Relationship: పిల్లల పెంపకంలో గొడవ పడుతున్నారా.. భార్య భర్తలు కలిసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే?
Relationship: దంపతులు చాలా విషయాల్లో అన్యోన్యంగా ఉంటారు కానీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి అభిప్రాయ బేధాలు వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలంటే కలిసి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో చూద్దాం.
ఈరోజుల్లో పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రులకు ఒక పెద్ద టాస్క్. భార్య భర్తలు ఇద్దరూ ఒక మాట మీద ఉండి క్రమశిక్షణతో పిల్లల పెంపకం జరిగితే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది కానీ ఈ పిల్లల పెంపకంలోనే చాలామంది తల్లిదండ్రులు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు.
పిల్లల పెంపకం విషయంలో భార్యాభర్తలు ఇద్దరికీ సరియైన అవగాహన ఉండటం లేదు. పిల్లల మీద వాళ్ల ఇష్టాలని రుద్దే క్రమంలో ఒకరికి ఒకరు ఘర్షణపడుతున్నారు. ఉదాహరణకి తనకి ఇష్టమైన డ్రస్సు బిడ్డకు వేయాలనుకుంటాడు తండ్రి.
కానీ అది నప్పదు ఇదే బాగుంటుంది అంటూ మరో డ్రెస్ చూపిస్తుంది భార్య. పిల్లల స్కూల్స్ విషయంలో కూడా అంతే ఒకరికి ఒక స్కూలు నచ్చుతుంది మరొకరికి మరొక స్కూలు నచ్చుతుంది. వాళ్ళని ఏ సిలబస్ చదివించాలనిది కూడా తల్లిదండ్రులకి పెద్ద సమస్యే.
అయితే ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు ఆలోచించేది మీ బిడ్డ గురించే ఇద్దరూ మీ బిడ్డ బాగు కోరుకునే వారే కాబట్టి ఇద్దరూ గొడవ పడకుండా మీ అభిప్రాయాలని కలిసి పంచుకోండి.
ఉదాహరణకి పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అని డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు మీరు చదివించాలనుకుంటున్న స్కూల్ పాజిటివ్ లు నెగిటివ్ లు రెండు బ్యారేజీ వేసుకోండి. చివరిగా ఒక ఇద్దరు కలిసి ఒక్క నిర్ణయానికి రండి అప్పుడే బిడ్డ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇద్దరు పోట్లాడుకునేది బిడ్డ కోసమే అయినప్పటికీ ఆ గొడవ ప్రభావం ఆ చంటి బిడ్డ మీద పడే ప్రమాదం ఉంది.
కాబట్టి బిడ్డ ఎదురుగుండా పోట్లాడుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా పిల్లవాడి యొక్క అభిప్రాయం తీసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే చదువ వలసింది అతనే కాబట్టి. సో తల్లిదండ్రులు జాగ్రత్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే మీ బిడ్డ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.