MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • Relationship: చిన్న విషయమే కదా అని వదిలేస్తున్నారా? 5 అలవాట్లు మార్చుకుంటే లైఫ్ అంతా హ్యాపీ

Relationship: చిన్న విషయమే కదా అని వదిలేస్తున్నారా? 5 అలవాట్లు మార్చుకుంటే లైఫ్ అంతా హ్యాపీ

Relationship: భార్యాభర్తల మధ్య ప్రతి గొడవా పెద్ద విషయంతోనే మొదలవ్వాల్సిన అవసరం లేదు. చాలా చిన్న విషయాలే విభేదాలకు దారి తీస్తుంటాయి. ముందుగా ఈ 5 అలవాట్లు మార్చుకుంటే ఎప్పటికీ గొడవలు ఉండవు

2 Min read
Author : Nandini Arava
Published : Oct 04 2026, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చిన్న విషయమే కదా అని వదిలేస్తున్నారా?
Image Credit : Asianet News

చిన్న విషయమే కదా అని వదిలేస్తున్నారా?

భార్యాభర్తల మధ్య ప్రతి గొడవా పెద్ద విషయంతోనే మొదలవ్వక్కర్లేదు. చాలా చిన్న విషయాలు విభేదాలకు దారి తీస్తుంటాయి. ఒక పని చేయమని చెప్పినా పట్టించుకోకపోవడం, ఏం జరిగిందని అడిగితే ఏమీ లేదని చెప్పడం.. మొదట ఇవన్నీ పెద్ద సమస్యలుగా అనిపించకపోవచ్చు.

అందుకే చాలామంది వాటిని అక్కడికక్కడే వదిలేస్తారు. కానీ అదే విషయం మళ్లీ మళ్లీ జరుగుతుంటే.. మనసులో బాధ, కోపం, అసంతృప్తి పెరిగిపోతాయి. చివరకు చిన్న కారణంతో మొదలైన గొడవ కూడా చాలా పెద్దదిగా మారుతుంది. దంపతుల మధ్య దూరాన్ని పెంచే కొన్ని రోజువారీ అలవాట్లు ఇవే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మనసులో ఉన్నది చెప్పకపోవడం
Image Credit : Gemini AI

మనసులో ఉన్నది చెప్పకపోవడం

మనసులో బాధను పెట్టుకుని దాని గురించి భాగస్వామికి చెప్పకుండా వాళ్లే అర్థం చేసుకోవాలని ఆశిస్తుంటారు. వారు కారణం తెలుసుకోలేకపోతే..తన గురించి పట్టించుకోవడం లేదనే భావన పెరుగుతుంది. అయితే, ఎదుటివారికి అసలు సమస్య ఏంటో తెలియకపోవచ్చు. అందుకే మనసులో పెట్టుకుని బాధపడటం కరెక్ట్ కాదు. వీలైతే మనసులోని ఆవేదన గురించి చెప్పుకోవడం మంచిది కంటే స్పష్టంగా చెప్పడం మంచిది.

36
ఎవరు ఎంత చేశారో లెక్కపెట్టుకోవడం
Image Credit : Ai

ఎవరు ఎంత చేశారో లెక్కపెట్టుకోవడం

గత వారం నేను నీ కోసం అది చేశాను.. ఇప్పుడు నువ్వు నా కోసం ఇది చేయాలనే ఆలోచన ఉండకూడదు. లేకపోతే రిలేషన్ లో లెక్కలు మొదలైనట్టే. ఇతరులతో పదేపదే పోల్చుకోవడం వల్ల ప్రేమతో చేసే పనులు కూడా బాధ్యతల్లా అనిపించవచ్చు. చివరకు చిన్న చిన్న విషయాల్లోనూ అసంతృప్తి పెరుగుతుంది.

46
భాగస్వామి ఎప్పుడూ అర్థం చేసుకుంటారని భావించడం
Image Credit : chatgpt

భాగస్వామి ఎప్పుడూ అర్థం చేసుకుంటారని భావించడం

వీకెండ్ ప్లాన్స్ రద్దు చేయడం, మాట్లాడాల్సిన విషయాన్ని రేపటికి వాయిదా వేయడం లేదా వాళ్ల సమయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం మొదట చిన్న విషయంగానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడూ తానే సర్దుకుపోవాల్సి వస్తోందనే భావన కలిగితే.. ఒక దశలో అది అలసటగా, అసంతృప్తిగా మారుతుంది.

56
కొత్త గొడవలో పాత తప్పులను తీసుకురావడం
Image Credit : chat gpt

కొత్త గొడవలో పాత తప్పులను తీసుకురావడం

సమస్య చిన్నదే అయినా.. గొడవ మధ్యలో ఎప్పుడో జరిగిపోయిన విషయాలను గుర్తుచేసుకోవడం కరెక్ట్ కాదు. అప్పుడు కూడా ఇలాగే చేశావు, గతంలో కూడా ఇదే జరిగింది అంటూ పాత విషయాలను పదేపదే ప్రస్తావిస్తే.. ఏ సమస్యా పరిష్కారం అవ్వదు.

66
గొడవ వస్తుందేమోనని మౌనంగా ఉండిపోవడం
Image Credit : AI Image

గొడవ వస్తుందేమోనని మౌనంగా ఉండిపోవడం

కొన్నిసార్లు మరో గొడవ ఎందుకులే అని ఏమీ లేదు.. అంతా బాగానే ఉందని చెప్పడం సులభంగా అనిపిస్తుంది. కానీ మనసులోని అసంతృప్తి అంతటితో పోదు. అది లోపలే పేరుకుపోతుంది. చివరకు మరో చిన్న విషయం జరిగినప్పుడు..ఇంతకాలంగా దాచుకున్న బాధ అంతా ఒక్కసారిగా బయటకు రావచ్చు. చిన్న విషయాలను పూర్తిగా మర్చిపోవడం, ప్రతి విషయాన్ని పెద్ద గొడవగా మార్చడం కూడా సంబంధానికి మంచిది కాదు. ఏదైనా బాధ కలిగిస్తే.. సరైన సమయంలో ప్రశాంతంగా మాట్లాడుకోవడం, ఒకరి మాటను మరొకరు వినడం ముఖ్యం. ఎందుకంటే పెద్ద గొడవలు చాలాసార్లు పెద్ద సమస్యలతో కాదు.. పరిష్కారం కాని చిన్న చిన్న విషయాలతోనే మొదలవుతాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
బంధుత్వం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Related Stories
Recommended image1
Protein Idli: ఈజీగా వెయిట్ లాస్‌ అవ్వాలంటే ఈ ప్రోటీన్ ఇడ్లీ ట్రై చేయండి..
Recommended image2
Hair Growth : జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలంటే తరచూ కట్ చేయాల్సిందేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved