- Home
- Business
- Smart TV: చవక బాబోయ్ చవక.. రూ. 74 వేల స్మార్ట్ టీవీ, రూ. 26 వేలకే.. 55 ఇంచెస్‌తో భారీ స్క్రీన్
Smart TV: చవక బాబోయ్ చవక.. రూ. 74 వేల స్మార్ట్ టీవీ, రూ. 26 వేలకే.. 55 ఇంచెస్‌తో భారీ స్క్రీన్
Smart TV: ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్ద స్క్రీన్ టీవీలకు డిమాండ్ పెరిగింది. పెరిగిన పోటీ నేపథ్యంలో బ్రాండెండ్ కంపెనీలు కూడా తక్కువ ధరకు టీవీలను అందిస్తున్నాయి. అమెజాన్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉన్న బెస్ట్ టీవీపై ఓ లుక్కేయండి.

పెద్ద స్క్రీన్, అద్భుతమైన 4K డిస్‌ప్లే
అసర్ జీ ప్లస్ సీరీస్‌కు చెందిన ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పెద్ద స్క్రీన్‌తో ఆకట్టుకుంటుంది. 4K Ultra HD రిజల్యూషన్ (3840 x 2160) ఉండటంతో వీడియోలు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. LED డిస్‌ప్లే టెక్నాలజీ ఉపయోగించిన ఈ టీవీ 16.7 మిలియన్ రంగులను చూపించగలదు. HDR10 సపోర్ట్ ఉండటం వల్ల రంగులు మరింత సహజంగా కనిపిస్తాయి. 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉండటంతో ఎక్కడ కూర్చున్నా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్రేమ్‌లెస్ డిజైన్ కారణంగా టీవీ మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. అలాగే సూపర్ బ్రైట్నెస్, బ్లాక్ లెవల్ అగ్యూమెంటేషన్ వంటి ఫీచర్లు డిస్‌ప్లే క్వాలిటీని మరింత మెరుగుపరుస్తాయి.
గూగుల్ టీవీ ఫీచర్లు – స్మార్ట్ ఎంటర్టైన్‌మెంట్
ఈ టీవీలో Google TV ప్లాట్‌ఫామ్ ఉంటుంది. ఇది యూజర్ల అభిరుచులకు అనుగుణంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, వీడియోలను సూచిస్తుంది. టీవీలో 2GB RAM, 16GB స్టోరేజ్ ఉంటుంది. అందువల్ల యాప్స్ సులభంగా పనిచేస్తాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి యాప్స్‌కు రిమోట్‌లోనే ప్రత్యేక బటన్లు ఉంటాయి. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉండటంతో వాయిస్ కమాండ్లతో టీవీని నియంత్రించవచ్చు. వ్యక్తిగత ప్రొఫైల్, కిడ్స్ ప్రొఫైల్, వాచ్‌లిస్ట్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. Google Cast, Fastcast ద్వారా మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లోని కంటెంట్‌ను టీవీలో చూపించవచ్చు.
శక్తివంతమైన సౌండ్ సిస్టమ్
ఈ టీవీలో ప్రో ట్యూన్డ్ హై ఫ్రెండ్లీ స్పీకర్స్ ఉంటాయి. మొత్తం 36 వాట్స్ సౌండ్ అవుట్‌పుట్ అందుతుంది. Dolby Atmos సపోర్ట్ ఉండటంతో థియేటర్ అనుభూతి కలిగించే సౌండ్ వస్తుంది. సినిమాలు, మ్యూజిక్, స్పోర్ట్స్ వంటి అవసరాలకు అనుగుణంగా 5 ప్రజెంట్ స్మార్ట్ ఈక్వలైజర్ మోడ్‌లు అందుబాటులో ఉంటాయి. దీంతో వినిపించే శబ్దం మరింత స్పష్టంగా ఉంటుంది. ధర విషయానికొస్తే ఈ టీవీ అసలు ధర రూ. 73,999కాగా అమెజాన్‌లో ఏకంగా 64 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ టీవీ ప్రస్తుతం రూ. 26,999కి అందుబాటులో ఉంది. అయితే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 900 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఆఫర్లన్నీ కలుపుకొని ఈ టీవీని రూ. 26 వేలకే పొందొచ్చన్నమాట.
కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు
ఈ స్మార్ట్ టీవీలో అనేక కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. డ్యూయల్ బాండ్ వైఫై, 2-వే బ్లూటూత్5.0 సపోర్ట్ ఉంటుంది. ఇందులో HDMI 2.0 పోర్ట్స్ – 3 (ల్యాప్‌టాప్, గేమింగ్ కన్సోల్, సెటాప్ బాక్స్ కనెక్ట్ చేయడానికి), USB 2.0 పోర్ట్స్ – 2 (పెన్ డ్రైవ్ లేదా హార్డ్ డ్రైవ్ కోసం), AV, RF, Ethernet పోర్ట్స్, హెడ్‌ఫోన్ జాక్ ఇచ్చారు. అదనంగా వీడియో కాలింగ్ సపోర్ట్, ఐ కేర్ ప్రొటెక్ట్ ఫీచర్, మీటింగ్ మోడ్ వంటి ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
డిజైన్, పవర్ వినియోగం, ధర వివరాలు
ఈ టీవీ షెల్ బాడీ డిజైన్‌తో బలంగా తయారు చేశారు. టీవీ పరిమాణం 8.1D x 123.1W x 71.3H సెంటీమీటర్లు. ఎనర్జీ రేటింగ్ 2 స్టార్ కాగా, సంవత్సరానికి సుమారు 215 kWh విద్యుత్ వినియోగం ఉంటుంది. టీవీ ప్యాకింగ్‌లో 1 LED TV, 2 టేబుల్ స్టాండ్ బేస్, రిమోట్ కంట్రోల్, 2 AAA బ్యాటరీలు, పవర్ కార్డ్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అందిస్తారు. కొనుగోలు చేసిన తేదీ నుంచి 2 సంవత్సరాల పూర్తి వారంటీ కూడా ఉంటుంది.

