ఆడవారికి సహాయపడే వయాగ్రాలు ఉన్నాయా? లేవా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
తక్కువ సెక్స్ డ్రైవ్ అంటే?
సెక్స్ డ్రైవ్ తక్కువగా ఉండటమంటే శృంగార ఆలోచనలు, ఫాంటసీలతో పాటు లైంగిక కార్యకలాపాలపై వీరికి ఇంట్రెస్ట్ ఉండదు. లేదా తక్కువగా ఉంటుంది. అంతేకాదు వీరు లైంగిక కార్యకలాపాలకు కూడా స్పందించరు. అలాగే సెక్స్ సమయంలో లైంగిక ఉద్రేకం లేదా ఆనందాన్ని పొందరంటున్నారు నిపుణులు. ఆరు నెలల పాటు ఇలాంటి సమస్యను ఫేస్ చేస్తే వీరి సెక్స్ డ్రైవ్ తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి.
వయాగ్రా మహిళలకు సహాయపడుతుందా?
వయాగ్రాను పురుషులే ఉపయోగిస్తారు. ఇది వారి సెక్స్ డ్రైవ్ ను పెంచడానికి సహాయపడుతుంది. అయితే ఇది ఆడవారిలో ఎలా పనిచేస్తుందనే దానికి సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. నిపుణుల ప్రకారం.. పురుషుల్లో వయాగ్రా రక్త నాళాలను విస్తరింపజేసి పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దీంతో వారు అంగస్తంభన పొందుతారు. అయితే ఇది పురుషుల లైంగిక పనితీరును మెరుగుపరచడానికి ఉద్దేశించింది.
అందుకే తక్కువ సెక్స్ డ్రైవ్ తో బాధపడుతున్న ఆడవారికి వయాగ్రా ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో ఖచ్చితంగా చెప్పడానికి ఎక్కువ పరిశోధనలు లేవు. అయితే ఇది జననేంద్రియ ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే సున్నితత్వం, ఉద్వేగం, భావప్రాప్తికి చేరుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. మహిళల్లో వయాగ్రా ప్రభావంపై అధ్యయనాలు మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి.
ఆడవారికి కోసం వయాగ్రాలు ఉన్నాయా?
ఫ్లిబన్సెరిన్ అనే మందును తరచుగా 'ఫీమేల్ వయాగ్రా' లేదా 'పింక్ పిల్' అని అంటుంటారు. ఇది ఆడవారిలో తక్కువ లైంగిక డ్రైవ్ సమస్యను తగ్గించడానికి సహాయపడుతుంది. రుతువిరతికి దగ్గరలో ఉన్న ఆడవారిలో లైంగిక ఆసక్తి తగ్గడం/ ఉద్వేగ రుగ్మత (ఎఫ్ఎస్ఐఎడి) కు ప్రత్యేకంగా చికిత్స చేయడానికి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 2015 లో ఈ మందును ఆమోదించింది. ఒత్తిడి లేదా వయస్సు సంబంధిత కారకాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఈ మందును తీసుకోకూడదు.
అయితే ఈ మందు వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదు. అవేంటంటే..
మైకము
మూర్ఛ
నిద్రపోవడం
అనారోగ్యంగా అనిపించడం
వికారం
అలసట
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వీటిని ఉపయోగించాలనుకుంటే డాక్టర్ సలహాను ఖచ్చితంగా తీసుకోవాలి. ఎంతమోదులో వాడాలో తెలుసుకోవాలి.