MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Relationship
  • Relationship: సిట్యుయేషన్‌షిప్ అంటే ఏంటి.? Gen Z జ‌మానాలో కొత్త ప్రేమ క‌థ‌లు

Relationship: సిట్యుయేషన్‌షిప్ అంటే ఏంటి.? Gen Z జ‌మానాలో కొత్త ప్రేమ క‌థ‌లు

Relationship: కాలంతోపాటు సంబంధాలు కూడా మారుతున్నాయి. ముందు ప్రేమ, పెళ్లి వంటి స్పష్టమైన సంబంధాలు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు “సిట్యుయేషన్‌షిప్” (Situationship) అనే కొత్త రకమైన సంబంధం గురించి ఎక్కువగా వినిపిస్తోంది. ఇంత‌కీ ఇది ఏంటంటే?

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 28 2026, 05:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సిట్యుయేషన్‌షిప్ అంటే ఏమిటి?
Image Credit : Gemini AI

సిట్యుయేషన్‌షిప్ అంటే ఏమిటి?

సిట్యుయేషన్‌షిప్ అనేది ఇద్ద‌రి మ‌న‌సుల మ‌ధ్య ఉండే సంబంధమే. కానీ అందులో స్పష్టమైన కమిట్‌మెంట్ ఉండదు. ఉదాహరణకు, ఇద్దరూ మాట్లాడుకుంటారు, కలుస్తారు, దగ్గరగా ఉంటారు. కానీ “మనం రిలేషన్‌లో ఉన్నాం” అని చెప్పే స్థాయి మాత్రం ఉండదు. ఈ కారణంగా ఆ సంబంధం ఏ దిశగా వెళ్తుందో అర్థం కాకపోవచ్చు. ఇది ప్రేమలాగా కనిపించినా, అసలు సంబంధానికి స్పష్టమైన నిర్వచనం ఉండదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కమిటెడ్ రిలేషన్‌షిప్‌తో తేడా ఏంటి.?
Image Credit : Gemini AI

కమిటెడ్ రిలేషన్‌షిప్‌తో తేడా ఏంటి.?

ఒక స్థిరమైన సంబంధంలో ఇద్దరికీ స్పష్టత, నమ్మకం, భవిష్యత్తు గురించి ఆలోచనలు ఉంటాయి. కానీ సిట్యుయేషన్‌షిప్‌లో పరిస్థితి వేరుగా ఉంటుంది. సంబంధానికి స్పష్టమైన పేరు ఉండదు. ఒక రోజు చాలా దగ్గరగా ఉంటారు, మరో రోజు దూరంగా ఉంటారు. ఈ విధంగా వచ్చే మిక్స్‌డ్ సిగ్నల్స్ వల్ల చాలా మందికి గందరగోళం ఏర్పడుతుంది.

35
మీ సంబంధం ఏంటో ఎలా తెలుసుకోవాలి.?
Image Credit : Gemini AI

మీ సంబంధం ఏంటో ఎలా తెలుసుకోవాలి.?

మీరు కూడా ఈ తరహా సంబంధంలో ఉన్నారా అనేది కొన్ని ప్ర‌శ్న‌ల ద్వారా తెలుసుకోవ‌చ్చు. మీ ఇద్దరి మధ్య సంబంధం స్పష్టంగా ఉందా? కలుసుకునే ప్లాన్లు ఎప్పుడూ చివరి నిమిషంలోనే జరుగుతున్నాయా? చాలా కాలం అయినా మీ భాగస్వామి తన స్నేహితులకు పరిచయం చేయలేదా? ప్రేమగా మాట్లాడుతున్నా, “గర్ల్‌ఫ్రెండ్” లేదా “బాయ్‌ఫ్రెండ్” అని ఎప్పుడూ చెప్పలేదా? ఈ ప్రశ్నలకు ఎక్కువగా “అవును” అనే సమాధానం వస్తే, మీరు సిట్యుయేషన్‌షిప్‌లో ఉండే అవకాశముంది.

45
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
Image Credit : Gemini AI

మానసిక ఆరోగ్యంపై ప్రభావం

ఇలాంటి సంబంధాలు మొదట్లో సరదాగా అనిపించినా, తరువాత మానసిక ఒత్తిడిని పెంచవచ్చు. ఇది జంక్ ఫుడ్‌లాంటిదని నిపుణులు చెబుతున్నారు. మొదట్లో ఆనందంగా అనిపించినా, చివరికి సంతృప్తి ఇవ్వదు. సంబంధంలో స్పష్టత లేకపోవడం వల్ల.. అసురక్షిత భావన, ఆత్మవిశ్వాసం తగ్గడం, భావోద్వేగ గందరగోళం లాంటి సమస్యలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

55
ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి?
Image Credit : Gemini AI

ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి?

సిట్యుయేషన్‌షిప్‌లో ఎక్కువగా ఒకరు మాత్రమే ఎక్కువగా అనుబంధం పెంచుకుంటారు. మరో వ్యక్తి మాత్రం దూరంగా ఉంటూ తన అవసరాలకే ప్రాధాన్యం ఇస్తాడు. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మీ భావాలను స్పష్టంగా చెప్పాలి, సంబంధం గురించి క్లారిటీ అడగాలి, కమిట్‌మెంట్ లేకపోతే ముందుకు వెళ్లకుండా ఆలోచించాలి. ఎవరైనా వ్యక్తి సంబంధానికి స్పష్టత ఇవ్వకుండా ఉంటే, అది కూడా ఒక సమాధానమే అని గుర్తించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Related Stories
Recommended image1
TATA Tiago: క్ల‌చ్ నొక్కి నొక్కి కాలు నొప్పి పుడుతుందా.? ఈ కారు కొంటే బిందాస్‌.
Recommended image2
Smart TV: చ‌వ‌క బాబోయ్ చ‌వ‌క‌.. రూ. 74 వేల స్మార్ట్ టీవీ, రూ. 26 వేల‌కే.. 55 ఇంచెస్‌తో భారీ స్క్రీన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved