'మెకానిక్ రాకీ' ట్విట్టర్ రివ్యూ : ఈసారైనా విశ్వక్ సేన్ హిట్ కొట్టాడా..మూవీ ఎలా ఉందంటే..
తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం విశ్వక్ స్టైల్ వేరు. తాజాగా విశ్వక్ సేన్ నటించిన చిత్రం మెకానిక్ రాకీ. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
విశ్వక్ సేన్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన యాటిట్యూడ్ తో కెరీర్ బిగినింగ్ నుంచి ఆకర్షిస్తున్నాడు. అంతే విశ్వక్ సేన్ తన కెరీర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలా మంచి హిట్ అందుకోలేకున్నాడు. తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం విశ్వక్ స్టైల్ వేరు. తాజాగా విశ్వక్ సేన్ నటించిన చిత్రం మెకానిక్ రాకీ. రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. రజిని తాళ్లూరి నిర్మాణంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ ఏడాది విశ్వక్ సేన్ నుంచి వస్తున్న మూడవ చిత్రం మెకానిక్ రాకీ. ఆల్రెడీ గామి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలు రిలీజ్ అయ్యాయి.
విశ్వక్ సేన్ సరసన ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాథ్ నటించడం విశేషం. శుక్రవారం రోజు ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. దీనితో ప్రీమియర్స్ నుంచి ఆడియన్స్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ఎలా ఉంది ? ఈసారైనా విశ్వక్ సేన్ హిట్ అందుకున్నాడా అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
కొన్ని సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలతో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత శ్రద్దా శ్రీనాథ్, విశ్వక్ సేన్ ఎంట్రీ ఇస్తారు. కొన్ని కామెడీ సన్నివేశాలతో చిత్రం అలా ముందుకు వెళుతూ ఉంటుంది. కామెడీ సీన్స్ అక్కడక్కడా నవ్విస్తాయి కానీ పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ చూపించవు. ఫస్ట్ హాఫ్ లో మీనాక్షి చౌదరితో డ్యూయెట్ సాంగ్స్, ఫైట్స్ గట్రా ఉంటాయి. అయితే ఇంటర్వెల్ వరకు ఆశించిన స్థాయిలో చిత్రం ఆసక్తిగా ఉండదు.
స్క్రీన్ ప్లే కూడా చాలా రొటీన్ అనిపిస్తుంది. కామెడీ సన్నివేశాలు నవ్వించకపోవగా చిరాకు పుట్టించేలా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో స్టోరీ లైన్ అసలు ఉండదు. ఇంటర్వెల్ ని ట్విస్ట్ తో ఎండ్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు ఆసక్తిగా అనిపిస్తాయి. కానీ ఆ ట్విస్ట్ లని ఉపయోగించుకుని కథని బిల్డ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ లో కామెడీ కూడా కాస్త వర్కౌట్ అయింది.
సెకండ్ హాఫ్ ని ఇంకా ఆస్తకిగా మార్చి ఉండొచ్చు. ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ బెటర్ కానీ.. సినిమాని నిలబెట్టే స్థాయిలో లేదు. కొన్ని సీన్లు సెకండ్ హాఫ్ లో కూడా బోరింగ్ గా ఉంటాయి. విశ్వక్ సేన్ తన సూట్ అయ్యే పాత్రలో నటించాడు. విశ్వక్ సేన్ గత చిత్రాల్లో లాగే అతడి యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ డైమింగ్ ఉంటాయి.
ఓవరాల్ గా మెకానిక్ రాకీ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఫస్ట్ హాఫ్ లో బోరింగ్ కామెడీ, సరైన కథ లేకపోవడం, ఇంటర్వెల్ వరకు ఆసక్తి కలిగించకపోవడం మైనస్ గా మారాయి. కమర్షియల్ ఫార్మాట్ లో ట్రై చేసినప్పుడు అన్ని అంశాలు పర్ఫెక్ట్ గా ప్యాకేజ్ లాగా కుదరాలి. మెకానిక్ రాకీ చిత్రంలో అది జరగలేదు.